గ్యాంగ్ లీడర్ (1991)

చిక్ చిక్ చేలం

చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం: బప్పిలహరి

గీతరచయిత: భువనచంద్ర

నేపధ్య గానం: బాలు


పల్లవి :


చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ

చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా

చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా

చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా



పాపా రీటా ఆపై వేట హొ

ఆడితే ఆట హ.హ. ఇస్తా కోటా హా

G.A.N.G. gang gang బజావో bang bang

Gang Leader...



షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప

రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప హు.హు.హు.హు.హు.

కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే

కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే


G.A.N.G. gang gang బజావో bang bang

Gang Leader...



చరణం 1 :


బ్రహ్మ రాతని రిబబ్బాబబ కృష్ణగీతని రిబబ్బాబబ

మళ్ళీ రాస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.

స్వర్ణయుగంలో రిబబ్బాబబ స్వర్గసుఖాన్ని రిబబ్బాబబ

మళ్ళీ తెస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.

ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ

ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే



G.A.N.G. gang gang బజావో bang bang

Gang Leader...



చరణం 2 :


ఆవేశంలో రిబబ్బాబబ భగత్‌సింగ్‌కి రిబబ్బాబబ

భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.

ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్‌కి రిబబ్బాబబ

శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.

ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ

రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా



G.A.N.G. gang gang బజావో bang bang యా

Gang Leader...




చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం: బప్పిలహరి

గీతరచయిత: భువనచంద్ర

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


పని సాసస పని సాసస

సగ మామమ సగ మామమ అరె హా..హా..

ఆ...సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా

నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..

చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నాను రా

నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..

పని సాసస మ్మ్ మ్మ్ పని సాసస హహ హాహహా

సగ మామమ హేహె హెహెహే సగ మామమ ఓహొహో అరె హా..హా..


చరణం 1:


బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో

మన మధ్య తడికెందుకంట... బావోయ్...

ముద్దుల్లో ముంచెత్తమంట


గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో

నసమాని దయచేయమంట... పిల్లా..

నువ్వంటే నాకొళ్ళు మంట


అదిగో పక్క.. ఇదిగో చుక్క..

అసలే ఉక్క... పోవే తిక్క...


అరె హా..హా..పని సాసస పని సాసస

సగ మామమ సగ మామమ అరె హా..హా..యా

సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా

నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..


చరణం 2:


ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా

చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో...

ఒళ్ళంతా సెగలే బావయ్యో..


ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా

నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా

నీ పిచ్చి కుదిరిస్తానమ్మో..


అయ్యో రాత... వినవా గీత..

ఆపై మోత... పెడతా వాత...

అరె హా..హా..


చక చాచచ మ్మ్ మ్మ్ చక చాచచ హహ హాహహా

ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా తుతు తూతుతు హహ హాహ

అరె హ.హ.హ.హ.హ.హ హాహా


సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా

నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..

చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా

నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..




చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991) 

సంగీతం: బప్పిలహరి 

గీతరచయిత: భువనచంద్ర 

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 


వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె 

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా 

ఏదో.. ఏదో..ఏదో.. హాయి 


వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె 

ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా 

ఏదో.. ఏదో.. ఏదో.. హాయి 


చరణం 1: 


చక్కని చెక్కిలి చిందే అందపు గంధం 

పక్కన చేరిన మగమహరాజుకి సొంతం 

హో తొలకరి చిటపట చినుకులలో మకరందం 

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం 

చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా 

ఏదో.. ఏదో.. ఏదో.. హాయి 

వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె... 


చరణం 2: 


ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా 

ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా 

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా 

బిగిసిన కౌగిట కరిగించెను పరువాల 

కలవరింతలే పలకరింపులై పదును మీరగా 

ఏదో.. ఏదో.. ఏదో.. హాయి 


వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె 

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా 

ఏదో.. ఏదో.. ఏదో..హాయి 


వాన వాన వెల్లువాయె కొండకోన తుళ్ళిపోయె 

ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా 

ఏదో.. ఏదో.. ఏదో... హాయి




చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం: బప్పిలహరి

గీతరచయిత: భువనచంద్ర

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


వయసు వయసు వయసు వరసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

ప్రతిసారి వేసారి శృతిమీరే

సుఖమయ ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

ప్రతిసారి వేసారి శృతిమీరే

సుఖమయ ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం


చరణం 1:


ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిలి భోజనం

సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం

మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం

తొలివలపుల సంతర్పణం

మరెందుకాలస్యం

నయమారా దరిచేరా బిగువేరా

సరసకు రారా వీరా ధీరా


వయసు వయసు వయసు వరసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం


చరణం 2:


నీవేలేని నేనట నీరేలేని ఏరట

కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ

తారా తారా సందున ఆకాశాలే అందునా

నీకు నాకు వంతెన

అమాస వెన్నెలలో

పరువాన స్వరవీణ మృదుపాణి

సరస మధురలయ లావణి పలికిన


వయసు వయసు వయసు వరసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

ప్రతిసారి వేసారి శృతిమీరే

సుఖమయ ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వరసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం




చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం: బప్పిలహరి

గీతరచయిత: భువనచంద్ర

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ

కావాలా నీకండాదండ...

టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి

టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి

టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి


కొండవీటి దొంగ మోగించు వైభవంగా

సన్నాయి డోలు సమ్మేళంగా...


టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర

టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర

టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా


చరణం 1:


ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ తొక్కేశా ఫట్ ఫటాఫట్ కొట్టేశా రో

జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ కిస్సెట్టి ఛం ఛమాఛం వాటేశారో


ధం ధమాధం దుప్పట్లో ధన్ ధనాధన్ దూరేసి ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో

జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి ఛం ఛమాఛం పోతుందమ్మో


టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర

టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా

టప్పు టప్పు...

టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి

టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి


కొండవీటి దొంగ మోగించు వైభవంగా

సన్నాయి డోలు సమ్మేళంగా...

హోయ్..టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి

టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర

టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా


చరణం 2:


హొయ్... వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగించనా

వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్న మతే పోయిందిరో


అరెరెరె.. సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటపడి వేధించకే

నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద సొంతం కాదంటే ఎట్టాగయ్యో


అరెరెరెరె... టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి

టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర

టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా


హోయ్ భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ

కావాలా నీకండాదండ...

టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి

టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి

కొండవీటి దొంగ మోగించు వైభవంగా

సన్నాయి డోలు సమ్మేళంగా...

టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోర

టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారా




చిత్రం: గ్యాంగ్ లీడర్ (1991) 

సంగీతం: బప్పిలహరి 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 

పాలా బుగ్గా ఇదిగో పట్టు 

ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు 

జారే పైటా చప్పున పట్టు 

దక్కాలంటే తాళి కట్టు 

నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు 

లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా 

కామన్ ప్రేమను భామను ముగ్గు లోకి దించాలా 

ఐ లవ్ యు నా మంత్రం 


చరణం 1: 


కంట్లో కధేమిటంట వంట్లో కసేమిటంట 

ఎత్తేయి బావుటా 

నిన్నే నిలేసుకుంట నీతో పెనేసుకుంట 

లేదోయి అలసట 

పిల్ల సరేను అంటే మళ్లీ సరగామంటా 

లాగించు ముచ్చటా 

ఈడే వీలాసమంటా తోడై కులసాగుంటా 

సిగ్గే చిటపటా 

హా హా హో హో 

హా హే హా హా 

త్తై తక్ త్తై తక్ త్తై తక్ తాళమే వెయ్యాలా 

నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా 

ఐ లవ్ యు నా మంత్రం 


పాలా బుగ్గా ఇదిగో పట్టు 

ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు 

జారే పైటా చప్పున పట్టు 

దక్కాలంటే తాళిని కట్టు 

నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు 


చరణం 2: 


నాలో వసంత గాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా 

ఏదో తుఫాను రేగి నాలో ఊయ్యాలలూగి నీలో కలవగా 

నాలో శివాలు రేపే నిన్నే సవాలు చేసే అందం పండగా 

షోకే సలాము చేసే నీకే గూలాము కానీ దమ్మే దండగా 

హా హా హో హో 

హా హే హా హా 


త్తై తక్ త్తై తక్ త్తై తక్ తాళమే వెయ్యాలా 

నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా 

ఐ లవ్ యు మన మంత్రం 


పాలా బుగ్గా ఇదిగో పట్టు 

ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు 

అరే జారే పైటా చప్పున పట్టు 

దక్కాలంటే తాళిని కట్టు 

నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు

No comments:

Post a Comment