మహానాయకుడు (2019)



నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

తల్లి ఏదీ? తండ్రి ఏడీ?
అడ్డుతగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసు పొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్లు
నీదంటు ఏ చింత
సుంతైన లేని ఈ నేలపై
నడయాడు ఋషివో..

కృషితో నాస్తి దుర్భిక్షమని
లోకాన్ని శాసించు మనిషివో..
ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో..
నీవెవరివో.. ఎవరివో..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

జాగృతములో జాగు ఏదీ?
రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా..
అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగీ

కదనరంగాన కర్మయోగీ..

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు
నిష్క్రియాప్రచ్ఛన్న సంగ్రామ శ్రామికుడు ఇతడు
నిరత సంఘశ్రేయ సంధాన భావుకుడు ఇతడు
మహా నాయకుడు ఇతడు...
మహా నాయకుడు ఇతడు...

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..


 చిత్రం: మహానాయకుడు (2019)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : శంకరాచార్య నిర్వాణ షట్కము,
కె.శివదత్త, కె.రామకృష్ణ, కీరవాణి
గానం : శరత్ సంతోష్, మోహన భోగరాజు,
కీరవాణి, కాలభైరవ, శ్రీనిధి తిరుమల

రాము(1968)

రాము (04-05-1968)
(అనప్పిండి సూర్య లక్ష్మీ కామేశ్వర రావు)

1968 లో విడుదలైన 58 తెలుగు చిత్రాలు గమనిస్తే ఎన్ టి ఆర్ 11 చిత్రాలలో, కృష్ణ 11 సినిమాలలో, అక్కినేని 5 చిత్రాలలో, కాంతారావు 13 చిత్రాలలో, శోభన్ బాబు 7 చిత్రాలలో, హరనాధ్ 6 సినిమాలలో, ఇతరులు 8 చిత్రాలలో నటించారు. జయలలిత 5 తెలుగు చిత్రాలలో , కాంచన 9 చిత్రాలలో, జమున 9 చిత్రాలలో నటించారు. సి ఎస్ రావు 7 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జి వర లక్ష్మి, సావిత్రి దర్శకురాళ్ళుగా మారారు.
ఎన్ టి ఆర్ నటించిన రాము (04-05-1968) ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా రజతోత్సవం, 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది. ఎన్ టి ఆర్ నటించిన తల్లి ప్రేమ (09-03-1968), నిండు సంసారం (05-12-1968), నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968), అక్కినేని నటించిన మంచి కుటుంబం కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

ఇవి కాక ఎన్ టి ఆర్ నటించిన భాగ్య చక్రం , ,ఉమా చండీ గౌరీ శంకరుల కధ, కలిసొచ్చిన అదృష్టం, తిక్క శంకరయ్య, నిన్నే పెళ్ళడతా, నేనే మొనగాణ్ని, బాగ్దాద్ గజ దొంగ,
అక్కినేని నటించిన గోవుల గోపన్న, బంగారు గాజులు, బ్రహ్మచారి, సుడి గుండాలు,
కృష్ణ నటించిన అసాధ్యుడు, నిలువుదోపిడి, మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్ , అమాయకుడు, అత్తగారు కొత్త కోడలు, నేనంటే నేనే, ఉండమ్మా బొట్టు పెడతా, చెల్లెలికోసం, వింత కాపురం , లక్ష్మీ నివాసం,
కాంతారావు నటించిన అగ్గి మీద గుగ్గిలం, ఎవరు మొనగాడు, పేదరాసి పెద్దమ్మ కధ, భలే మొనగాడు, రాజ యోగం, రణ భేరి, సతీ అరుంధతి, దేవ కన్య, వీరపూజ , వీరాంజనేయ, జీవిత బంధం, కుంకుమ భరిణ, జీవిత బంధం,
శోభన్ బాబు నటించిన కలసిన మనసులు, చుట్టరికాలు, మన సంసారం, పంతాలు పట్టింపులు, భార్య, లక్ష్మీ నివాసం, కుంకుమ భరిణ,
హరనాధ్ నటించిన బంగారు సంకెళ్ళు, పెళ్ళి రోజు, నడ మంత్రపు సిరి, చల్లని నీడ, పాల మనసులు, సుఖ దుఖాలు,
ఇతరులు నటించిన పాప కోసం , భలే కోడళ్ళు, మూగ జీవులు, చిన్నారి పాపలు, లక్ష్మీ నివాసం, బాంధవ్యాలు, గ్రామ దేవతలు, బంగారు పిచిక , విడుదలయ్యాయి.
04-05-2020 కు 52 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాము చిత్రం విశేషాలు:-
ఏ.వి.మెయ్యప్పన్ 1938లో అల్లి అర్జున్ తో 1940 ప్రగతి స్టూడియోస్ ప్రారంభించి, కొన్ని చిత్రాలు రూపొందించారు. 1945లో మద్రాస్ లో శాంథోంలో ఎ.వి.యం.స్టూడియోస్ ప్రారంభించి పలు చిత్రాలు రూపొందించారు. వైజయంతి మాల నటిగా పరిచయమైన, ‘జీవితం’ చిత్రం వారి విజయవంతమైన చిత్రాల్లో ఒకటి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సంఘం, భూకైలాస్, లేత మనసులు, భక్త ప్రహ్లాద, చిట్టి చెల్లెలు , రాము మొదలైన 100 పైగా చిత్రాలను నిర్మించిన సంస్థ. ఏ.వి.ఎం. 1968లో ఈ సంస్థ రూపొందించిన చిత్రం ‘రాము’.

1958లో అమెరికన్ చిత్రం ‘‘ది ప్రౌడ్ రెబల్’’ ఆధారంగా ప్రముఖ ప్లేబాక్ సింగర్, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, దర్శకుడు, ఆల్ రౌండర్ ఏ మేన్ ఆఫ్ ఆల్ వర్ట్యూస్ అయిన హిందీ నటుడు కిషోర్ కుమార్ 1964లో నిర్మించిన చిత్రం ‘‘దూర్ గగన్కి చాహున్ మైయి’’ తమ కిషోర్ ఫిలిమ్స్ బేనర్ పై కిషోర్ కుమార్ , సుప్రియాచౌదరి, అమిత్ కుమార్ కాంబినేషన్లో నిర్మించారు.
ఆ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు 1966లో ఎ.సి.త్రిలోక్చందర్ దర్శకత్వంలో, జావర్ సీతారాం స్క్రీన్ప్లే, సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్, సమకూర్చగా, జెమిని గణేషన్, పుష్పలత, కె.ఆర్.విజయ, మాస్టర్ రాము, ఎస్.ఎ.అశోకన్ కాంబినేషన్లో, యం.మురుగన్, కుమారన్, యం.శరవణన్, యం.బాలసుబ్రమణ్యం, నిర్మాతలుగా ‘రాము’ తమిళ చిత్రం రూపొందించారు. ఈ తమిళ చిత్రం ఆధారంగా ఏ.వి.యం.వారు నిర్మించిన తెలుగుచిత్రం రాము. ‘‘ఉమా ప్రొడక్షన్స్ సమర్పణ’.

నిర్మాణం: ఎ వి ఎం ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎం మురుగన్, ఎం కుమరన్, ఎం శరవణన్
దర్శకత్వం: ఎ సి త్రిలోక్చందర్, ఎం ఏ
స్క్రీన్ ప్లే : సీతారామన్ ఎం ఏ బి ఎల్
మాటలు : డి వి నరసరాజు, బి ఏ
పాటలు: దాశరధి, కొసరాజు, ఆరుద్ర
సంగీతం: ఆర్ గోవర్ధనం
కెమెరా: జి రాజగోపాల్
శవ్దగ్రహణం : జె ఏ మాణిక్యం
కథ, సంవిధానం జావర్ సీతారాం,
స్టంట్స్- శ్యాంసుందర్,
ఎడిటింగ్-ఆ.జి.గోపు,
నృత్యం-ఎ.కె.చోప్రా.
తారాగణం : నట రత్న పద్మశ్రీ ఎన్ టి రామారావు బి ఏ, రేలంగి, ఎస్ వి ఆర్, రాజనాల, పద్మనాభం, రమణా రెడ్డి, పద్మశ్రీ నాగయ్య, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, మాస్టర్ రాజకుమార్, జమున, గీతాంజాలి, సూర్యాకాంతం, విజయ లక్ష్మి, పుష్పలత తదితరులు.

మిలటరీనుంచి సిపాయి రాజా (ఎన్.టి.రామారావు) సెలవులకి ఇంటికి వచ్చి భార్య సీత (పుష్పలత) , కొడుకు రాము (మాస్టర్ రాజ్కుమార్) తండ్రి వంటి పక్కింటి వెంకట్రామయ్య (పెరుమాళ్ళు)లతో సంక్రాంతి పండుగ జరుపుకొని, పైనుంచి టెలిగ్రాం రావటంతో తిరిగి యుద్ధానికి వెళతాడు. రాజా విజృంభించి, సైన్యంలో పోరాడడం, తోటి సిపాయి సింగన్న (రామదాసు) ఆ సమయంలో మరణించటం జరుగుతుంది. గజదొంగ పులి (సత్యనారాయణ) తన గుంపుతో రాజా గ్రామంపై దాడి చేసి దోపిడీలు సాగించి వూరు తగలబెడతాడు. ఆ మంటల్లో సీత మరణించటం చూసిన రాము మూగవాడవుతాడు.
రాజు యుద్ధరంగం నున్డి ఎంతో సంతోషంగా భార్యా బిడ్డలని కలుసుకోవాలని వస్తాడు. రైలులో తోటి జవాన్లతో ఉత్తరం రాయకుండా తనవారికి సర్ప్రైజ్ ఇస్తున్నానని ఆనందం గా చెబుతాడు. ఊరికి పడవలో వస్తూ ఇంకా కొంత దూరం ఉండగానే పడవ దూకి ఒడ్డుకు రావడం, అతని ఆత్రుత తెలుపుతుంది.

ప్రతి రోజూ తండ్రికోసం రాము ఆ ఏటి ఒడ్డున చూస్తూ ఉంటాడు మూగగా. రాజు రావడం ముందుగా వాసనతో తెలుసుకున్న వారి పెంపుడు కుక్క , రాజు రాకని రాముకు తెలపడంవంటి చిన్న చిన్న వివరాలు ఏ సి త్రిలోకచందర్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి.
రాజుకు తన భార్య చనిపోయిందని, కొడుకు మూగపోయాడని తెలుస్తుంది. ఆవేదన చెందుతాడు. తల్లి సమాధివద్ద అమ్మా అని పిలు నాయనా అని ఆర్తితో చెబుతాడు కొడుకుతో. రాము ఎంత ప్రయత్నించినా గొంతు పెగలదు.
కొడుకును తీసుకుని, పెంపుడు కుక్క జాకీతో డాక్టరుకు చూపించాలని రాజు పట్నం బయలుదేరతాడు. దారిలో కట్టెలు పడి పోయినదుకు రామును కొట్టిన వ్యక్తికి (రాజనాల)బుద్ధి చెబుతాడు. కాని అతను తలమీద కొట్టినదొంగ దెబ్బకు రాజు రోడ్డుమీద పడిపోతాడు. సిపాయి సింగన్న కూతురు లక్ష్మి (జమున) ఆ దారిలోనే బండిలో వస్తూ, చూసి తన ఇంటికి తీసుకు వెళ్ళీ డాక్టర్ ను పిలిపించి చికిత్స చేయిస్తుంది. మూగపోయిన రామును ఆదరిస్తుంది.రాజుపై అనురాగం పెంచుకుంటుంది.
ఆమె ఆస్తి అనుభవిస్తున్న ఆమె మేనమామ గంగన్న (రేలంగి) రంగన్న (రాజనాల)ల నుండి ప్లీడరు ద్వారా ఆమె స్వాధీనం చేసుకున్న ఆస్తిని కాపాడి, ఆమె పొలం సాగుచేసి, ఆ వూరి పేద రైతులకు, లక్ష్మికి అండగా నిలుస్తాడు. మూగవాడయిన రామును లక్ష్మి కన్నబిడ్డలా ఆదరిస్తుంది. రాజాపై ఆశలుపెంచుకున్న ఆమె ప్రేమను రాజా అంగీకరించడు.
రాముకు శస్త్ర చికిత్స చేయించడానికి రాజు మద్రాసు వెడతాడు. అక్కడ డబ్బు పోగొట్టుకుని, డాక్టర్ రాముకు మాట రాదని చెబితే నిరాశతో, సముద్రంలో పడి ప్రాణాలు తీసుకోబోతాడు రాము. దూరాన దేవాలయం నున్చి దేవుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు అన్న గీతం విని, రాజు , రాముతో గుడిలోకి వెళతారు. అన్ని దారులూ మూసుకు పోయాకా, రాజు, రాము సీత ఉన్న వూరు చేరతారు.
గ్రామంచేరిన రాజా దోపిడి దొంగ ‘పులి’ ఆటకట్టించి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. రామూను, బంధించి లక్ష్మిని స్వాధీనం చేసుకోవాలనుకున్న రంగన్న, రాజా రాకతో, ఆ ఇంటికి నిప్పుపెట్టడం, మంటల్లో స్పృహ కోల్పోయిన లక్ష్మిని చూసి బందీగావున్న రామూ ‘అమ్మా’అని పిలవటంతో అతనికి ‘‘మాట’’రావటం జరుగుతుంది. రంగన్నను పోలీసులు అరెస్ట్ చేయటం, అంతకుముందే, బావిలో కాలుజారిపడి గంగన్న మరణించటంతో మంచివాడు చిన్నవాడు వెంకన్న (పద్మనాభం) ఒంటరి వాడు కావటం, చివరకు రాజా, లక్ష్మీ ప్రేమను అంగీకరించి ఆమెతో జీవితం పంచుకోవటానికి అంగీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
హిందీలో కిశోర్ కుమార్ నిర్మించిన దూర్ గగన్ కే చాన్ మే చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అయితే హాస్య నటుడైన కిశోర్ కుమార్ తొలిసారిగా ధరించిన సీరియస్ పాత్ర అది. తెలుగులో తేలిక, బరువు పాత్రలు సునాయాసంగా నటించే ఎన్ టి ఆర్ మహాద్బుతంగా నటించారు.
అలాగే మాస్టర్ రాజకుమార్ రాముగా గొప్పగా నటించాడు. సీతగ జమున, పిచ్చివాడిగా ఎస్ వి ఆర్ తమ నటనతో మెప్పించారు. రేలంగి, రాజనాల, పద్మ నాభం (తండ్రీ కొడుకులు), హాస్యం అందించారు.
ఈ చిత్రంలో లాయర్ గా అల్లురామలింగయ్య, డ్రామా ఆర్టిస్టులుగా మాణిక్యం (సూర్యాకాంతం), రత్నంగా గీతాంజలి, ఆశీర్వాదంగా రమణారెడ్డి, పాడుబడిన తోటలో చెల్లెలి మరణంతో పిచ్చివాడుగా ముద్రపడ్డ వ్యక్తిగా ఎస్.వి.రంగారావు నటించారు.
స్క్రీన్ ప్లే రైటర్గా, దర్శకునిగా ఎక్కువ భాగం తమిళ చిత్రాలకు, కొన్ని హిందీ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించి, పలు అవార్డులు పొందిన విశిష్ట దర్శకులు ఏ.సి.త్రిలోక్చందర్ రాము, తమిళ, తెలుగు చిత్రాలకు రెండిటికి వీరే దర్శకత్వం వహించటం విశేషం. తెలుగుదనానికి తగ్గట్టుగా అత్యంత సహజంగా సన్నివేశాలు చిత్రీకరించి వన్నె తెచ్చారు.
నరసరాజుగారి మాటలు చిత్రానికి వన్నె తెచ్చాయి. పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందివంటి పదునైన మాటలు ఎన్నో ఈ సినిమాలో.
కథానాయకుడు రాజాగా ఎన్.టి.రామారావు మొదటి భార్య, రాములపై ప్రేమానురాగాలను తరువాత మూగవాడైన కుమారుని పట్ల బాధతో కూడిన ఆప్యాయతను, అసహాయురాలైన యువతి, తన తోటి సిపాయి సింగన్న కూతురు అయిన లక్ష్మికి అండగా నిలవటం, ఆమె తనను ఇష్టపడినా, తన భార్యపైగల ప్రేమతో ఆమెను నిరాకరించటం(చివరకు లక్ష్మి, రాముతోపాటు వారితో చోటు ఇమ్మని కోరటం) కుమారుడికి మాటలు రావని తెలిసి వేదన, డబ్బు పోగొట్టాడని కోపం, సముద్రంలో దూకనున్న కొడుకును కాపాడుకొని, దైవాన్ని వేడుకోవటం, అంతేకాక స్టంట్ మాస్టర్ రూపొందించిన పులితో పోరాటం కొరడాతో, రంగన్నతో కర్రతో ఫైట్, కాగడాలతో ఫైట్ ఎంతో సహజంగా, చురుకుగా ప్రదర్శించటం ప్రశంసనీయమైన నటన చూపారు. రాము చిత్రం లో ఎన్ టి ఆర్ నటన మహోన్నత శిఖరాలను చేరుకుంది. భార్య సమాధి వద్దకు వచ్చి గొంతు మూగపోయిన బిడ్డతో "అమ్మా అని పిలువు బాబూ" అంటూ చేసిన ఆ సీను నటన అనే పదానికే మకుటాయమానంగా నిలిచింది. ఈ దృశ్యానికిప్రేక్షకులు విచలితులు అయిపోయారు. మూగ బిడ్డ రాముతో చివరివరకు సాగిన ప్రస్థానంలో ఎన్ టి ఆర్ నటన అత్యద్భుత రీతిలో సాగింది. మంటలు రేపే నెలరాజ అనే పాటకు ఆయన చూపిన సున్నితమైన హావభావాలు ప్రేక్షకులను మైకంలో పడవేసాయి.
దానికితోడుగా లక్ష్మిగా జమున, తన శాంతియుతమైన యుక్తమైన నటనతో సన్నివేశాలను, ఆర్ద్రతతో హుందాతనంతో, నిండుతనం చేకూర్చారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధిమేరకు నటించగా, ఎస్.వి.రంగారావు, మాస్టర్ రామూ తమ పాత్రలను ఎంతో సహజంగా నటించి మెప్పించారు.
ఏ వి ఎం పతాకం లో ఇంతకుముందు వచ్చిన తెలుగు సినిమాలు సంఘం, భూకైలాస్, లేత మనసులు, భక్త ప్రహ్లాద చిత్రాల స్తాయిలో ఆంధ్ర ప్రేక్షకులను మెప్పించిన చిత్రం రాము. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. 1968 లో దక్షిణ భారత దేశంలో విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, ఒరియా బాషలలో వచ్చిన సినిమాలలో రజతోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం తెలుగులో వచ్చిన రాము సినిమా మాత్రమే.
బరువైన కధాశం కలిగిన ఈ సినిమాలో రేలంగి, పద్మనాభం, గీతాంజలి, సూర్యాకాంతం అందించిన హాస్యం ప్రేక్షకులకు రిలీఫ్ నిస్తుంది.
విలన్ పాత్ర పోషించిన రాజనాల అభినయంలో హాస్యం మిళితమైనందున మంచి రిలీఫ్ లభించింది.
ఎ వి ఎం ప్రస్థానంలో అతి పెద్ద సంచలనం "రాము". 1968 లో ఈ చిత్రానిదే అగ్రస్థానం. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఈ చిత్రం కలుగచేస్తుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకధాటిగా 181 రోజులు ప్రదర్శించబడింది. సూపర్ హిట్ ఆఫ్ ది యియర్ గా 15 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.
మంచి చిత్రాలను ఇష్టపడే వారు ఎప్పుడైనా, ఎన్నిమార్లైనా చూడదగ్గ చిత్రం ఏ వి ఎం వారి "రాము".
పాటలన్నీ ఆణిముత్యాలే.
రాము చిత్రంలోని గీతాలు, చిత్ర ప్రారంభంలో రాము (మాస్టర్ రాజ్ కుమార్) పై చిత్రీకరించిన సుమతి శతకం పద్యం అక్కరకు రాని చుట్టము (గానం- పి.సుశీల)
తొలుత రాము పాడిన గీతం పుష్పలత, ఎన్.టి.ఆర్, మాస్టర్ రాజ్ కుమార్ ల పై ఒకసారి, మరోసారి జమున, ఎన్.టి.ఆర్ రాములపై చిత్రీకరణ ‘పచ్చనిచెట్టూ ఒకటి వెచ్చని చిలకలు రెండు’ (పి.సుశీల, ఆరుద్ర) ‘వలపుల చిలక, పలకని చిలక, చిలకా రాజు మదిలో సుఖమేది’ సన్నివేశానుగుణమైన గీతం, చరణాలలో రావటం విశేషం.

జమునపై చిత్రీకరించిన ‘కలగంటి కలగంటి చరణం’ వెనుక ఎన్.టి.ఆర్.పై ‘మంటలురేపే నెలరాజా’ వెన్నెలలో ఎంతో ఆర్ద్రత, వేదన నిండిన గీతం (పి.సుశీల, ఘంటసాల, దాశరథి) ఎన్.టి.ఆర్. అభినయం ప్రాణంపోసింది.

గీతాంజలి, సూర్యాకాంతం, రమణారెడ్డి, పద్మనాభంలపై చిత్రీకరించిన ‘తారాశశాంకం’ నాటకం (ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పిఠాపురం, ఎం.ఆర్.తిలకం- రచన కొసరాజు)

జమున, మాస్టర్ రాజ్ కుమార్, ఎన్.టి.ఆర్లపై చిత్రీకరించిన మరో గీతం జమున హుషారుగా, ఎన్.టి.ఆర్. నిర్వేదన, రామూ ఆనందం (మామిడికొమ్మా మళ్ళీమళ్ళీ పూయునులే’’- పి.సుశీల- దాశరథి)

రాము చిత్రంలో మరో మధురమైన భక్తిగీతం ఘంటసాలవారు నాగయ్య, ఎన్.టి.ఆర్.ల కిరువురికీ ఒకేసారి ఒక చరణం చివరలో పాడడం విశేషం. ‘రారా కృష్ణయ్య రారాకృష్ణయ్య’ (రచన-దాశరథి- గానం ఘంటసాల బృందం). ఆర్.గోవర్ధనం స్వరాలతో ఈ చిత్ర
గీతాలు అలరించేలా సాగాయి.

రాము, రాజు సముద్రపు ఒడ్డున

ఎన్ టి ఆర్, రాజకుమార్, జమున

‘‘రాము’’ చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ విజయవంతంగా ప్రదర్శింపబడింది. తెలుగు చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నమోదుకావటం ఆనంద దాయకం.

కథానాయకుడు (1969)




కధానాయకుడు (27-02-1969)


1969 లో 52 సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 11 సినిమాలలో నటించారు . వర కట్నం, కధా నాయకుడు, భలే మాస్టారు, గండికోట రహస్యం, విచిత్ర కుటుంబం, కదలడు వదలడు, నిండు హృదయాలు, భలే తమ్ముడు , అగ్గి వీరుడు, మాతృదేవత, ఏక వీర.


అక్కినేని నటించిన 8 సినిమాలు అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆదర్శ కుటుంబం, ఆత్మీయులు, భలే రంగడు, బుద్దిమంతుడు, సిపాయి చిన్నయ్య,


ఇతరులు నటించిన 33 సినిమాలు శ్రీ రామ కధ, మంచి మిత్రులు, దేవుడిచ్చిన భరత, లవ్ ఇన్ ఆంధ్రా, సప్త స్వరాలు, భలే అబ్బాయిలు, బంగారు పంజరం, బొమ్మలు చెప్పిన కధ, చిరంజీవి, అర్ధ రాత్రి, మహా బలుడు, శబాష్ సత్యం, ఆస్థులు అంతస్థులు, టక్కరి దొంగ చక్కని చుక్క, ముహూర్త బలం, సత్తెకాలపు సత్తెయ్య, మామకు తగ్గ కోడలు, జరిగిన కధ, జగత్ కిలాడీలు, పంచ కల్యాణి దొంగల రాణి, నాటకాలరాయడు, రాజ సింహ, అన్నదమ్ములు, ప్రేమ కానుక, ఉక్కు పిడుగు, మనుషులు మారాలి, ధర్మ పత్ని, కన్నుల పండగ, తారా శశాంకం, కర్పూర హారతి, ప్రతీకారం, గండర గండడు, బంధిపోటు భీమన్న 1969 లో విడుదలయ్యాయి.


రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన 'కథానాయకుడు' (27-02-1969) సూపర్ హిట్ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కధానాయకుడు సినిమా 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రజతోత్సవం కూడా జరుపుకుంది. నిర్మాతలకు ఒక రూపాయ పెట్టుబడికి 9 రూపాయల లాభం తెచ్చిమిది. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది.


వర కట్నం (10-01-1969) , విచిత్ర కుటుంబం (28-05-1969) , నిండు హృదయాలు (15-08-1969) , మాతృదేవత (07-11-1969) , అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి శత దినోత్సవాలు జరుపుకున్నాయి.


"గండికోట రహస్యం (01-05-1969) , మహ్మద్ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన 'భలే తమ్ముడు' (18-09-1969), జగత్ కిలాడీలు, మహాబలుడు చిత్రాలు యావరేజ్ గా నడిచాయి.


విశ్వనాధ సత్యనారాయణ గారి నవల ఏకవీర (04-12-1969) మ్యూజికల్ హిట్ గా నిలచింది. భలే మాస్టారు (27-03-1969), కదలడు వదలడు (09-07-1969), అగ్గి వీరుడు (17-10-1969), ఆదర్శ కుటుంబం, భలే రంగడు, సిపాయి చిన్నయ్య, నిరాశ పరిచాయి.

జెమినీ వారి 'మనుషులు మారాలి' చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.


27-02-1969 న విడుదలైన కధానాయకుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా విశేషాలు:-


పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని భూస్వామి కొడాలి గోపాలకృష్ణ. తమ అభిమాన హీరో యన్టి రామారావు హీరోగా, జయలలిత హీరోయిన్గా 1969లో వీరు నిర్మించిన చిత్రం -కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన బృంద గానంలోని ఓ స్టిల్ను తమ బ్యానర్ లోగోగా రూపొందించి ‘గోపాలకృష్ణ ప్రొడక్షన్స్’పై చిత్రాన్ని నిర్మించారు. తరువాత ‘దీర్ఘసుమంగళి’ (1974లో) నిర్మించారు. 23 ఆగస్టు, 1978లో గోపాలకృష్ణ పరమపదించారు. ‘కథానాయకుడు’ చిత్రంతో ‘బంగారు నంది పురస్కారం’ పొందిన నిర్మాత కావటం విశేషం. వీరి అల్లుడు వి బాలకృష్ణరావు ‘ఉషా పిక్చర్స్’ ద్వారా ప్రముఖ చిత్ర పంపిణీదారుగా ఖ్యాతి గడిస్తున్నారు. 27 ఫిబ్రవరి 1969న కథానాయకుడు చిత్రం విడుదలైంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కె ప్రత్యగాత్మ సోదరుడైన ప్రముఖ దర్శకుడు కె హేమాంబరధరరావు కథానాయకుడు చిత్రానికి దర్శకత్వం వహించారు.


కథ: ముళ్ళపూడి వెంకటరమణ

మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ

సంగీతం: టివి రాజు

కళ: బిఎస్ కృష్ణ

నృత్యం: తంగప్ప

స్టంట్స్: శ్యామ్సుందర్

కెమెరా: విఎస్ఆర్ స్వామి

నిర్మాత: కె గోపాలకృష్ణ

దర్శకత్వం: హేమాంబరధరరావు


సినిమా ఆరంభంలో ఒక చిన్న టౌన్ లో ప్రజలు కొంతమంది స్వార్ధపరులైన పెద్దమనుషుల చేతిలో ఎలా దోపిడీ కి గురి కాబడుతున్నారో చూపిస్తారు. ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరావు), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు.


దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (ధూళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (ఎన్ టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించుటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.


కధానాయకుడు సారధిగా ఎన్ టి ఆర్ , కధానాయకి జయగా జయలలిత ఎంతో విశిష్టంగా నటించారు. వీరిద్దరూ అద్భుత నటనా ప్రావీణ్యంతో తాము ఉన్న ప్రతి సన్నివేశానికి వన్నె చేకూర్చారనడంలో అతిశయోక్తి లేదు.


దయానందంగా నాగభూషణం, సత్య మూర్తిగా మిక్కిలినేని, అప్పడు దొరగా అల్లు రామలింగయ్య చక్కగా నటించారు.


చిత్రంలో సారథి స్నేహితుడు సింహగా పద్మనాభం, అతని భార్య రమగా రమాప్రభ, ఆమె తల్లిదండ్రులుగా రాధాకుమారి, రావి కొండలరావు, పక్కింటి ఇల్లరికపు అల్లుడు పులి రాజుగా రాజ్బాబు, సుందరిగా పద్మ లక్ష్మి, సుందరి తల్లిగా జూనియర్ భానుమతి సమకూర్చిన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.


చలపతి మాస్టారుగా నాగయ్య, సారధి అన్న శ్రీనివాసరావుగా ధూళిపాళ, కాకారావుగా కాకరాల, జయ అన్నగా ప్రభాకర రెడ్డి, అతని స్నేహితుడిగా ఆదుర్తి నరసిం హ మూర్తి, కోటీశ్వరుడిగా ముక్కామల, సారధి వదినగా టి జి కమలా దేవి, ఆమె పిల్లలుగా బేబీ పద్మిని, బేబీ మల్లిక , మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగిగా చలపతిరావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.


యువ దర్శకుడు శ్రీ కె హేమాంబరధర రావు ఈ చిత్రంతో అగ్ర శ్రేణి దర్శకుల జాబితాలో చేరారు. సన్నివేశాలను ఎంతో భావయుక్తంగా, పట్టుతో అర్ధవంతంగా రూపొందించి కథను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత దయానందం, తరువాత సత్యమూర్తి, అప్పడు వరుసగా తమ చేతికర్రలతో ధర్మారావు వద్దకు వచ్చి, అతని మెడకు కర్రలతో బంధం వేసి అంతం చేయటం, బ్యాక్గ్రౌండ్లో సంఘంలో న్యాయం, ధర్మం, నీతి లక్షణాలను లెక్కచేయని వారి గురించి చెప్పించటం ఆసక్తికరం అనిపిస్తుంది. తిరిగి కైమాక్స్లో సారథిని అదేవిధంగా అంతం చేయాలని ముగ్గురూ కర్రలు బిగించగా, హీరో వాటిని ఛేదించి ముక్కలు చేసే సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.


ఇక ఈ ముగ్గురు దుర్మార్గులున్న ఇంటి మెట్లమీది సన్నివేశంలో.. 10నెలల జీతం కోసం ఉపాధ్యాయుడు చలపతి దీనంగా అర్థిస్తూ ‘ఆకలితో మావాళ్లు అలమటిస్తున్నారని చెప్పే సందర్భంలో -అల్లు రామలింగయ్య (మంచింగ్) తినటం, గొంతులార్చుకుపోతున్నాయనగా మిక్కిలినేని మందు తాగడం, మెట్లకింద వున్న నాగయ్యను గెంటి వేయించటం, వారు రోడ్డుమీద ఆకలితో నీరసంతో తూలటం, మరోచోట నాగభూషణం మందు తాగిన మత్తుతో తూలటం సమాంతరంగా చూపి విశ్లేషించటం దర్శకుని ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది.


హాస్పిటల్లో డాక్టరు స్టాకులేదని మందివ్వక అతని మరణానికి కారణం కావటం, ఆ మెట్లముందు సారధి వార్నింగ్ ఒకసారి, మరోసారి చైర్మెన్ పదవి పోయిన సారథిని మెట్లమీంచి దిగుతూ దుర్మార్గ బృందం అతనిపై విస్కీ పోయటం, హేళన చేసి కొట్టిపడవేయటం వంటి సన్నివేశాలు కథలో పట్టును పెంచాయి.


మార్పు స్వభావం తెలిసిన శ్రీనివాసరావు జనతా స్కీమ్ క్రింద పేదవారివద్ద వసూలు చేసిన సొమ్ము దాచటం, అతన్ని బంధించి ఈ దుష్టులు హింసించటం, క్లైమాక్స్లో డబ్బుకోసం త్రవ్వకంలో మిక్కిలినేని, అల్లు రామలింగయ్యకు పాము, గబ్బిలాలు, తేళ్లు రావటం, అక్కడ దుష్టులతో హీరో పోరాటం ఎంతో ఉత్సుకత, సాహసం ఉట్టిపడేలా చిత్రీకరించారు. నీతి, నిజాయితీ లక్షణాలు సామాన్యుల్లోనూ ఉంటాయని జయ పాత్ర ద్వారా చెబితే, తాగుబోతు నాగులు కూడా చెల్లెలికోసం మారటం ద్వారా మరింత బలంగా చూపించటం ఎన్నదగిన అంశం.


ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకట రమణ సమకూర్చిన కధలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సంఘటనలు, పాత్రపోషణ సహజత్వానికి దగ్గరగా నిర్ధుష్టంగా ఉంటాయి.


శ్రీ భమిడిపాటి రాధా కృష్ణ సంభాషణలు ఎంతో భావస్పూర్తితో వెల్లివిరుస్తూ చిత్రానికి నిండుతనాన్ని తెచ్చాయి.


లోగడ ‘పెద్దమనుషులు’, ‘దేశద్రోహులు’ వంటి పలు చిత్రాల్లోని అంశాలకు మరింత రంజుగా కథను సమకూర్చుకొని ముళ్ళపూడివారు, దానికి తగ్గ నిత్యసత్యాల్లాంటి సంభాషణల్ని (విలన్లు సారథితో- మాలాంటి వాళ్లు ఈ దేశంలో లక్షలమంది వున్నారు, వుంటారు. నీలాంటివాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.. మీవల్ల దేశంలో, మనుషుల్లో మార్పు రాదు) సమకూర్చి భమిడిపాటి రాధాకృష్ణ, దర్శకుల రూపకల్పనకు జోడిగా మహానటుడు యన్టిఆర్ సన్నివేశాలకు తగిన సంయమనంతో కూడిన ముచ్చటైన అభినయం, తోటి నటీనటుల సహకారం చిత్రాన్ని విజయపథంవైపు నడిపించింది.


చిత్రంలో హీరో హీరోయిన్లపై ఒక్కటైనా యుగళగీతం, కనీసం కలలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క యుగళ గీతమైనా ఉంటే బావుంటుందేమోనని హీరో యన్టిఆర్ సూచించినపుడు, ఈ కథకు అది నప్పదు అని దర్శకులు హేమాంబరధరరావు చెప్పారు. దానిని ఎన్ టి ఆర్ ఎంతో హృద్యంగా అంగీకరించటం గొప్ప విశేషం.


అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించటం కోసం విజయావారు, ఏవిఎం వారు, ఎంజి రామచంద్రన్ కోరటం, దానికి ఎన్ టి ఆర్ ఆ వ్యవహారాలన్నీ దర్శకులు, నిర్మాతల అభిష్టానికే వదిలివేయటం జరిగింది.


శ్రీ వి ఎస్ ఆర్ స్వామి కెమెరా, బి ఎన్ కృష్ణ కళ, తంగప్ప నృత్యాలు, వాసు ఎడిటింగ్ చిత్రానికి ఒక సముచిత స్థాయిని చేకూర్చాయి.

ఇంతేనయా తెలుసుకోవయ్యా పాటలో వి ఎస్ ఆర్ స్వామి కెమెరా ప్రతిభ గూర్చి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.


చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే గోరంత దీపం వెలిగించినవాడే ఉత్తముడు. సంఘంలోని వివిధ రంగాల్లో విశృంఖల విహారం చేస్తున్న అవినీతిని, మోసాన్ని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే వాటిని ఎదుర్కోవడానికి చేసిన ఏ చిన్న ప్రయత్నం జరిగినా హర్షించదగినదే. సమాజంలోని దుష్ట శక్తులను నిర్మూలించి మనిషి మనుగడను సార్ధకం చేయడానికి ప్రతి ఒక్కచోటా ఒక కధానాయకుడు ఉద్భవించాలి అని చాటి చెప్పే గొప్ప సాంఘిక చిత్రం గోపాల కృష్ణ ప్రొడక్షన్స్ వారి "కధా నాయకుడు".


ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించగల ఇంత చక్కని చిత్రాన్ని నిర్మించిన కె గోపాల కృష్ణ ఎంతో అభివందనీయులు. ఉత్తమ అభిరుచులు, ఉన్నతమైన ఆశయాలు గల ఈ యువ నిర్మాత అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందారు.


కధానాయకుడు సినిమా రాజకీయ ట్రెండ్ సెట్టర్ గా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో సంచలనాలు సృష్టించి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. 1969 లో సూపర్ డూపర్ హిట్ గా ఆ సంవత్సరానికి నెంబర్ వన్ గా నిలచింది. నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపమైన సారధి పాత్రలో ఎన్ టి ఆర్ నటన ఎవ్వరూ అందుకోలేని అందలాలకు చేరుకుంది. సన్నివేశపరంగా ఈ చిత్రాన్ని వర్ణించడం అసాధ్యం. యూ ట్యూబ్ లో కాకుండా మంచి ప్రింట్ లో చూడవలసిన సినిమా. ఈ టీ వీ సినిమాలో అప్పుడప్పుడు వేస్తుంటారు.


శ్రీ దాశరధి 3 పాటలు, శ్రీ కొసరాజు 4 పాటలూ రాశారు. పాటలు అన్నీ ఆకర్షణీయంగా వుంటాయి. శ్రీ టీ వీ రాజు కూర్చిన సంగీతం చిత్రానికి గొప్ప ఆకర్షణ అని చెప్పవచ్చు.


హీరో లక్షణాలను, కథను విశ్లేషిస్తూ ఆకట్టుకునేలా వాద్యంతో, బృంద నృత్యంతో, ఎన్ టి ఆర్- జయలలితలపై చిత్రీకరించిన గీతం -వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్య’ (గానం: పి సుశీల, ఘంటసాల బృందం, రచన: కొసరాజు).


https://www.youtube.com/watch?v=t9gnfp5fdxs

జయలలితపై చిత్రీకరించిన గీతం , పళ్ళండి పళ్ళండి పళ్ళు, జామ పళ్ళు, కొసరాజు, ఎల్ ఆర్ ఈశ్వరి

https://www.youtube.com/watch?v=GnqDyspt4v0 

అద్దంలో హీరో తాను వలచిన అమ్మాయిగా జయను చూపించగా ఆనందంతో జయలలితచే నృత్య గీతం -ముత్యాల జల్లుకురిసే రతనాల’ (దాశరథి, సుశీల ). ఈ చిత్రంలో హిట్ సాంగ్లో ఒకటిగా ఇది నిలిచింది.

https://www.youtube.com/watch?v=jonlDR4dDwE 

మంచివాడు మా బాబాయి, దాశరధి, సుశీల, బెంగలూరు లత


https://www.youtube.com/watch?v=6WuIkIdcv8g

ఎన్ టి రామారావు, జయలలిత నృత్య కళాకారులతో నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ముక్కామల హావభావాలను చూపుతూ చిత్రీకరించిన (ప్రత్యేకించి రంగుల్లో) గీతం -ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం’ (గానం: ఘంటసాల బృందం, రచన: దాశరథి).


https://www.youtube.com/watch?v=FDPjX0u75Gs

రాజ బాబు , పద్మనాభంలపై చిత్రీకరించిన గీతం -రావేలా దయరాదా రావా ఇంటికి (గానం: పిఠాపురం, మాధవపెద్ది, రచన: దాశరథి). ఈ చిత్రంలోని మరో హిట్సాంగ్.


https://www.youtube.com/watch?v=Zcur0kv8vIM

జయలలిత, నాగభూషణంలపై ఇంట్లో ఆరుబయట వెన్నెల్లో చిత్రీకరిస్తే, జయలలిత రకరకాల స్టెప్స్, అలరించే నృత్యంతో వెరైటీగా సాగే గీతం -వయసు మళ్లిన బుల్లోడా (గానం: పి సుశీల, రచన: దాశరథి).


https://www.youtube.com/watch?v=jqsTZuvnIqY

‘కథానాయకుడు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. 1969 సంవత్సరానికి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ పురస్కారంతో సత్కరించింది.

ఆడ బ్రతుకు(1965)




 🌹🌹ముక్కో‌ణపు ప్రేమ‌కథ ఆడబ్రతుకు🌹🌹

చల‌న‌చిత్ర చరి‌త్రలోనే అపూర్వ కళా‌ఖం‌డంగా నిలి‌చి‌పో‌యిన ‌‘చంద్రలేఖ’‌ హిందీ సినిమా ద్వారా అద్భుత సంచ‌లనం సృష్టిం‌చిన చిత్ర నిర్మాణ సంస్థ ‌‘జెమినీ’‌.‌ ఆ చిత్రంలో కథా‌నా‌యి‌కగా నటిం‌చిన టి.‌ఆర్‌.‌రాజ‌కు‌మారి ఆనాటి ప్రేక్ష‌కు‌లకు వెండి‌తె‌రపై సాక్షా‌త్క‌రిం‌చిన స్వప్న‌సుం‌ద‌రిగా నిలి‌చింది.‌ జెమినీ స్టూడి‌యోతో బాటు జెమినీ వారి సిని‌మాలు కూడా అగ్రశ్రే‌ణిలో వెలు‌గొం‌దు‌తున్న రోజుల్లో వేదాంతం రాఘ‌వయ్య దర్శ‌క‌త్వంలో జెమినీ అధి‌పతి యస్‌.‌యస్‌.‌వాసన్‌ నిర్మిం‌చిన ప్రేమ కావ్యం ‌‘ఆడ‌బ్రతుకు’‌ సినిమా.‌ ఆత్రేయ, సినా‌రెల పా(మా)ట విరు‌పు‌లకు సుస్వర రాగా‌ల‌ల్లిన స్వర‌మా‌ధురీ ధురీ‌ణులు విశ్వ‌నా‌థన్‌−‌ రామ్మూ‌ర్తిల గాన కావ్యం ఈ సినిమా.‌ ఎన్టీ‌ఆర్‌ చల‌న‌చిత్ర జీవి‌తంలో ‌‘ఆడ‌బ్రతుకు’‌ విజయం ఒక గొప్ప రజ‌తో‌త్సవ మైలు‌రాయి.‌ నవం‌బరు 11, 1965న విడు‌ద‌లైన ఈ సినిమా విశే‌షాలు కొన్ని.‌.‌.

సినిమా కథ ..

సీత (దేవిక) కలిగిన కుటుం‌బంలో పుట్టినా, అనుకోని పేద‌రికం వలన ఒక నాటక కంపె‌నీలో చేరు‌తుంది.‌ ఆ కంపెనీ డైరె‌క్టరు గోపా‌ల‌రావు (కాంతా‌రావు) సీతకు మంచి అవ‌కా‌శాలు ఇవ్వ‌డమే కాకుండా ఆమెను మన‌సారా ప్రేమి‌స్తాడు, అభి‌మా‌ని‌స్తాడు.‌ కానీ, సీతకు అతడు తనను ప్రేమి‌స్తు‌న్నట్టు తెలి‌యదు.‌ ఆ కంపెనీ యజ‌మాని గంగ‌రాజు (రాజ‌నాల) సీతపై కన్ను‌వే‌స్తాడు.‌ ఒక‌రోజు గంగ‌రాజు రౌడీలు సీతను బల‌వం‌తంగా అతని వద్దకు తీసు‌కొని వెళ్తుం‌డగా రావు‌బ‌హ‌ద్దూర్‌ రంగ‌నాథం (యస్వీ రంగా‌రావు) కొడుకు రాజా (ఎన్టీ‌ఆర్‌) ఆమెను కాపా‌డు‌తాడు.‌ మన‌సులు కలిసి ఇద్దరూ ప్రేమిం‌చు‌కుం‌టారు.‌ రాజా సీతను పెళ్లి‌చే‌సు‌కుం‌టా‌నని తండ్రితో చెప్ప‌డంతో అతడు హతా‌శు‌డ‌వు‌తాడు.‌ నాట‌కాల కంపె‌నీలో నర్తించే అమ్మా‌యిని కోడ‌లిగా పొందడం రంగ‌నా‌థా‌నికి ఇష్టం ఉండదు.‌ రాజు తన నిర్ణ‌యాన్ని మార్చు‌కో‌క‌పో‌వ‌డంతో విధి‌లేని పరి‌స్థి‌తుల్లో వారి‌ద్ద‌రికీ పెళ్లి జరి‌పి‌స్తాడు.‌ గోపా‌ల‌రా‌వును చూడ‌రా‌దని, కలు‌సు‌కో‌రా‌దని సీతకు షరతు విధి‌స్తాడు.‌ ఒక‌రోజు రాత్రి రాజు−‌సీత ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుం‌డగా గంగ‌రాజు వద్ద వుండే రౌడీ జోగులు (సత్య‌నా‌రా‌యణ) వల‌పన్ని ఇద్ద‌రినీ వేరు‌చే‌స్తాడు.‌ ఒంట‌రిగా చిక్కిన సీతను వెంబ‌డి‌స్తాడు.‌ అతని బారి నుండి రక్షిం‌చు‌కో‌డా‌నికి సీత ఒక‌రింట్లో దాక్కుం‌టుంది.‌ ఆ ఇల్లు గోపా‌ల‌రా‌వుది.‌ ఆ సమ‌యంలో విప్ల‌వ‌కా‌రులు చెల‌రేగి దోపి‌డీలు, లూఠీలు చేస్తుం‌డ‌టంతో పోలీ‌సులు ఆ ప్రదే‌శంలో కర్ఫూ¬్య విధి‌స్తారు.‌ సీత ఆ రాత్రి గోపా‌ల‌రావు ఇంట్లో తల‌దా‌చు‌కో‌వ‌లసి వస్తుంది.‌ అదే‌రాత్రి గంగ‌రా‌జును జోగులు హత్య చేస్తాడు.‌ మరు‌నాటి ఉదయం పోలీ‌సులు అను‌మా‌నంపై గోపా‌ల‌రా‌వును అదు‌పు‌లోకి తీసు‌కుం‌టారు.‌ సీత సాక్ష్యం మీద తన నిర్దో‌షిత్వం నిరూ‌పిం‌చు‌కొనే అవ‌కాశం గోపా‌ల‌రా‌వుకు ఉంటుంది.‌ కానీ, ఏ పాపమూ ఎరు‌గని సీత బతుకు చీక‌టై‌పో‌తుం‌దని ఆ విష‌యాన్ని గోపా‌ల‌రావు బయ‌ట‌పె‌ట్టడు.‌ కానీ తన సాక్ష్యంతో ఒక నిర‌ప‌రా‌ధికి ఉరి శిక్ష తప్పు‌తుం‌దని తెలు‌సు‌కున్న సీత, కోర్టులో సాక్ష్యం చెప్పి గోపా‌ల‌రావు విడు‌ద‌లకు సహ‌క‌రి‌స్తుంది.‌ దాంతో రాజా ఆమెను ఇంటి నుంచి గెంటి వేస్తాడు.‌ అప్పుడు సీత గర్భ‌వతి.‌ తల్లితో కలిసి ఊరు విడిచి వెళుతూ మైకం కమ్మి పడి‌పోతే, పొరు‌గూ‌రులో ఉండే భాగ్య‌వం‌తు‌డైన షేర్‌ఖాన్‌ (ముక్కా‌మల) ఆమెను ఆశ్రయ‌మి‌స్తాడు.‌ అతడు రంగ‌నా‌థా‌నికి మిత్రుడు.‌ సీత మగ‌బి‌డ్డను ప్రస‌వి‌స్తుంది.‌ తండ్రి మనో‌వే‌దన చూసి భరిం‌చ‌లేక రాజా మరో‌పె‌ళ్లికి సిద్ధ‌ప‌డ‌తాడు.‌ విషయం తెలు‌సు‌కున్న షేర్‌ఖాన్‌ పెళ్లి ఆపేం‌దుకు కారులో రంగ‌నాథం ఊరికి వెళు‌తుం‌డగా పోలీ‌సు‌లతో పాటు గోపా‌ల‌రావు కూడా జోగు‌లను తరు‌ము‌కుంటూ షేర్‌ఖా‌న్‌కు ఎదు‌ర‌వు‌తారు.‌ పోలీ‌సుల కాల్పుల్లో జోగులు మర‌ణిస్తూ సీత నిర్దో‌షి‌త్వాన్ని వెల్ల‌డి‌స్తాడు.‌ సీతను వెది‌కేం‌దుకు వెళ్లిన రాజా భూకం‌పంలో చిక్కు‌కోగా తన పెంపుడు కుక్క రాజాను రక్షి‌స్తుంది.‌ చివ‌రికి అంతా కలు‌సు‌కో‌వ‌డంతో సినిమా ముగు‌స్తుంది.‌ ఈ సిని‌మాలో సహాయ పాత్రల్లో ఋష్యేం‌ద్రమణి, యం.‌వి.‌రాజమ్మ, పుష్ప‌వల్లి, గీతాం‌జలి, పద్మ‌నాభం, మహం‌కాళి వెంకయ్య, అల్లు రామ‌లిం‌గయ్య, బేబీ ఫరీదా నటిం‌చారు.‌

విశ్వ‌నాథ సమ్మో‌హనం..

ఈ సిని‌మాకు విశ్వ‌నా‌థన్‌−‌ రామ్మూర్తి సంగీతం అందిం‌చారు.‌ పేరు ఇద్ద‌రిదే అయినా స్వర రచ‌నలో మాత్రం విశ్వ‌నా‌థ‌న్‌దే ప్రధాన భూమిక.‌ ఆయన హార్మో‌నియం మీద పాటను కంపోజ్‌ చేస్తుంటే రామ్మూర్తి ఫిడే‌లుతో విశ్వ‌నా‌థ‌న్‌కు సరి జో(తో)డుగా ఉండే‌వారు.‌ తెలుగు, తమిళ వర్ష‌న్లలో కొన్ని పాట‌లకు రెండు వైవి‌ధ్య‌మైన ట్యూనులు సమ‌కూ‌ర్చడం కూడా విశ్వ‌నా‌థన్‌ ప్రత్యే‌కత.‌ ఈ సిని‌మాలో తమి‌ళం‌తో‌పాటు ఎన్టీ‌ఆర్‌కు కూడా అన్ని‌పా‌టలూ పి.‌బి.‌శ్రీని‌వాసే పాడారు.‌ శ్రీని‌వాస్‌ పాడిన ‌‘కనులు పల‌క‌రిం‌చెను పెద‌వులు పుల‌క‌రిం‌చెను బుగ్గ‌లపై లేత‌లేత సిగ్గులు చిగు‌రిం‌చెను’‌ పాటను శంక‌రా‌భ‌రణ రాగంలో స్వర‌ప‌రి‌చారు.‌ పాట చిత్రీ‌క‌రణ కర్ణా‌ట‌క‌లోని హొగే‌ని‌కల్‌ జల‌పాతం వద్ద జరి‌గింది.‌ అందుకు అను‌గు‌ణంగా సినారె ‌‘అంద‌మైన ఆ జల‌పాతం ఆల‌పించె తీయని రాగం.‌.‌ కని‌పిం‌చని నీ హృద‌యంలో విని‌పిం‌చెను నా సంగీతం’‌ అంటూ రాశారు.‌ అభేరి రాగంలో విని‌పించే ‌‘పిలిచే నా మదిలో వలపే నీదే సుమా.‌.‌ రారాజు ఎవ‌రైనా నారాజు నీవే సుమా’‌ పాట అటు హ్యాపీగా ఇటు పాథో‌స్‌గా వస్తుంది.‌ ఈ పాటలో దేవిక ‌‘అనా‌ర్కలి’‌గా చక్కగా నర్తించి నటిం‌చింది.‌ ప్రేమను ఏ విఘా‌తాలు ఆప‌లే‌వని అర్థం వచ్చేలా ‌‘చుక్కలే తెగి‌పోనీ సూర్యుడే దిగిô‌¦నీ.‌.‌ ఈ ప్రేమ మార‌దులే ఈ జ్యోతి ఆర‌దులే.‌.‌ ఎన్ని జన్మ‌ల‌కైనా ఈ బంధ‌ముం‌డు‌నులే’‌ అంటూ ముక్తా‌యిం‌చారు.‌ ఇక అందరూ మెచ్చే గీతం ఆత్రేయ రాయగా శ్రీని‌వాస్‌ అద్భు‌తంగా పాడిన ‌‘బుజ్జి‌బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయీ.‌.‌ నీ బోసి నవ్వు‌లలో పూచే పున్నమి వెన్నె‌ల‌లోనే’‌ పాట.‌ తెలుగు, తమి‌ళంలో కూడా ఈ పాటకు ఒకటే ట్యూను.‌ ‌‘పూవంటి మన‌సులో ముళ్లున్న జగ‌తిరా, మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతు‌కురా.‌.‌ నమ్ము‌కున్న నావాళ్లు నాకిదే నేర్పారూ, పాపా‌యిగా ఉంటే బాధలే ఉండ‌వురా’‌ వంటి మాటలు ఆత్రేయ ముద్రను గుర్తు‌చే‌స్తాయి.‌ సినిమా మొద‌ట్లోనే వచ్చే సినారె గీతం ‌‘ఆహా అందము చిందే హృద‌య‌క‌మలం అందు‌కొనే రాజొ‌కడే.‌.‌ వేల తార‌కల బృంద‌ము‌లోనా వెలిగే చందు‌రు‌డొ‌కడే’‌ కేవలం ఒక నాట్య‌గీ‌తమే కాకుండా హీరో‌పట్ల హీరో‌యిన్‌ తన ప్రేమను సూచన ప్రాయంగా వ్యక్త‌ప‌రిచే సంద‌ర్భో‌చిత ప్రణయ గీతం కూడా.‌ ఆత్రేయ రాసిన మనసు పాట ‌‘తను‌వు‌కెన్ని గాయా‌లైనా మాసి‌పో‌వు‌నే‌లా‌గైనా.‌.‌ మనసు కొక్క గాయ‌మైనా మాసి‌పోదు చితి‌లో‌నైనా’‌ను విశ్వ‌నా‌థన్‌ శోక‌ర‌సా‌నికి ప్రతీ‌కైన శుభా‌పం‌తు‌వళి రాగంలో మట్లు కట్టారు.‌ ‌‘ఆడ‌వాళ్లు ఆడు‌కునే ఆట‌బొమ్మ ఈ మగ‌వాడూ.‌.‌ ఆడు‌కున్న పర‌వా‌లేదూ పగు‌ల‌గొట్టి పోతా‌రెం‌దుకు’‌ అని రాసిన ఆత్రే‌యకు మాత్రమే అలతి అలతి పదా‌లతో అనం‌తా‌ర్థాన్ని చూప‌గల సత్తా ఉంద‌ని‌పి‌స్తుంది.‌ సుశీల పాడిన ‌‘నిత్య సుమం‌గళి నీవమ్మా నీకు అమం‌గ‌ళ‌మే‌దమ్మా.‌.‌ ప్రేమకు మృత్యువు లేదమ్మా పెట్టి‌న‌బొట్టూ పోదమ్మా’‌ పాట దేవి‌కను రాజా బహి‌ష్క‌రించి వెలు‌ప‌లకు పంపిం‌చి‌న‌ప్పుడు వస్తుంది.‌ ఇది కూడా ఆత్రేయ రచనే.‌ ఇక సినారె కలం పండిం‌చిన ‌‘వస్తాడే వస్తాడే వన్నె కృష్ణుడూ.‌.‌ తెస్తాడే తెస్తాడే తేనె‌జ‌ల్లులూ’, ‌‘కాలి‌ము‌వ్వలు ఘల్లు‌ఘ‌ల్లు‌మనె ఎందుకో’, ‌‘ఓర‌చూ‌పులో ఏముందో దోర‌న‌వ్వులో ఏముందో’‌ పాటలు కూడా ఆక‌ట్టు‌కు‌నేవే.‌ ప్రేమా‌ను‌రా‌గా‌లతో నిండిన ఒక ఆద‌ర్శ‌వం‌త‌మైన సిని‌మాగా పేరు‌తె‌చ్చు‌కున్న సినిమా ‌‘ఆడ‌బ్రతుకు’‌.‌

సినిమా నేపథ్యం.‌.‌.

జెమినీ చిత్రని‌ర్మాణ సంస్థకు ఘన‌మైన చరిత్ర ఉంది.‌ ఆ సంస్థ అధి‌పతి సుబ్రమ‌ణియం శ్రీని‌వా‌సన్‌ (యస్‌.‌యస్‌.‌వాసన్‌)కు అంత‌కంటే ఘన‌చ‌రిత్రే ఉంది.‌ తండ్రి మర‌ణిం‌చాక తంజా‌వూరు జిల్లా నుంచి మద్రా‌సుకు చేరు‌కొని, చదు‌వుకు స్వస్తి చెప్పి వ్యాపార రంగంలో అడుగు పెట్టాడు.‌ 1928లో మూత‌ప‌డిన ‌‘ఆనంద బోధిని’‌ అనే పత్రి‌కను సొంతం చేసు‌కొని ‌‘ఆనంద విక‌టన్‌’‌/ళి పే‌రుతో ఆ పత్రి‌కకు ఎన‌లేని కీర్తిని సంపా‌దించి పెట్టారు.‌ 88 ఏళ్లుగా ఆ పత్రిక గౌర‌వ‌ప్రదంగా నడు‌స్తోంది.‌ 1936లో చిత్రని‌ర్మాణ రంగంలో అడు‌గు‌పెట్టి తొలి ప్రయ‌త్నంగా సొంత నవల ‌‘సతి‌లీ‌లా‌వతి’‌ని సిని‌మాగా మలి‌చారు.‌ తర్వాత ‌‘మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూ‌సర్‌ కంబైన్స్‌’‌ అనే ఫిలిం స్టూడి‌యోను కొను‌గోలు చేసి దానికి ‌‘జెమిని’‌ అని నామ‌క‌రణం చేశారు.‌ ఈ సంస్థ ద్వారా పలు తమిళ, తెలుగు, హిందీ సిని‌మా‌లను నిర్మించి ఖ్యాతి గడిం‌చారు.‌ జెమినీ ఫిలిం సర్కూ‌¬్యట్‌ వారు తెలు‌గులో నిర్మిం‌చిన మొదటి చిత్రం ‌‘జీవ‌న్ముక్తి’‌ (1942).‌ తరు‌వాత తెలు‌గులో వరు‌సగా ‌‘బాల‌నా‌గమ్మ’, ‌‘అపూర్వ సహో‌ద‌రులు’, ‌‘మంగళ’, ‌‘ముగ్గురు కొడు‌కులు’, ‌‘చిన్న‌మ్మ‌కథ’, ‌‘రాజీ నా ప్రాణం’‌ వంటి సిని‌మాలు ఎన్నో నిర్మిం‌చారు.‌ చిత్రరం‌గా‌నికి ‌‘పరి‌శ్రమ’‌ గుర్తింపు తెచ్చిన తొలి రాజ్య‌సభ సభ్యు‌డిగా వాస‌న్‌కు పేరుంది.‌ జెమినీ స్టూడి‌యోలో వేప‌త్తూర్‌ కిట్టు అనే తమిళ జర్న‌లిస్టు వారి సిని‌మా‌లకు స్క్రీన్‌ప్లే సమ‌కూ‌రుస్తూ ఉండే‌వాడు.‌ అతడు వాస‌న్‌కు అత్యంత సన్ని‌హి‌తుడు.‌ జెమినీ సిని‌మా‌లకు దర్శ‌కత్వం వహించే టి.‌జి.‌రాఘ‌వా‌చారి (ఆచార్య) కూడా అత‌నికి మిత్రుడే.‌ ‌‘చంద్రలేఖ’, ‌‘మోటార్‌ సుందరం పిళ్లై’‌ వంటి సిని‌మా‌లకు అతడే కథా రచ‌యిత.‌ అతడు ఇంగ్లిషు నవ‌లలు ఎక్కు‌వగా చది‌వే‌వాడు.‌ ఒక‌సారి ఇంగ్లిషు‌లోకి అను‌వ‌దిం‌చిన ఒక ఫ్రెంచ్‌ నవ‌లను చదివి కథ అల్లాడు.‌ ఆ కథనే హిందీలో ‌‘జిందగీ’‌ పేరుతో తొలుత సిని‌మాగా తీశారు.‌ 1964లో విడు‌ద‌లైన ఆ సిని‌మాకు రామా‌నం‌ద‌సా‌గర్‌ దర్శ‌కత్వం వహి‌చంగా, శంకర్‌−‌ జైకి‌షన్‌ సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ రాజేం‌ద్రకు‌మార్, రాజ్‌కు‌మార్, పృథ్వీ‌రా‌జ్‌Ë‌క‌పూర్, వైజ‌యం‌తి‌మాల ప్రధాన భూమి‌కలు నిర్వ‌హిం‌చారు.‌ ఆ సినిమా విజ‌య‌వం‌తంగా ఆడింది.‌ అదే సిని‌మాని తెలుగు తమిళ భాషల్లో ఏక‌కా‌లంలో నిర్మిం‌చా‌లని వాసన్‌ నిర్ణ‌యించి వేప‌త్తూర్‌ కిట్టు చేత కథను ప్రాంతీయ భాషకు అను‌గు‌ణంగా అల్లిం‌చారు.‌ అదే తెలు‌గులో ‌‘ఆడ‌బ్రతుకు’‌గా, తమి‌ళంలో ‌‘మళఘై పడుగు’‌గా రూపు‌ది‌ద్దు‌కుంది.‌ తెలు‌గులో ఎన్టీ‌ఆర్, కాంతా‌రావు పాత్రల్ని తమి‌ళంలో జెమినీ గణేష్, ముత్తు‌రా‌మన్‌ పోషిం‌చగా, యస్వీ‌రం‌గా‌రావు, దేవిక తమ పాత్రల్ని రెండు భాష‌ల్లోను పోషిం‌చారు.‌ ‌‘దేవ‌దాసు’‌ వంటి ప్రతి‌ష్టా‌త్మక సిని‌మాకు దర్శ‌కత్వం వహిం‌చిన వేదాంతం రాఘ‌వయ్య తెలుగు వర్ష‌నుకు, యం.‌సి.‌శ్రీని‌వా‌సన్‌ (హాలీ‌వుడ్‌ శ్రీని‌వా‌సన్‌) తమిళ వర్ష‌నుకు నిర్దే‌శ‌కత్వం వహిం‌చారు.‌

సినిమా విశే‌షాలు..

ఆడ‌బ్రతుకు సినిమా రెండు కేంద్రాల్లో రజ‌తో‌త్సవం జరు‌పు‌కోగా పది కేంద్రాల్లో వంద‌రో‌జులు ఆడింది.‌ తమి‌ళంలో కూడా ఈ సినిమా సూపర్‌ హిట్టే! దేవిక (అసలు పేరు ప్రమీల)కు జెమినీ సంస్థలో నటిం‌చడం ఇదే ప్రథమం.‌ ఈ సిని‌మాలో అద్భు‌తంగా నటిం‌చిన దేవి‌కకు ఈ రెండు భాష‌ల్లోనే కాకుండా మల‌యా‌ళంలో కూడా మంచి అవ‌కా‌శాలు వెతు‌క్కుంటూ వచ్చాయి.‌ హిందీలో రాజ్‌కు‌మార్‌ ధరిం‌చిన పాత్రను కాంతా‌రావు ధరిం‌చారు.‌ ఇది ప్రేక్ష‌కుల సాను‌భూ‌తిని పొందే ఒక భగ్న ప్రేమి‌కుని ఉదా‌త్త‌మైన పాత్ర.‌ ఈ చిత్రని‌ర్మా‌ణా‌నికి ఐదు‌లక్షలు ఖర్చ‌యింది.‌ హిందీ ‌‘జిందగీ’‌ మాతృ‌కకు ఎక్కువ మార్పులు చేయ‌కుండా పాటలు, నృత్యా‌లతో సహా యథా‌త‌థంగా అను‌క‌రిస్తూ చిత్రాన్ని నిర్మిం‌చారు.‌ తమి‌ళంలో పాట‌లను కణ్న‌దా‌సన్‌ రాయగా తెలు‌గులో వాటిని ఆత్రేయ, సినారె రాశారు.‌ ఆత్రేయ ఆ సిని‌మాకు రాసిన పాటలు అల‌రిం‌చాయి.‌ కవి‌సా‌మ్రాట్‌ విశ్వ‌నాథ వారి సమక్షంలో సినిమా శత‌ది‌నో‌త్స‌వాన్ని విజ‌య‌వా‌డలో నిర్వ‌హిం‌చారు.‌ ‌‘ఆడ‌బ్రతుకు’‌ విడు‌ద‌ల‌యిన ఈ సంవ‌త్సరం ఎన్టీ‌ఆర్‌ నటిం‌చిన 12 సిని‌మాలు కూడా యాభై రోజు‌లకు పైగా ఆడగా, ఎని‌మిది చిత్రాలు శత‌ది‌నో‌త్సవం జరు‌పు‌కో‌వడం, ‌‘పాండవ వన‌వా‌సము’, ‌‘ఆడ‌బ్రతుకు’‌ చిత్రాలు రజ‌తో‌త్సవం జరు‌పు‌కో‌వడం విశేషం.‌ విశ్వ‌నా‌థన్‌−‌ రామ్మూ‌ర్తిలు కలిసి సంగీత దర్శ‌కత్వం నిర్వ‌హిం‌చిన ఆఖరి సిని‌మాగా కూడా ‌‘ఆడ‌బ్రతుకు’‌నే చెప్పు‌కో‌వాలి.
- ఆచారం షణ్ముఖాచారి

విజేత విక్రమ్ (1987)




పల్లవి:
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో
పొందులో ప్రేమ విందులో
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నుల్లో తొలివలపు కళలారాబోసింది జాణలా
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా

చరణం: 1
చామంతి నిగ్గు చంగావి సిగ్గు చెక్కిళ్ళ కురిసేటి వేళ
అరె ఈ వాలుపొద్దు ఓ పూల ముద్దు కౌగిల్లు కోసరేటి వేళ
గుండెలోన కొత్త కోరుకుంది చెప్పబోతే గొంతు దాటకుంది
గోదారి పొంగల్లె దూకేటి నీ ఈడు నా దారికొచ్చింది లేవమ్మో
నీ దారి నాదారి ఒకటైన వయసల్లే రావయ్యో..
అల్లుకో అల్లిబిల్లిగా మత్తుగా గమ్మత్తుగా

గోరింట పొద్దుల్లో గోరంత ముద్దుల్లో
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా

చరణం: 2
అందాల కొమ్మ అపరంజి బొమ్మ  తోడుంటే తీరేను తాపం
ఆ నీలి కళ్ళ వాకిళ్లలోన మెరిసేను ఆకాశ దీపం
తీరకుంది తీపి దాహమేదో ఆరకుంది వింత మోహమేదో
మొగ్గల్లే నువ్వొస్తే సిగ్గిల్లే సిరిమల్లె
సిగురాకు సొగసంత నాదమ్మో
ఈ పూల పందిళ్లు మురిపాల సందిళ్ళు నీకయ్యో
మెత్తగా పూల గుత్తిగా హత్తుకో కొత్త కొత్తగా

కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
కన్నె లేడి కూనలా సన్నజాజి వానలా
రాణిలా కన్నె వీణలా రాణిలా కన్నె వీణలా
గోరింక చేరింది చిలకమ్మ చిగురాకు గూటిలో
ఆహా పొందులో ప్రేమ విందులో 


చిత్రం: విజేత విక్రమ్  (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల


భారతంలో అర్జునుడు (1987)



 నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
పరువం గరువం నీ వల్ల దివాల అవ్వాల ఇవాళ హ హ
నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివ్వాల అవ్వాల ఇవ్వాళ

నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా

నీ సుతారమంత సుఖాల శృతిలో సితార వాయించనా
ఈ వయ్యారి సొగసులు కాజేసి ముద్దులు
విరాలమే ఇవ్వనా
నీ బిగింపు తెగింపు నా ఒంపు సొంపుకి ముగింపు కావాలిరా
నా గులాబి రేకుల జిలేబి కైపుల  గులాము లవ్వాలిరా
నువ్వడిగితే తీసివ్వనా నీ ఒంటికె సెంటవ్వనా

నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా

నీ మిఠాయి మాటల గిటారు పాటలు మిటారితో పాడుకో
నా పరాచికాలకు సరైన గురైన జవాబులే చెప్పుకో
నీ హుషారు ఊపుల మిషారి లోపల రసాలు అందించవే
నీ సూదంటు నడుముని నా కంటి చూపుల
దారాలలో దాచవే
నువ్వడిగితే నేనివ్వనా చెయ్ తగిలితే పువ్వవ్వనా

నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివాల అవ్వాల ఇవ్వాళ
నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
పరువం గరువం నీ వల్ల దివాల అవ్వాల ఇవాళ హ హ


చిత్రం: భారతంలో అర్జునుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు , జానకి

బ్లఫ్ మాస్టర్ (2018)





ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే

మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..

తెలియని భావాలన్నీ
తోడై నన్నే చేరీ
నాతో చేస్తున్న సావాసమా
అర్ధాలెన్నో చూపే వేల భాషల్లోని
ప్రేమ గీతాల ఆలాపనా..   
కురిసే వరమై ఎదనే తడిమెనుగా
కలిసే వరసై మనసే మురిసెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఎలా
ప్రేమే నాలో చేరిందెలా..

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే

కొత్తగ నాకే నేను
పరిచయమౌతున్నాను
నాలో ఈ మాయ నీదే సుమా
చిన్ని మోమాటాలే
చెప్పే మౌనంగానే
ప్రేమ బాగుంది నీ భావనా
పలికే పెదవే సడినే మరిచెనుగా
ఐనా మరిలా నీ పేరే పలికెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఇలా
ప్రేమే నాలో చేరిందెలా

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే
మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..


 చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: విశ్వనాథ్ కారసాల
గానం: సునీత
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత
దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
నిర్మాత: రమేష్ పి.పిళ్ళై
విడుదల తేది: 28.12.2018

********** ************ *********** ********** ***********
సత్కర్మ బిచ్చ సత్ఫలితం...
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపాణాం
సత్యం పరాణి భవ మిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మారునాడే
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే....

ఎన్ని కన్నీళ్ల ఉసురుది
వెంటాడుతున్నది నీడల్లే కర్మ 
ధర్మమే నీ పాలి దండమై...
దండించ తప్పించుకోలేదు జన్మ...

సత్కర్మ బిచ్చ సత్ఫలితం...
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపాణాం
సత్యం పరాణి భవ మిహం

పాపం,పుణ్యం,
రెండింటికి నీదే పూచి
కన్ను తెరచి అడుగు వేయి ఆచి,తూచి...
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మారునాడే
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే....

ఏ కన్ను చూడదనా
నీ విచ్చల విడి మిడిసిపాటు...
ఏ చేయి ఆపదనా
తప్పటడుగుల నీ అలవాటు...
అదృశ్య సృష్టి గా సకల సృష్టి నిను  
గమనిస్తున్నది లెక్కగట్టి....

ఎంత బ్రతుకు
నీదెంత బ్రతుకు
ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు...
ఇన్నాటలు, వేటలు
అవసరమా...!
మనుజా...మనుజా...
ఏమారితే నిను కబళిస్తుంది రా
మాయదారి పంజా... 
కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
దాన్ని విడిపించుకోలేదు జన్మ.....

సత్కర్మ బిచ్చ సత్ఫలితం...
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపాణాం
సత్యం పరాణి భవ మిహం
ఈ చోటి కర్మ ఈ చోటే
ఈ నాటి కర్మ మారునాడే
అనుభవించి తీరాలంతే
ఈ సృష్టి నియమం ఇదే...

చిత్రం:బ్లఫ్ మాస్టర్ 
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి,
గానం: అనురాగ్ కులకర్ణి,మోహన భరధ్వాజ,
సంగీతం: సునీల్ కశ్యప్.

తాయారమ్మ బంగారయ్య (1979)





పల్లవి:
ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు
అడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే.. మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

చరణం: 1
ఒకడు ఆమ్ముకుపోయాడు... ఒకడు అడవికి పంపాడు
ఒకడేమో జూదంలో పందెం కాసాడు
తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు
తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు
ఏ మగవాడు ఏ మగువని మనసున్నదిగా చూసాడు
మగవాడే...  మన పగవాడు
మగవాడే...  మన పగవాడు
ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

NO... ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు
ప్రేమించాడు దేవత నీవని పూజించాడు
పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు
 ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు

చరణం: 2
నెత్తిన కూర్చుంది ఒకతి
నెత్తిన తన్నింది ఒకతి
ఒకతేమో శపథం చేసి యుద్ధం చేర్చింది
నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది
తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది
ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?
మగవాడే బలి పశువయ్యాడు
మగవాడే బలి పశువయ్యాడు

ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు

చరణం: 3
సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు
సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈ మగవాడు
యుగయుగాల మీ బానిసే ఆడది
యుగాయుగాలే మా శాపమే ఈ ఆడది


చిత్రం: తాయారమ్మ బంగారయ్య (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం:
గానం: జి. ఆనంద్, సుశీల


జాను (2020)




ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా

ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా

ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా

ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా


కదలని ఓ శిలనే అయినా

త్రుటిలో కరిగే కలవే అయినా

ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా

ఏదో ఒక బదులై  నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా


నా వెంట పడి నువ్వింత ఒంటరి 
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ...

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా

కాలం ఇపుడే నను కనగా
అనగనగా...  అంటూనే ఉంటా
ఎపుడూ పూర్తవనే అవక
తుధి లేని కథ నేనుగా

గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా

యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా

నా వెంట పడి నువ్వింత ఒంటరి 

అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్లుగా 

తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా 
రాకూడదు ఇంకెవరైనా 

అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఉయాలలూపింది జొలాలి

 చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్


ఇల్లాలు

 




ఎల్వీ ప్రసాద్‌ ద్విభాషా చిత్రం ‘ఇల్లాలు’🌹


‘‘నవ్విన ఊళ్లే పట్నాలవుతాయన్న నానుడి నీరసించిపోతున్నప్పుడల్లా ఎవరో ఒక ప్రజ్ఞాశాలి వచ్చి, దాన్ని ఆదుకొని, ఆ మాట నిలబెట్టి ‘ఇది ఉట్టి సామెతే’నని నిస్పృహ చెందేవారికి ధైర్యం చెబుతూ వుంటాడు. అటువంటి ‘దర్శకులపతి’ ఎల్వీప్రసాద్‌’’ అని అరవై దశకంలోనే ముళ్లపూడి వెంకటరమణ చెప్పారు. ఆయన జీవితాన్ని తరచి చూసిన వారికి ఎల్వీ ప్రసాద్‌ ప్రతిభేమిటో అర్థమవుతుంది’ ‘‘నేను కంటి ఆసుపత్రి ఎందుకు పెట్టానో తెలుసా? ప్రజలకు కళ్లు బాగా వుండి, ఎక్కువ సినిమాలు చూడాలని’’ అంటూ చమత్కరించిన ప్రసాద్‌ ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు, అన్నిటికీ మించి గొప్ప దార్శనికుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ‘మనోహర’ (1954), ‘మిస్సమ్మ’ (1955) సినిమాలు చాలు ఆయన ప్రతిభ చాటేందుకు. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను నెలకొల్పి నిర్మాతగా తన తొలి తెలుగు సినిమా ‘ఇల్లాలు’ను సమాంతరంగా తమిళంలో ‘ఇధయ కమలం’గా నిర్మించి విజయం సాధించిన ‘‘దొడ్డ’’ మనిషి ఎల్వీప్రసాద్‌. ‘ఇల్లాలు’ సినిమా 29, అక్టోబర్‌ 1965న విడుదలైంది. ఆ సినిమా విశేషాలు కొన్ని పాఠకుల కోసం...


‘ఇల్లాలు’ నేపథ్యం..


భారతీయ తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ ‘కాళీదాసు’ సినిమాలన్నిటిలోనూ నటించిన ఘనత తెలుగు ఎల్వీ ప్రసాద్‌కే దక్కుతుంది. హెచ్‌.యం.రెడ్డి సలహాపై మద్రాసు వచ్చిన ఎల్వీప్రసాద్‌ అటు సినిమాల్లో నటిస్తూ, ఇటు దర్శకత్వ ప్రతిభను ప్రదర్శిస్తూ అంచెలంచలుగా ఎదిగారు. ఆయన నిర్మాతగా మారి 1955లో లక్ష్మీ పిక్చర్స్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి యోగానంద్‌ దర్శకత్వంలో ‘ఇలవేలుపు’ సినిమాను నిర్మించి విజయం సాధించారు. ఆ తర్వాత 1956లో ‘ప్రసాద్‌ పొడక్షన్స్‌’ సంస్థను నెలకొల్పి హిందీలో ‘శారద’, ‘చోటి బెహన్‌’, ‘బేటి బేటే’ చిత్రాలకు దర్శక-నిర్మాతగా, ‘ససురాల్‌’, ‘హమ్‌ రాహి’ సినిమాలకు నిర్మాతగా, తెలుగులో ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పుకూడు’ వంటి చిత్రాలకు, తమిళంలో ‘భాగ్యవతి’ ‘ఇరువర్‌ ఉళ్లం’ వంటి మరెన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. 1965లో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద నిర్మాతగా ‘ఇల్లాలు’ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాతగానే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తూ సిద్ధహస్తుడైన ఎడిటర్‌గా పేరుతెచ్చుకున్న తన తమ్ముడు అక్కినేని సంజీవరావు (సంజీవి)కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. సంజీవికి దర్శకునిగా ఇదే మొదటి చిత్రం. ఇక సినిమా కథ విషయానికి వస్తే... 1964లో రాజా పరాంజపే దర్శకత్వంలో ‘పాఠలాగ్‌’ పేరుగో ఒక మరాఠీ సినిమా వచ్చింది. కాశీనాథ్‌ ఘనేకర్‌ పేరుతో ఒక మరాఠీ సినిమా వచ్చింది. కాశీనాథ్‌ ఘనేకర్‌, భావన అందులో నాయకానాయికలు. దత్తా దవజేకర్‌ సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ మరాఠీ చిత్రానికి జయంత్‌ దాహ్లె కథను సమకూర్చారు. ‘పాఠలాగ్‌’ సినిమా బాగా ఆడటమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి, మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తమచిత్ర బహుమతి కూడా అందుకుంది. అదే సినిమా కథను స్ఫూర్తిగా తీసుకొని ముళ్లపూడి వెంకటరమణ చేత కథ, మాటలు రాయించి ‘ఇల్లాలు’ పేరుతో ఎల్వీప్రసాద్‌ సినిమాగా తీశారు.


వి‘చిత్ర’ కథ..


ప్రేమించుకుని పెళ్లాడిన వేణుగోపాలరావు (కె.వి.నాగేశ్వరరావు), రాధారాణి (గీతాంజలి)లది అనుకూల దాంపత్యం. వేణుగోపాలరావుకు ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకునే అవకాశం వస్తుంది. ఒక సంవత్సరం ఎడబాటు భరిస్తే తన భర్తకు న్యాయవాదిగా మంచి పేరుప్రతిష్టలు వస్తాయని రాధారాణి భర్తను ప్రోత్సహించి ఇంగ్లాండుకు పంపుతుంది. భార్యకు జబ్బుచేసి ప్రాణాపాయ స్థితిలో ఉందని వేణుగోపాలరావుకు టెలిగ్రాం రాగానే అతడు విదేశాల నుండి తిరిగి వస్తాడు. అతని చేతులలోనే భార్య మరణిస్తుంది. అంత్యక్రియలన్నీ అతడే స్వయంగా జరిపిస్తాడు. ఆ వూరి శివార్లలో స్థావరం ఏర్పరచుకున్న బందిపోటు ముఠానాయకుడు సింగన్న (సి.హెచ్‌.కృష్ణమూర్తి)ను పట్టుకోవటానికి పోలీసులు దాడిచేస్తాడు. సింగన్న గాయపడి తప్పించుకుంటాడు. అతని భార్య సుధారాణి (గీతాంజలి) పోలీసులకు పట్టుబడుతుంది. ఎన్నో దోపిడీలకు, హత్యలకు ఆమెను కారకురాలుగా భావించిన పోలీసులకు తను దొంగరాణిని కాననీ, తనపేరు రాధారాణి అనీ, లాయరు వేణుగోపాలరావు ‘‘ఇల్లాలు’’ననీ వాంగ్మూలం ఇస్తుంది. వేణుగోపాలరావు ఇంటి ఆనవాళ్లు, కుటుంబం గురించి ఎన్నో వివరాలు పూసగుచ్చినట్లు చెబుతుంది. ఆమె రూపురేఖలు అచ్చుగుద్దినట్లు రాధారాణివిలాగే వుంటాయి. సమస్య కోర్టు పరిధిలోకి వస్తుంది. కోర్టులో తన మొదటి సాక్షిగా వేణుగోపాలరావునే ఎంచుకుంటుంది. భర్త నడము మీద పుట్టుమచ్చతో సహా ఎన్నో దాంపత్య రహస్యాలను దొంగలరాణిగా పిలువబడే సుధారణి కోర్టుకు వెల్లడిస్తుంది. అయితే వేణుగోపాలరావు మాత్రం ఆమె తన భార్య కాదని వాదిస్తాడు. చివరికి ఆమెకు మతి భ్రమించిందని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. భర్తతో ఏకాంతంగా మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొంది ఆమె భర్త ఇంటికి వెళ్తుంది. చనిపోయినది తన సోదరి సుధారాణి అని, తామిద్దరమూ కవలపిల్లలమని చెప్పి దాఖాలాలు చూపిస్తుంది. దురదుదృష్టవశాత్తు తన భార్య దోపిడీ ముఠాకు దొరికిందని వేణుగోపాలరావు గ్రహిస్తాడు. రాధారాణి పోలీసులకు పట్టుబడినప్పటి నుంచి ఆమెను మారువేషంలో వెన్నంటి వస్తున్న సింగన్న, చనిపోయింది తన భార్య సుధారాణి అని గ్రహించి, పశ్చాత్తాపపడి, పోలీసులకు లొంగిపోతాడు. కోర్టులో రాధారాణిని భార్యగా స్వీకరించడంతో సినిమా ముగుస్తుంది. సహయక పాత్రలలో న్యాయమూర్తిగా ధూళిపాళ్ల, ప్రభుత్వ వకీలుగా ప్రభాకర్‌రెడ్డి, పోలీసు అధికారిగా రామకృష్ణ, గుమాస్తాగా అల్లు రామలింగయ్య, ఇంటి నౌకరుగా చదలవాడ కుటుంబరావు నటించగా చలం, రామన్న పంతులు హాస్యాన్ని పండించారు.


చిత్ర విశేషాలు..


‘ఇల్లాలు’ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకే బ్యానర్‌ మీద ఎల్వీప్రసాద్‌ నిర్మించారు. అయితే తెలుగులో నిర్మించిన చిత్రంలో కొన్ని ప్రయోగాలు చేశారు. మొదటిది సినిమా దర్శకుని నియామకం. అక్కినేని సంజీవరావు ఎల్వీ ప్రసాద్‌కు స్వయానా తమ్ముడు. ఎన్నో తమిళ, తెలుగు ఒరియా చిత్రాలకు సమర్ధవంతమైన ఎడిటర్‌గా పనిచేసిన ప్రతిభావంతుడు. ‘‘సంజీవి’’గా పిలిపించుకునే సంజీవరావు ఎంతటి ప్రజ్ఞావంతుడంటే, సినిమాలకు సబ్‌-టైటిళ్లు వేసే పరికరం మన దేశంలోకి రాని కాలంలోనే సొంత ప్రతిభతో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందకు, సాక్షి వంటి తెలుగు సినిమాలకు సబ్‌-టైటిళ్లు జోడించి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలకు పంపిన ప్రయోగశాలి. ఈ సంజీవి కుమారుడే పదిహేను భాషల్లో సినిమాలకు ఎడిగింగ్‌ చేసిన వ్యక్తిగా ‘లిమ్కా’ రికార్డులకెక్కి అనేక జాతీయ పురస్కారాలను అందుకున్న శ్రీకర ప్రసాద్‌. ఇక హీరో విషయానికొస్తే, స్ఫురద్రూపి అయిన కర్రి వెంకట నాగేశ్వరరావు (కె.వి. నాగేశ్వరరావు) అనే నూతన నటుణ్ని ఎంపిక చేశారు. ఇతడు ఖరగ్‌పూర్‌ రైల్వే లోకోషెడ్‌లో చార్జ్‌మన్‌గా పనిచేస్తూ ఎన్నో నాటకాల్లో నటించాడు. తొలి చిత్రంలోనే గంభీరమైన పాత్రను పోషించి ఆకర్షించుకోగలిగాడు. అప్పటి వరకు అనేక సినిమాల్లో నర్తకిగా, వ్యాంప్‌గా నటించిన గీతాంజలికి హీరోయిన్‌ పాత్రను కట్టబెట్టడం కూడా ఒక సాహసమని చెప్పాలి. అది కూడా ద్విపాత్రాభినయంలో, ఇక బందిపోటు విలన్‌గా విశేష నాటకానుభావం, చక్కని వాచికం వున్న సి.హెచ్‌. కృష్ణమూర్తిని ఎంపిక చేసుకున్నారు. సంజీవి కథను నడిపించిన తీరు వైవిధ్యంగా ఉంటుంది. సగం కథ ప్రత్యక్షంగాను, మిగతా భాగం ‘ప్లాష్‌- బ్యాక్‌’లోను నడుస్తుంది. ప్లాష్‌-బ్యాక్‌ కథను విడదీసి సమన్వయ పరచుకుంటూ వీక్షించే అవకాశం ప్రేక్షకుడికి కలిగింది. ముళ్లపూడి మాటలు సరళంగా ఉండి కథనాన్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లేందుకు ఉపకరించాయి. అవుట్‌ డోర్‌ దృశ్యాలను నైనిటాల్‌లో చిత్రీకరరించారు. ఒక రకంగా చెప్పాలంటే పాత-కొత్తల మేలు కలయికతో ‘తేనెమనసులు’ సినిమాను మరపిస్తూ సంజీవి ఈ సినిమాను మలచారని చెప్పవచ్చు. ‘ఇల్లాలు’ సినిమాను సమాంతరంగా తమిళంలో నిర్మించిన ‘ఇధయ కమలం’ సినిమాకు శ్రీకాంత్‌ దర్శకుడు కాగా సంగీత దర్శకత్వం రెండు వెర్షన్లలో కె.వి.మహదేవన్‌ నిర్వహించారు. ‘కాదలిక్క నేరమిల్లై’లో శ్రీధర్‌ హీరోగా పరిచయం చేసిన రవిచంద్రన్‌, ‘కర్పగం’లో కె.యస్‌.గోపాలకృష్ణన్‌ పరిచయం చేసిన కె.ఆర్‌.విజయ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇదే చిత్ర కథను హిందీ చిత్ర నిర్మాత ప్రేమ్‌ జీ, రాజఖోస్లా దర్శకత్వంలో ‘మేరాసాయా’ (1966) పేరుతో సినిమాగా నిర్మించారు. సునీల్‌దత్‌, సాధన నటించిన ఈ సినిమా సిల్వర్‌ జూబిలీ జరుపుకోవడమే కాకుండా, 1966 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. సహాయక పాత్రల్లో కె.యన్‌.సింగ్‌, అన్వర్‌హుస్సేన్‌, ప్రేమ్‌ చోప్రా నటించారు. తమిళ, హిందీ భాషల్లో రికార్డులు సృష్టించిన ‘ఇల్లాలు’ సినిమా తెలుగులో డెభ్బై రోజులకు పైగానే ఆడింది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే రవిచంద్రన్‌ ఇందులో నటించిన షీలాను పెళ్లి చేసుకున్నాడు. సంజీవి తదనంతరం కాలంలో మంచి దర్శకుడుగా ‘అత్తగారు- కొత్త కోడలు’, ‘నాటకాల రాయుడు’, ‘అక్కా- చెల్లెలు’, ‘ధర్మదాత’, ‘సిసింద్రీ చిట్టి బాబు’ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు.


తకతక తాళం తట్టిన పాటలు..


‘ఇల్లాలు’, సినిమాకు శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు పాటలు రాయగా, ‘ఇధయ కమలం’కు కణ్ణదాసన్‌ రాశారు. రెంటికీ సంగీత దర్శకుడు మహదేవన్‌. హిందీ సినిమా ‘మేరా సాయా’కు రాజా మెహదీ ఆలీఖాన్‌ పాటలు రాయగా మదన్‌ మోహన్‌ సంగీతం సమకూర్చారు. శ్రీశ్రీ రాయగా సుశీల ఆలపించిన ‘‘నీవు నా ఊహలందే నిలిచావు నేను నీ కళ్లలోనే వెలిశాను... వేయిజన్మాలకైనా విడలేనూ... నీ ఇల్లాలుగా నేనుంటాను’’ అనే టైటిల్‌ గీతాన్ని మహదేవన్‌ పహాడ్‌ రాగంలో స్వరపరచారు. సినిమా కథనంతా పాటలోనే అల్లడం శ్రీశ్రీ గొప్పతనం. జానకి పాడిన జనరంజమైన కొసరాజు హుషారు పాట ‘‘తకతకతక తాళం దట్టు మామా నీ దరువులు కలపవయా’’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆత్రేయ కలం విదిలించిన ‘‘నువుపోయిన చోటే నేనూ వున్నా పోపోపో’’ పాటను పి.బి. శ్రీనివాస్‌, సుశీల పాడారు. మరో ఆత్రేయ పాట ‘‘మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగెరా... నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో’’ని సుశీల ఆలపించారు. మరో అద్భుత యుగళగీతం ఫక్తు ఆత్రేయ మార్కు పాట ‘‘అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే... నువ్వంటే నువ్వే నీవంటిది నువ్వే నువ్వే’’ పి.బి. శ్రీనివాస్‌, సుశీల గళంలో అద్భుతంగా అమరింది. ‘‘మనసునేదో కవ్విస్తూంది తలచుకుంటే నవ్వొస్తూంది’’ కూడా మంచి పాటే. చివరి మాట... హిందీలో రజతోత్సవాన్ని, తమిళంలో శతదినోత్సవాన్ని జరుపుకొని మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ఇల్లాలు’ సినిమా బహుశా కొత్త నటులు కావడంతో తెలుగులో డెభ్బై రోజులకు మించి ఆడలేకపోయిందనుకోవాలి.


- ఆచారం షణ్ముఖాచారి

అమ్మ బ్రహ్మ దేవుడో

నేడు  అందాల నటి శ్రీదేవి గారి జయంతి సందర్భంగా గోవిందా గోవిందా చిత్రం  నుండి  ఒక చక్కటి పాట మీకోసం 💐💐💐






పల్లవి: 

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా 
అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా 

హుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా 
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా 

అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో 
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు 
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో 
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

చరణం 1: 

కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా 
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా 
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ 
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా 
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా 

ఒకటై సిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి… 
తకథై ఆటాడించే చోద్యం చూడండి 

చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు 
మన ముంగిట్లో కథాకళి ఆడేనా 

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 
అమ్మ బ్రహ్మ దేవుడో.. అరే కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో 

చరణం 2: 

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి 
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి 
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ 
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి 
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి 

అప్పన్న తనామనా కధం తొక్కే పదానా 
తప్పన్న తనా మనా తేడా లేదోయ్ నా 

తందానా తాళానా కిందైనా మీదైనా 
తలవంచేనా తెల్లారులూ తిల్లానా 

హోయ్.. హోయ్.. హోయ్... 
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో 
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు 
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో 
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా 
అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా 

హుయ్.. హుయ్.. హుయ్.. 
దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా 
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా



చిత్రం: గోవిందా గోవిందా (1993) 
సంగీతం: రాజ్-కోటి 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: బాలు, చిత్ర, మాల్గాడి శుభ 

జయ కృష్ణా ముకుందా


ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఆ శ్రీ కృష్ణుడిని తలుచుకుంటూ శ్రీ పాండురంగ మహత్యం నుండి ఒక చక్కటి పాట మీ కోసం,వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ చూడవచ్చు.






పల్లవి:

హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

దేవకి పంట... వసుదేవువెంట....
దేవకి పంట... వసుదేవువెంటా...
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా... నందుని ఇంటా
వెలసితివంటా... నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

చరణం 1:

నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
నీ పలుగాకి పనులకు గోపెమ్మ... కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులకూలిచి....
ఊపునబోయీ మాకులకూలిచి... శాపాలు బాపితివంటా....ఆ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ... చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద.. ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...
చూపితివట నీ నోటను... బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు... తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ...
కృష్ణా... ముకుందా... మురారి

చరణం 2:

కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ... కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ
కంసాదిదానవ గర్వాపహారా...
కంసాదిదానవ గర్వాపహారా... హింసా విదూరా.. పాపవిదారా...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్... కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...
విజయతే... గోపాల చూడామణీ...
విజయతే... గోపాల చూడామణీ...

చరణం 3:

లలిత లలిత మురళీ స్వరాళీ...
లలిత లలిత మురళీ స్వరాళీ... పులకిత వనపాళి... గోపాళీ..
పులకిత వనపాళి...ఈ...
విరళీకృత నవ రాసకేళి...
విరళీకృత నవ రాసకేళి... వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ....

కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి..
జయ కృష్ణా... ముకుందా... మురారి..
హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..





చిత్రం: శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల

నువ్వా నేనా (2012)

చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: భీమస్ సెసిరోలె
గానం: కైలాష్ ఖేర్


సర్ర... సర్ర...
సర్ర... సర్ర...
హే...

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
థోడ థోడ చేసింది నన్ను తుఖ్డా తుఖ్డా తుఖ్డా
ఆడ ఈడ యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)
లుట గయ ఓ మేరీ దిల్ లుట గయ

ఓ జాబిల్లి పైన నీటి జాడ తెలిసెలె
ఈ పిల్ల మనసులో మాట తెల్వలే
జో లాలి పాట లోన మాయ ఉందిలే
ఈ పిల్ల గాలిలోన మర్మములోతు నాకు చెప్పలే
పీక లోతు ముంచెలే
అంతు పంతులే దీని తంతు వేరులే
కక్కలేక  మింగలేక
పీక్కోలేక ఏమి బాధలే


సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే

సర్ర...  సర్ర...

ఓ కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారాలే
నవ్విస్తే కల పాని కారాగారాలె
ఓ నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే
పువ్వుల్తో ప్రాణం పోసే నేర్పు ఉందిలే
కొంత అందం ఉందిలే కొంత క్షరం ఉందిలే
కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే
సైన్స్ లిన మాథ్స్ లోన చెప్పలేని సత్యం ఉందిలే

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (8)