నారి నారి నడుమ మురారి (1990)

చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి:


మనసులోని మర్మమును తెలుసుకో...

నా మనసులోని మర్మమును తెలుసుకో...

మాన రక్షకా.. మరకతాంగ

మానరక్షకా.. మరకతాంగ


నా మనసులోని మర్మమును తెలుసుకో...

నా మనసులోని మర్మమును తెలుసుకో...

మదన కీలగ.. మరిగిపోక..

మదనకీలగ...మరిగిపోక..

నా మనసులోని మర్మమును తెలుసుకో


చరణం 1:


ఇనకులాబ్ధ.. నీవేకాని వేరెవరులేరు

దిక్కెవరు లేరు

ఆనంద హృదయా.. మనసులోని మర్మమును తెలుసుకో


అనువుగాని ఏకాంతాన.. ఏకాంతకైనా

ఆ కాంక్ష తగున.. రాకేందు వదనా


మనసులోని మర్మమును తెలుసుకో


చరణం 2:


మునుపు ప్రేమగల దొరవై

సదా తనువునేలినది గొప్ప కాదయా


మదిని ప్రేమ కథ మొదలై

ఇలా అదుపుదాటినది ఆదుకోవయా


కనికరమ్ముతో ఈ వేళ..ఊ..ఊ..ఊ..

కనికరమ్ముతో ఈ వేళ.. నా కరముబట్టు.. ఆ..

త్యాగరాజ వినుతా..


మనసులోని మర్మమును తెలుసుకో

నా మనసులోని మర్మమును తెలుసుకో


చరణం 3:


మరుల వెల్లువల వడినై

ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా


మసక వెన్నెలలు ఎదురై

ఇలా తెగువ కూడదని మందలించవా


కలత ఎందుకిక ఈ వేళా?? ఆ..ఆ..ఆ..

కలవరమ్ముతో ఈ వేళ..నా కరము వణికే..ఆ..ఆ

ఆగాడాల వనితా..


మనసులోని మర్మమును తెలుసుకో

మదనకీలగ..మరిగిపోక

మానరక్షక.. మరకతాంగ

నా మనసులోని మర్మమును తెలుసుకో


చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి: 

పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ 
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ 
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా.. 
కంచె దాటింది ఆత్రాల గోలా... 

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ 
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 
మ్మ్... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

చరణం 1: 

తరిమే తరుణంతో పరువం తడబడుతోంది 
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది 
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది 
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది 

మనసే నీకోసం... ఏటికి ఎదురీదింది 
మురిపెం తీరందే... నిదురను వెలివేస్తుంది 
చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది 
ఆ... ముడులేసే మనువైతే మక్కువ మత్తుగ దిగుతుంది 

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా.. 
కంచె దాటింది ఆత్రాల గోలా... 

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ 
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 

చరణం 2: 

సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది 
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది 
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది 
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది 

వీచే ప్రతిగాలీ... వయసును వేధిస్తోంది 
జతగా నువ్వుంటే... పైటకు పరువుంటుంది 
మితిమీరె మొగమాటం అల్లరి అల్లిక అడిగింది 
ఆ... మదిలోని మమకారం మల్లెల పల్లకి తెమ్మంది 

ఆ..... 

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా.. 
కంచె దాటింది ఆత్రాల గోలా... 
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ 
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ 
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి 
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి



చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి:

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గోలో ఉరుముతున్నదీ
ఆట పాట చూపీ అటూ ఇటూ లాగేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...

చరణం 1:

చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసిందీ
ఉలికిపడి తలపేదో కలల గడి తీసిందీ
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే
ఇన్నాళ్ళూ ఆ..ఆ..
ఓరగ దాగెను వయ్యారం ఓగున పాడెను శృంగారం
ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది

ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...

చరణం 2:

మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో
మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిపిందో
ఏమైందో ఏమోనమ్మా
ఏనాడో రాసుందమ్మా
ఇన్నాళ్ళూ ఆ.. ఆ..
ఉడుకున ఉడికిన బిడియాలు ఒడుపుగ ఒలికెను చెలికాడు
నా చూపు నచ్చిందొ నాజూకు ఇచ్చింది

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
హ్మ్...


చిత్రం: నారి నారి నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ద్వాపరమంతా సవతుల సంతా జ్ఞాపకముందా గోపాలా
కలియుగమందూ ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోలా
కాపురాన ఆపదలని ఈదిన శౌరీ .. ఏదీ నాకూ చూపవా ఒక దారీ
నారీ నారీ నడుమ మురారీ .. నారీ నారీ నడుమ మురారీ

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ తల మునకలుగా తడిసితివా

చిరుబురులాడేటీ శ్రీదేవీ నీ శిరసును వంచిన కథ కన్నా
రుసరుస లాడేటీ భూదేవీ నీ పరువును తీసినా కథ విన్నా
గోవిందా...ఆ.. గోవిందా...ఆ.. గోవిందా...
సాగిందా జోడు మధ్యల సంగీతం .. బాగుందా భామలిద్దరి భాగోతం

చరణం 1:

ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా .. అన్నాడు ఆ యోగి వేమనా
నాతరమా భవసాగర మీదనూ .. అన్నాడు కంచెర్ల గోపన్నా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటలు విని ముంచకు స్వామీ గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే .. సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే .. సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. ఇరుకున పడి నీవు నలిగితివా

చరణం 2:

భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా .. అన్నాడు ఆ నంది తిమ్మనా
ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని .. అన్నాడు సాకేత రామన్న
ఎదునాథా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాథా సీతను గొని విడు శూర్పణఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే .. భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
రాసలీలలాడాలని నాకు లేదులే .. భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే

ఇరువురు భామల కౌగిలిలో స్వామీ .. ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ తల మునకలుగా తడిసితివా
గోవిందా...ఆ.. గోవిందా...ఆ.. గోవిందా...

No comments:

Post a Comment