సుందరి-సుబ్బారావు (1984)

చిత్రం:  సుందరి-సుబ్బారావు (1984)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  వేటూరి
గానం:  ఎస్.పి. బాలు, జానకి


పల్లవి:
పాడనా వేణువునై నీవు నా ప్రాణమై
పాడనా వేణువునై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావనిలో...
ప్రియదర్శన రసమాధురిలో
పాడనా వేణువునై నీవు నా ప్రాణమై

చరణం: 1
చెలీ.. సఖీ.. ప్రియే.. చారుశీలే.. అనీ..
తలచి తనువు మరచి కలలు కన్నానులే
కాముడిలా సుమ బాణాలు వేసి
కదిలిన నీ చలి కోణాలు చూసి

ఆమనిలో సుమ గంధాలు పూసి
కవితలుగా నవ వేదాలు రాసి
మోవికి తగిలి ముద్దుల మురళి
కౌగిళ్ళలో ప్రియ కళ్యాణిలో...
సంగీతమే పాడిందిలే

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై

చరణం: 2
కలం..గళం..స్వరం నాకు నీవేననీ
మధుర ప్రణయ కవిత పాడుకున్నానులే

నీలో అలిగే అందాల రూపం
నాలో వెలిగే శృంగార దీపం
నీలో కరిగే ఆ ఇంద్ర చాపం
నాలో జరిగే అమృతాభిషేకం
సన్నని కులుకే వెన్నెల చినుకై
రమ్మందిలే మనసిమ్మందిలే
నీ రాగమే పాడిందిలే

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై
నా జీవన బృందావనిలో
ప్రియదర్శన రస మాధురిలో

పాడనా వేణువునై నీవు నా ప్రాణమై


దేవదాసు




అక్కినేని అద్భుత అభినయం... దేవదాసు

‘దేవదాసు’ చిత్రం అంటే ముందుగా చక్రపాణి గురించి చెప్పుకోవాలి. దర్శకుడు పి.పుల్లయ్య చిత్రం ‘ధర్మపత్ని’ (1941)కి సంభాషణల రచయితగా చక్రపాణి తెనాలి నుంచి మద్రాసు వచ్చారు. ఆయన రాసిన సంభాషణలు నచ్చడంతో వాహినీ వారు తమ ‘స్వర్గసీమ’ (1943) చిత్రానికి చక్రపాణి చేత రచన చేయించడం, తదనంతర కాలంలో తమ సంస్థకు భాగస్వామిని చెయ్యడం కూడా జరిగింది.

మదనపల్లి శానిటోరియంలో చికిత్స పొందుతుండగా ఒక బెంగాలి బాబుతో సాంగత్యం పెరిగి వారి భాషను నేర్చుకొన్న చక్రపాణి, ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటర్జీ సాహిత్యాన్ని సరళమైన చక్కని తెలుగు భాషలోకి అనువదించడం మొదలెట్టారు. వాహినీ వారికి బి.ఎన్‌.ప్రెస్‌ ఉండటంతో, తన పుస్తకాల ముద్రణ అందులో చేయించడం, ‘చందమామ’ (1947) పత్రికకు సంపాదకత్వం వహించడంతో శరత్‌ నవలలు తెలుగు తెరకు ఎక్కించే ప్రయత్నాలు జరిగాయి. 1948లో శరత్‌ నవల ‘నిష్కృతి’ ఆధారంగా తెలుగులో ‘మనదేశం’ చిత్రం నిర్మితమైంది. దేవదాసును తెలుగులోకి అనువదించి ఉండకపోతే.. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులని అలరించి ఉండేదే కాదేమో? విశ్వజనీనత మూర్తీభవించే ఆవేదన నింపిన ఒక సజీవ పాత్ర దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు నటజీవితాన్ని మలుపుతిప్పిన అపురూప పాత్రల్లో దేవదాసు ఒకటి. జూన్‌ 26, 1953న విడుదలైన ‘దేవదాసు’ చిత్రం 400 రోజులు పైగా ఆడి వజ్రోత్సవం జరుపుకొంది. ఈ చిత్రం ఇప్పుడు 67 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఆ సినిమా అజరామరం..నిత్య నూతనం.

* నిర్మాణ సాహసం

దేవదాసు నవలను శరత్‌ తన 16వ ఏట రచించారు. ఈ నవలను మొదట 1890 ప్రాంతంలో ‘శిశువు’ అనే లిఖిత పత్రిక ప్రచురించింది. ఈ నవలలో చెడుని ఆకర్షణీయంగా మలిచి పొరపాటు చేసినట్లు శరత్‌ భావించడంతో దాని ప్రచురణకు ఆయన అంగీకరించలేదు. అందుకే ఈ నవల రాత ప్రతిని తన మిత్రుడు సౌరేంద్ర దగ్గర భద్రపరిస్తే, అతడు శరత్‌ ఇతర రచనలతోపాటు దేవదాసు నవలకు కూడా పుస్తకరూపమిచ్చాడు. ఈ నవలను చక్రపాణి సరళమైన తెలుగు భాషలోకి అనువదించి తన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. 1928లో దేవదాసు నవల బెంగాలీ మూకీ చిత్రంగా వచ్చింది. అదే నవలను 1935లో న్యూ థియేటర్స్‌ వారు పి.సి.బారువా దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. దాంతో ‘దేవదాసు’ చిత్రం దేశమంతటా తెలిసింది. బెంగాలీ చిత్రంలో బారువా నటిస్తే, హిందీలో కె.ఎల్‌.సైగల్‌ దేవదాసుగా నటించారు.

1949 చివరన నిర్మాత డి.ఎల్‌.నారాయణ వినోద పిక్చర్స్‌ స్థాపించి సముద్రాల, వేదాంతం రాఘవయ్య, సుబ్బారామన్‌లను భాగస్వాములుగా చేర్చుకొని అక్కినేని, అంజలీదేవిలతో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘స్త్రీ సాహసం’ (1951) అనే జానపద చిత్రాన్ని తీసి విజయం సాధించారు. మలి ప్రయత్నంగా దేవదాసు నవలను చిత్రంగా తియ్యాలని సంకల్పించి 07-11-1951న రేవతి స్టూడియోలో డి.ఎల్‌. నారాయణ ప్రారంభ పూజ కూడా నిర్వహించారు. నిర్మాత కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకటి రెండు మినహా అన్ని పాటల రికార్డింగ్‌ జరిగింది. సముద్రాల స్క్రిప్టు సిద్ధం చేశారు. షూటింగ్‌ ప్రారంభ దశలోనే సంగీత దర్శకులు సుబ్బురామన్‌ 27-06-1952లో హఠాన్మరణంతో చిత్ర నిర్మాణం ఆగిపోయింది. దాంతో చిత్రసీమలో కలకలం రేగింది. శరత్‌ సృష్టించిన దేవదాసు పాత్రకు జానపద పాత్రలు వేసే అక్కినేని పనికిరారని, నృత్య దర్శకుడిగా ఉన్న వేదాంతం రాఘవయ్య ఇటువంటి చిత్రానికి దర్శకత్వం వహించడం దుస్సాహసమే అవుతుందని విమర్శలు వెల్లువెత్తాయి. సుబ్బురామన్‌ మరణం అశుభ సూచకంగా ప్రచారమైంది. ఈ విమర్శలు నిర్మాతల్లో పట్టుదలని పెంచడం కాకుండా దేవదాసు చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి ఉపయోగపడ్డాయి.

* అంకిత భావం

ఎట్టకేలకు ‘దేవదాసు’ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. మద్దిపట్ల సూరితో బెంగాలీ మూలంలోని దేవదాసు పాత్ర స్వభావం ఎలా ఉన్నదో చర్చించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి, సలహాలు, సూచనలు పాటించారు. చిత్ర కథనాన్ని ఒక పవిత్ర యుజ్ఞంగా భావించి అద్భుతమైన చిత్రానువాదానికి సముద్రాల శ్రీకారం చుట్టారు. డి.ఎల్‌.కి అక్కినేని నటన మీద ఎంతో నమ్మకం.

విమర్శలకు జడవలేదు. పార్వతి పాత్రకు భానుమతిని తీసుకోవాలనుకున్నారు. ఆమెకి చెందిన భరణీ స్టూడియోలో డి.ఎల్‌ గతంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసి ఉండటం, ఆయన తీసే సినిమాలో నటించడం అవమానంగా భావించి భానుమతి ఆ పాత్రను తిరస్కరించింది. తరువాత షావుకారు జానకిని తీసుకుంటే కాల్‌షీట్లు కుదరక ఆమె తప్పుకుంది. చివరకి తమ ‘శాంతి’ చిత్రంలో ఓ పాత్రలో నటించిన సావిత్రిని పార్వతి పాత్ర వరించింది. సావిత్రికి ఈ పాత్ర ఒక చాలెంజ్‌గా మారడంతో చక్రపాణి నవలని అనేకసార్లు చదివి పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకొని నటనకు సిద్ధమైంది. తిరువాన్కూర్‌ సోదరీమణులలో పెద్దదైన లలితకి చంద్రముఖి పాత్ర, పేకేటి శివరాంకి భగవాన్‌ పాత్ర, యస్‌.వి.రంగారావుకి దేవదాసు తండ్రి పాత్ర, సి.యస్‌.ఆర్‌కి ముసలి జమీందార్‌ భుజంగరావు పాత్ర, దొరస్వామికి పార్వతి తండ్రి నీలకంఠం పాత్ర, ఆరణి సత్యనారాయణకి దేవదాసు నౌకరు ధర్మన్న పాత్ర, సురభి కమలాభాయికి నీలకంఠం తల్లి పాత్ర దక్కాయి.

ఈ చిత్ర కథావస్తువు సాధారణమైనదే! ఒక పేదింటి చిన్ననాటి నేస్తాన్ని, పొరుగింటి జమిందారు కొడుకు ప్రేమిస్తాడు. ఆస్తి అంతస్తుకి ప్రాధాన్యమిచ్చే జమిందారు వారి పెళ్లికి అంగీకరించడు. జమీందారీ కుటుంబ కట్టుబాట్ల వల్ల తండ్రి మాటకు ఎదురు చెప్పలేని దేవదాసు ఇల్లు విడిచి వెళ్లి, పార్వతిని మరువలేక తాగుడికి బానిసై మానసిక వ్యధకు గురవుతాడు. తండ్రి పట్టుదల వలన పార్వతి ఒక ముసలి జమిందారుకి భార్య అవుతుంది. భగ్న ప్రేమికుడైన దేవదాసు మనసుకు శాంతి కరువై పార్వతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద వారి ఊరుచేరుకొని ఆమె బంగళా సమీపంలోనే మాట పడిపోయిన స్థితిలో మరణిస్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి దేవదాసుని చూసేందుకు వస్తూ మూసిన తులపును ఢీకొని తను కూడా మరణిస్తుంది. ఈ చిత్రం చివర ప్రేక్షకులకి నేపథ్యంలో దర్శకుడు విన్నపాన్ని జోడించారు. ‘‘దేవదాసు లాంటి దిక్కులేని చావు పగవారికైనా వద్దు. మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పర్శ నుదట సోకాలి. కనికరించి తన కోసం కన్నీరునించే ఒక ముఖమైనా తాను చూడాలి. అంతకంటే పెద్ద కోరిక అనవసరం. ఎప్పుడైనా దేవదాసు వంటి భగ్న జీవులు మీకు కనిపిస్తే వారిని ఏవగించకండి.. కనికరించండి’’ ఈ విన్నపంతో చిత్రం ముగుస్తుంది.

* చిత్ర విశేషాలు

సముద్రాల సంభాషణల్లో సాధారణంగా నిడివి ఎక్కువగా ఉంటుంది. కానీ ‘దేవదాసు’ చిత్ర సంభాషణలు కఠిన పదాలు లేకుండా వ్యవహారిక భాషలోనే నడుస్తాయి. అంచేత దేవదాసు కథ తెలుగునాటే జరిగిందన్న అనుభూతి ప్రేక్షకులకు కలిగింది. ‘దేవదాసు’ సంభాషణలు సంస్కారానికి అద్దం పడతాయి. తాగిన మైకంలో ఉన్న దేవదాసుని నౌకరు ధర్మన్న, చంద్రముఖి సాయంతో తీసుకొచ్చిన తరువాత నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం కాఫీ ఇచ్చిన చంద్రముఖితో మొదటిసారి సుదీర్ఘంగా దేవదాసు మాట్లాడతాడు. ‘‘నీ పేరు చిన్నది చేసి అమ్మీ అని పిలుస్తాను’’ అంటాడు.

‘‘రాత్రి నాకు పరిచర్యలు చెయ్యడం గుర్తించాను. ఈ పట్నంలో నువ్వు తప్ప నాకీ సేవ ఎవరు చేస్తారా అనుకున్నాను. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నేను నీకు ఎవరిని అమ్మీ’’ అంటాడు. ‘‘ఇహానికీ పరానికీ మీరే నా దేముడు’’ అంటుంది చంద్రముఖి. ‘‘పార్వతి, నేను ప్రేమించుకున్నాం. దాని వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాం. నన్ను నమ్ముకుంటే నువ్వూ బాధలు పడతావు సుమా’’ అంటూ హెచ్చరిస్తాడు. ‘‘ఆ బాధలే నాకు ఆనందం’’ అని చంద్రముఖి అంటే ‘‘ఈ విషయంలో నువ్వు, పార్వతి ఒక్కటే! కానీ ఆమెను అందరూ పూజిస్తారు. నిన్ను ఏవగిస్తారు, పాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకు ఏమి శిక్ష విధిస్తాడో తెలియదు గానీ, మళ్లీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండను’’ అంటాడు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో డాక్టర్‌ చంద్రముఖితో దేవదాసు అట్టే రోజులు బతకడని, అయిన వారిని రప్పించడంగానీ, లేదా వారున్న చోటికి వెంటనే పంపమని చెబుతాడు. దేవదాసు చంద్రముఖితో ‘‘డాక్టర్‌ ఏమన్నాడ’’ని ప్రశ్నిస్తాడు. ‘‘గాలి మార్పు కావాలి. మీ ఊరికి పదండి. నేనూ తోడుగా వస్తాను’’ అంటుంది చంద్రముఖి. దేవదాసు చంద్రముఖిని అనునయిస్తాడు. ‘‘వద్దమ్మీ, అది మనిద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది. నిన్ను హీనంగా చూస్తుంది. ఆ మాట వింటే పార్వతి కుళ్లిపోతుంది’’ అని డబ్బు చేతుల్లో పెడతాడు. ‘‘మానవ దేహాలు స్థిరం కావమ్మీ. చివరకు ఎటూ కాకుండా పోతావేమో! ఉంచుకో’’ అని వేదాంతం చెబుతాడు. దేవదాసు సంస్కారవంతుడని ఈ సంఘటనలు రుజువు చేస్తాయి. పార్వతి తన ఊరికి ప్రయాణం కడుతుంది. దేవదాసుని తనతో తీసుకువెళ్లాలని. మనసు వికటించిన దేవదాసు పట్నం బయలుదేరుతాడు. పార్వతి ప్రయాణించే మేనా, దేవదాసు జట్కా పక్కపక్క నుంచి వెళ్తాయి. విధివిలాసం అంటే...అనుకోనిది జరగడం అంటే ఎలా ఉంటుందో ఈ సన్నివేశంలో దర్శకుడు చూపిస్తాడు.

‘దేవదాసు’ చిత్రంలో పాటలన్నీ ఆణిముత్యాలే!

ఈ పాటల్ని హృదయంతో విని ఆకళింపు చేసుకుంటేనే ఆ విలువలు మనకి తెలుస్తాయి. సుబ్బురామన్‌ స్వరపరచిన అన్ని పాటలూ ఎంతో మార్దవంగా ఉంటాయి. ఆయన మరణాంతరం ఈ చిత్రానికి టి.కె.రామమూర్తి సహకారంతో సుబ్బురామన్‌ సహాయకుడు ఎం.ఎస్‌.విశ్వనాథ్‌న్‌ నేపథ్య సంగీతాన్ని అందించి చిత్రాన్ని పూర్తి చెయ్యడమే కాకుండా ‘‘జగమే మాయ’’, ‘‘అందం చూడావయ్యా’’ పాటల్ని తనే స్వరపరచారు. బి.ఎస్‌.రంగా ఛాయాగ్రహణ పనితనం ఈ చిత్రానికి హైలైట్‌. మేకప్‌మేన్‌ మంగయ్య అక్కినేనిని తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం. చేతుల మీద నరాలు బొమికలు చిక్కినట్టు కనిపించేందుకు చేతి వేళ్ల సందుల్లో కూడా మేకప్‌ అద్దేవారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీశారు. మధురైలో ఈ చిత్రం 65 వారాలు ఆడి రికార్డు సృష్టించింది.

* ముందే చూసి ఉంటే..

దేవదాసు నవలని హిందీలో దిలీప్‌ కుమార్, సుచిత్రాసేన్‌లతో 1955లో బిమల్‌ రాయ్‌ నిర్మించారు. దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ..‘‘అక్కినేని నటించిన తెలుగు ‘దేవదాసు’ చిత్రాన్ని ముందే నేను చూసివుంటే హిందీ చిత్రంలో నటించి వుండేవాడిని కాదు’’ అన్న వాక్యమొక్కటి చాలు తెలుగు ‘దేవదాసు’ ప్రశస్తిని తెలుపడానికి. 1974లో నటుడు కృష్ణ ‘దేవదాసు’ చిత్రాన్ని రంగులలో తీశారు. కానీ ఆశించిన విజయాన్ని ఆ చిత్రం అందుకోలేదు. ఒక క్లాస్‌ సినిమా మాస్‌ స్థాయిని కూడా ఛేదించి 18 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడం ఒక అద్బుతమే!

- ఆచారం షణ్ముఖచారి

డాక్టర్ చక్రవర్తి (1964)

చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల, వసంత 

పల్లవి :

నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది...  ఈ వేళ
నీకెలాగుంది...  ఈ వేళ
నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది...  ఈ వేళ
నీకెలాగుంది...  ఈ వేళ


ఏది చూసినా...  ఏమి చేసినా ఏదోగా ఉంది
ఏమి చెప్పనే పిల్లా...  భలేగుంది ఈ వేళ
అహ...  భలేగుంది ఈ వేళ...


చరణం 1 :


చిలిపి వయసు కవ్వించే...  మనసు చిలికి మురిపించే
ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ..
చిలిపి వయసు కవ్వించే...  మనసు చిలికి మురిపించే

నీలి కన్నుల వాలులో...  సరదాలు పొంగే జోరులో
నీలి కన్నుల వాలులో...  సరదాలు పొంగే జోరులో...
సంబరాలతో సరాగాలతో సాగిపోదమా.. ఆ.. ఆ...

నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది...  ఈ వేళ
నీకెలాగుంది...  ఈ వేళ..


నాలో వెలిగే దీపం...  నీ చిరునవ్వు చిందే రూపం
నాలో వెలిగే దీపం...  నీ చిరునవ్వు చిందే రూపం
నీ కాంతిలో... ఈ శాంతిలో...  ఈ లోకమే స్వర్గము
నాలో వెలిగే దీపం...


చరణం 2 :
ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ.. 

నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత
ఆ.. ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఓ..
నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత

పాలబుగ్గలు మీటితే...  తొలి ప్రేమ మొగ్గలు వేసెనే
పాలబుగ్గలు మీటితే...  తొలి ప్రేమ మొగ్గలు వేసెనే
ఏల సిగ్గులే ఏమి నిగ్గులే...  మాకు తెలుసులేవే...

నిజం చెప్పవే పిల్లా ఎలాగుంది...  ఈ వేళ
నీకెలాగుంది...  ఈ వేళ..


రాగం భావం నీవే...  నా అనురాగ గీతం నీవే
రాగం భావం నీవే...  నా అనురాగ గీతం నీవే
నీ ప్రేమలో నే లీనమై...  జీవించుటే స్వర్గము
రాగం భావం నీవే... 



************ ***************** ****************** ****************

చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల 

పల్లవి :


ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు... 
ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు

చరణం 1 :


అడుగు అడుగున అపజయముతో... ఓ..ఓ..
అలసిసొలసిన నా హృదయానికి
సుధవై... సుధవై జీవనసుధవై ఉపశాంతివ్వగా ఓర్వనివారు 

ఎవరో జ్వాలను రగిలించారు...  వేరెవరో దానికి బలియైనారు


చరణం 2 :

అనురాగానికి ప్రతిరూపాలై...  ఆదిదంపతులవలె మీరుంటే
అనురాగానికి ప్రతిరూపాలై ఆదిదంపతులవలె మీరుంటే
ఆనందంతో మురిసానే... ఆత్మీయులుగా తలచానే 
అందుకు ఫలితం...  అపనిందేనా

ఎవరో జ్వాలను రగిలించారు...  వేరెవరో దానికి బలియైనారు

చరణం 3 :


మనిషికి మనిషికి మమత కూడదా…
మనసు తెలుసుకొను మనసే లేదా
ఇది తీరని శాపం... ఇది మారని లోకం
మానవుడే దానవుడై... మసలే చీకటి నరకం


ఎవరో జ్వాలను రగిలించారు... వేరెవరో దానికి బలియైనారు
వేరెవరో దానికి బలియైనారు... 
ఎవరో జ్వాలను రగిలించారు... 



************ ***************** ****************** ****************

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: శ్రీ శ్రీ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై

మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము

చరణం 1:

ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము

చరణం 2:

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము

చరణం 3:

చేలిమియే కరువై వలపే అరుదై... చేదరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచి.. తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము
మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము



************ ***************** ****************** ****************

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా...
నేనే ...పరవశించి పాడనా
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం 1:

నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే ఆ ఆ ఆ ఆ
నీవు పెంచిన హృదయమే ఇది నీవు నేర్పిన గానమే
నీకుగాక ఎవరికొరకు నీవు వింటే చాలు నాకు
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా

చరణం 2:

చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
ఆ పూవులన్ని మాటలై వినిపించు నీకు పాటలై
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా

చరణం 3:

ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఈ వీణ మ్రోగక ఆగినా నే పాడజాలకపోయినా
నీ మనసులో ఈనాడు నిండిన రాగమటులే ఉండనీ
అనురాగమటులే ఉండనీ
పాడమని నన్నడగ వలెనా పరవశించి పాడనా
నేనే పరవశించి పాడనా


************ ***************** ****************** ****************

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
కృష్ణా....
పదుగురెదుటా పాడనా

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

చరణం 1:

పొదల మాటున పొంచి పొంచి
ఎదను దోచిన వేణు గానము
పొదల మాటున పొంచి పొంచి
ఎదను దోచిన వేణు గానము
వొలకబోసిన రాగసుధకూ మొలకలెత్తిన లలితగీతి

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

చరణం 2:

చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
మెచ్చలేరే వెచ్చని హృదయాలపొంగిన మధురగీతి

చరణం 3:

ఎవరు లేనీ యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున
ఎవరూ లేనీ యమునాతటినీ ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై...
ఆ....
నేను నీవై నీవు నేనై
పరవశించే ప్రణయగీతి

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
కృష్ణా....
పదుగురెదుటా పాడనా


************ ***************** ****************** ****************

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..

చరణం 1:

జాజి పూలు నీకై.. రోజు రోజు పూచె
చూచి చూచి పాపం ... సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై .. తొంగి తొంగి చూచి
చందమామ నీకై తొంగి తొంగి చూచి.. సరసన లేవని అలుకలుబోయె

చరణం 2:

కలలనైన నిన్ను .. కనుల చూతమన్న
నిదుర రాని నాకు .. కలలు కూడా రా..వే
కదలలేని కాలం.. విరహ గీతి రీతి
కదలలేని కాలం విరహ గీతి రీతి.. పరువము వృధగా బరువుగ సాగే

చరణం 3:

తలపులన్ని నీకై.. తెరచి వుంచినాను
తలపులెన్నో మదిలో ..దాచి వేచినాను
తాపమింక నేను ... ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి.. తరుణిని.. కరుణను.. యెలగ రావా...


************ ***************** ****************** ****************

చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...

చరణం 1:

ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె ...
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక... ఆ... ఆ...ఆ...

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం

చరణం 2:

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ... ఓహొ... ఆ....
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక... ఆ...ఆ... ఆ...

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం

చరణం 3:

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే...
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... ఆ...ఆ... ఆ...


ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం

వారసత్వం (1964)

చిత్రం :  వారసత్వం (1964)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :

ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి వరించి చేరవే
తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం
ఫలింప చేయవే...
ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి...


చరణం 1 :

దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ
తారక సుధాకరా... తపించసాగినే

హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర...

చరణం 2 :

మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే

హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర...

చరణం 3 :

ఆ హాహాహ..... హాహాహ
ఆ హాహాహ.... హాహాహ

పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే
ఊహలో ఒయ్యారమో.. నా ఊహలో ఒయ్యారమో
ఉయ్యాలలూగెనే...

ప్రేయసి మనోహరి వరించి చేరవే
ప్రేయసి మనోహరి.....


*** ****************** *************** *************
చిత్రం :  వారసత్వం (1964)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  నార్ల చిరంజీవి
నేపధ్య గానం :  ఘంటసాల, లీల


పల్లవి :

చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి ..
జో జో... జో జో
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి


చరణం 1:

చెరసాలలో పుట్టి వ్రేపల్లెలో వెలసి
గొల్ల తల్లుల మనసు కొల్లగొనినాడు
ఏ తల్లి ఒడి జారి ఏలాగు చేరావొ
ఆపదలె కాపుదలలాయేనె నీకు

జో అచ్యుతానంద జోజో ముకుందా...
రార పరమానంద రామగోవిందా...
జో జో...

చరణం 2 :

పలు వేసములు పూని పగవారు హింసింప
పల్పోకడలు చూపె బాలగోపాలుడూ
ఈ ఈడుకే ఎన్ని గండాలు గడిచాయొ
ఎంత జాతకుడమ్మ అనిపించినావు

జో అచ్యుతానంద జోజో ముకుందా...
రార పరమానంద రామగోవిందా...
జో జో...

చరణం 3 :

కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి
కన్నవారికి చెరలు తొలగించినాడు
వసుదేవ తనయుని వారసత్వము నిలిపి
నీవారి వెతలెల్ల నీవె తీర్చేవు

చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
జో జో... జో జో
జో జో... జో జో
జో జో... జో జో

రాముడు-భీముడు (1964)

చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, మాధవపెద్ది  



పల్లవి :


తగునా ఇది మామా... తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా...
నిగమ మార్గములు తెలిసిన నీవే ఇటులనదగునా...
తగునా ఇది మామా

అల్లుడనగనెవడు...  మీ అమ్మాయికి మగడూ
అల్లుడనగనెవడు...  మీ అమ్మాయికి మగడూ
నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి

తగునా ఇది మామా... తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా


చరణం 1 :


ఫో.. ఫో... ర...  ఫొమ్మికన్....
ఫోఫోర ఫొమ్మికన్...  నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు...  రా తగదు...  ఛీ పో ఫో.. ఫో.. ర..  ఫొమ్మికన్
అరెరే ఎంతటి మోసగాడవుర...  నాకే టోపీ వేసినావుర
అరెరే ఎంతటి మోసగాడవుర...  నాకే టోపీ వేసినావుర

నీ సాహసము పరీహాసము...  నీ సాహసము పరీహాసము
నిర్భాగ్యుల తోటి సహవాసము
సహించను క్షమించను...  యోచించను నీ మాటన్
వచ్చిన బాటన్ పట్టుము...  వేగన్ ఫో.. ఫో... ర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు ఛీ ఫో ఫో



చరణం 2 :


కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే...
నీకు కొరివి బెట్టువాడనే
డైరెక్టుగ స్వర్గానికి చీటి నిచ్చువాడనే
తల్లి లేని పిల్ల ఉసురు తగలదె ఒంటిగ ఉంచగ 

తగునా ఇది మామా... తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా... 

చరణం 3 :


అరె...  ఊరికెల్ల మొనగాడినే
అరె...  ఊరికెల్ల మొనగాడినే... పెద్ద మిల్లు కెల్ల యజమానినే...
నీ డాబూసరి బలే బిత్తరి
నీ డాబూసరి బలే బిత్తరి...  నిజమేనని నమ్మితి పోకిరి
దురాత్ముడా...  దుష్టాత్ముడా...  గర్వాత్ముడా...  నీచుడా

ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్...  ఫో...ఫో... ర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో




************************ ****************************************


చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  మాధవపెద్ది , జమునా రాణి 



పల్లవి :


సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే...  స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కడుపు నిండునా కాలు నిండునా...  వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు



చరణం 1 :


 ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ...
మీసాలు కాల్చుకోవచ్చూ

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

చరణం 2 :

ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ

కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు


చరణం 3 :


 ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకుముక్కు ఎగరేస్తారు...
నీవెరుగవు దీని హుషారు
థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించినారందుకే...
కలెక్షన్లు లేవందుకే

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

చరణం 4 :

కవిత్వానికి సిగిరెట్టు...  కాఫీకే యిది తోబుట్టు.
పైత్యానికి యీ సిగిరెట్టు...  బడాయి క్రిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు...  ఆలోచనలను గిలకొట్టు
వాహ్...పనిలేకుంటే సిగిరెట్టూ...  తిని కూర్చుంటే పొగపట్టూ

రవ్వలు రాల్చే రాకెట్టూ...  రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ...  దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు



************************ ****************************************


చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల  


పల్లవి :

హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే..ఏ..ఏ..
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే...  తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ...


రమ్మనకు హోయ్ రమ్మనకు... ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ...  చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకు హొయ్ రమ్మనకు  


చరణం 1 :


చీకటి ముసిరే దెన్నడు నా చేతికి అందే దెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగే దెన్నడు నీ బుగ్గలు పిలిచే దెన్నడు
హోయ్ కదిలే కన్నులు మూసుకో
హోయ్ కదిలే కన్నులు మూసుకో
మదిలో మగువను చూసుకో

రమ్మనకు... హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు


చరణం 2 :


నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితి వెందుకు..
ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ
మొన్నటి కలలో మత్తుగా కను సన్నలు చేసితి వెందుకు
అంతకు మొన్నటి రాతిరీ
అంతకు మొన్నటి రాతిరీ... గిలిగింతలు మొదలైనందుకు... 

రమ్మనకు హోయ్ ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకు హొయ్ రమ్మనకు  



************************ ****************************************


చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  కొసరాజు 
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :

దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్.. సుఖాలు నీవేనోయ్
కష్టాలు తీరేనోయ్.. సుఖాలు నీవేనోయ్
దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్


చరణం 1 :


కొండలు కొట్టి.. కొట్టి
డ్యాములు కట్టీ.. కట్టి
నీళ్ళను మలిపి... మలిపి
చేలను తడిపి... తడిపి
కురిసే చక్కని రోజు మనకు వస్తుందోయ్… వస్తుంది

దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్


చరణం 2 :



కండల్ని కరగదీయి... బండల్ని విసరివెయ్యి ...  నీదేలె పైచేయి
కండల్ని కరగదీయి... బండల్ని విసరివెయ్యి ...  నీదేలె పైచేయి
భాగ్యాలు పండునోయి... వాకళ్ళు నిండునోయి
సిరులు చిందునోయి... ఆశలు అందునోయి
సిరులు చిందునోయి... ఆశలు అందునోయి
చేయి చేయి కలపాలి రావయా...  బావయ్యా
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్

చరణం 3 :

గ్రామాల బాగుచెయ్యి... దీపాల వెలుగునియ్యి ... జేజేలు నీకోయి …
గ్రామాల బాగుచెయ్యి... దీపాల వెలుగునియ్యి... జేజేలు నీకోయి …
చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు హలా హల
ఎందరో తమ రక్తాన్ని చిందించిరి హలా హల

ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే
త్యాగమంటె ఇదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే
ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే
అనుభవమ్ము నీదేనోయి...  ఆనందం నీదేనోయి
అనుభవమ్ము నీదేనోయి...  ఆనందం నీదేనోయి
నిజమౌ శ్రమజీవివంటే...  నీవెనోయ్ నీవోనోయ్

దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్... దేశమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్... దేశమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్… దేశమ్ము మారిందోయ్



************************ ****************************************


చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :

తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే 

చరణం 1 :

చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే.. చెలి చూపు నీ పైన నిలిచింది లే

ఏముందిలే .. ఇపుడేముందిలే
ఏముందిలే .. ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుంది లే.. నీ ముందుంది లే  
తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చరణం 2 :

వరహాల చిరునవ్వు కురిపించవా.. పరువాల రాగాలు పలికించవా
ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ....
వరహాల చిరునవ్వు కురిపించవా.. పరువాల రాగాలు పలికించవా

అవునందునా.. కాదందునా
అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల అనుకొందునా ..అనుకొందునా  
తెలిసిందిలే తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చరణం 3 :

సొగసైన కనులేమో నాకున్నవి.. చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి.. చురుకైన మనసేమో నీకున్నది

కనులేమిటో.. ఈ కథ ఏమిటో
కనులేమిటో ఈ కథ ఏమిటో
శృతి మించి రాగాన పడనున్నది.. పడుతున్నది

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ........ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే

************************ ****************************************


చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఆ..ఆ
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఉందిలే... 


చరణం 1 :

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
ఎందుకో.. సందేహమెందుకో.. రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఎందుకో.. సందేహమెందుకో.. రానున్న విందులో.. నీ వంతు అందుకో
ఆ రోజు అదిగో కలదూ నీ యెదుటా..ఆ...ఆ... నీవే రాజువట..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా
అందరూ సుఖపడాలి నందనందాన..ఉందిలే
ఏమిటేమిటేమిటే.. మంచి కాలం అంటున్నావ్?
ఎలాగుంటుందో ఇశితంగా చెప్పూ.. 

చరణం 2 :

దేశ సంపద పెరిగే రోజు.. మనిషి మనిషిగా బ్రతికే రోజు..
దేశ సంపద పెరిగే రోజు... మనిషి మనిషిగా బ్రతికే రోజు..
గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.. నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ..
ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో..ఓ..ఓ..అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో

భలే భలే..బాగా చెప్పావ్..
కాని.. అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు


చరణం 3 :

అందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ కలిసి
అందరి కోసం ఒక్కడు నిలిచి.. ఒక్కనికోసం అందరూ కలిసి
సహకారమే మన వైఖరియైతే.. ఉపకారమే మన ఊపిరి ఐతే..
పేదాగొప్పా భేదం పోయి అందరూ..ఊ..ఊ.. నీదినాదని వాదం మాని ఉందురూ..ఊ..
ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరంలేదోరన్నయ్యో..ఓ..ఓ.. అదిగో చూడు రేపేనేడు చిన్నయ్యో

ఆఆ..ఆఆఆ.ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా.. సుఖశాంతులూరగా...
ఆకాశవీధుల ఎదురేలేకుండా ..ఆ..ఆ...
ఎగురును మన జెండా..ఆ..ఆ

ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ..
అందరూ సుఖపడాలి నందనందాన..ఆ..
ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ..
అందరూ సుఖపడాలి నందనందానా..ఆ.. ఉందిలే..


************************ ****************************************


చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది
అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగుతున్నది

అదే అదే అదే......
అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా

అదే అదే అదే.. వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే అదే అదే.. వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది 

చరణం 1 :

నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి

ఏమేమి ఉన్నవి.. ఇంకేమి ఉన్నవి
ఏమేమి ఉన్నవి.. ఇంకేమి ఉన్నవి
ఈ వేళ నా పెదవులేల వణుకుతున్నవి

అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది

చరణం 2 :

నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
అహా హ హ అహా హ హా అహా హ హ
నీ చేయి తాకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను

ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయెను

అదే.. అదే.. అదే...
నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది
అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసులోన ఉన్నది
అదే.. అదే.. అదే...వింత నేను తెలుసుకున్నది

మురళీకృష్ణ (1964)

చిత్రం :  మురళీకృష్ణ (1964)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  జానకి  


పల్లవి :

 మ్రోగునా....  ఈ వీణ...
మ్రోగునా ఈ వీణ... మ్రోగునా ఈ వీణ
మూగవోయిన రాగహీనా...  అనురాగహీనా

మ్రోగునా ఈ వీణ... మూగవోయిన రాగహీనా అనురాగహీనా
మ్రోగునా ఈ వీణ... మూగవోయిన రాగహీనా అనురాగహీనా
మ్రోగునా ఈ వీణ


చరణం 1 :


పాటలెన్నో నేర్చినది... ప్రభువు రాకకై వేచినది
పాటలెన్నో నేర్చినది... ప్రభువు రాకకై వేచినది

వచ్చిన ప్రభువు... విని మెచ్చకనే...
వెడలిపోయేను... బ్రతుకే... వెలితి చేసెను..
బ్రతుకే... వెలితి చేసెను..

మ్రోగునా మధుర వీణ


చరణం 2 :


ఆదిలోనే అపశ్రుతి పలికెను...  నాదమంతా ఖేదమాయెను
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆదిలోనే అపశ్రుతి పలికెను...  నాదమంతా ఖేదమాయెను

స్వరములు ఏడు సముద్రాలై...
స్వరములు ఏడు సముద్రాలై
ముంచి వేసెను... తంత్రులు త్రెంచి వేసెను
తంత్రులు త్రెంచి వేసెను

మ్రోగునా మధుర వీణ


చరణం 3 :


దేవుడులేని కోవెలలా... జీవితమంతా శిథిలము కాగా
దేవుడులేని కోవెలలా... జీవితమంతా శిథిలము కాగా

ప్రభువు నడిచే అడుగుజాడలె... వెతుకుచుంటిని శూన్యంలో
ప్రభువు నడిచే అడుగుజాడలె... వెతుకుచుంటిని శూన్యంలో
వెతుకుచుంటిని శూన్యంలో... శూన్యంలో... 


మ్రోగునా మధుర వీణ... మూగవోయిన రాగహీనా... అనురాగహీనా
మ్రోగునా మధుర వీణ... 




************ *************** ***************


చిత్రం :  మురళీకృష్ణ (1964)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :


ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
విరిసిన పువ్వులు ముసిముసి నవ్వులు...  కసిగా ఎందుకు కవ్విస్తున్నవి

ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది


చరణం 1 :


ఏదో ఏదో వినపడుతున్నది... ఎదలో ఏదో కదులుతున్నది
ఏదో ఏదో వినపడుతున్నది... ఎదలో ఏదో కదులుతున్నది
తీయని తలపులు తలలెత్తి... తెలియని హాయిని వెదకుతున్నది


ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది


చరణం 2 :


మెరమెరలాడే వయసున్నది... అది బిరబిర చరచర పరుగెడుతున్నది
మెరమెరలాడే వయసున్నది...  బిరబిర చరచర పరుగెడుతున్నది
మిసమిసలాడే సొగసున్నది...  అది గుసగుసలెన్నో చెబుతూ వున్నది

ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది


చరణం 3 :


ఆడమన్నది పాడమన్నది.... ఓ...ఓ...ఓ...
ఆనందానికి ఎరవేయమన్నది
ఊరించే నను ఉడికించి....  ఒంటరితనము ఓపనన్నది
ఒంటరి తనము ఓపనన్నది


ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది
ఏమని ఏమని అనుకుంటున్నది... నీ మనసేమని కలగంటున్నది



************ *************** ***************


చిత్రం :  మురళీకృష్ణ (1964)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల

పల్లవి :

వస్తాడమ్మా నీ దైవమూ.. వస్తుందమ్మా వసంతమూ
వస్తాడమ్మా నీ దైవమూ.. వస్తుందమ్మా వసంతమూ
కలలే నిజమై వలపే వరమై
కళ కళ లాడును జీవితము
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ

చరణం 1 :

పేరే కాదు ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు
పేరే కాదు ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు
తన ముద్దుల మురళిగ నిను మార్చి
తన ముద్దుల మురళిగ నిను మార్చి
మోహనరాగం ఆలపించును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ

చరణం 2 :

పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును
పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును
నీ మనసే మందిరముగ చేసీ.. ఈ ...
నీ మనసే మందిరముగ చేసి దైవం తానై వరములిచ్చును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ

చరణం 3 :

ఎక్కడివాడో ఇక్కడి వాడై దక్కినాడు నీ తపసు ఫలించి
ఎక్కడివాడో ఇక్కడి వాడై దక్కినాడు నీ తపసు ఫలించి
నాడొక చెట్టును మోడు చేసినా ఆ వాడే మోడుకు చిగురు పూర్చును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ



************ *************** ***************


చిత్రం :  మురళీకృష్ణ (1964)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :

కనులు కనులు కలిసెను...  కన్నె వయసు పిలిచెను
కనులు కనులు కలిసెను... కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 
అసలు మనసు తెలిసెను

చరణం 1 :

ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము
ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము
సిగ్గు చేత ఎర్రబడిన బుగ్గలదీ అందము
కోరిన చిన్న దాని కోర చూపే అందము కోర చూపే అందము

కనులు కనులు... మనసు తెలిసెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 
అసలు మనసు తెలిసెను

చరణం 2 :

దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
ముచ్చటైన పైటకొంగు ముడులు వేయుటెందుకు
పోవాలనుకొన్నా పోలేవు ముందుకు.. పోలేవు ముందుకు

కనులు కనులు... మనసు తెలిసెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 
అసలు మనసు తెలిసెను

చరణం 3 :

నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
కసురుతున్న మనసులోనే మిసిమి వలపులూరును
కలిగిన కోపమంత కౌగిలిలో తీరును కౌగిలిలో తీరును

కనులు కనులు... మనసు తెలిసెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను... 
అసలు మనసు తెలిసెను...


************ *************** ***************


చిత్రం :  మురళీకృష్ణ (1964)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి :

ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

చరణం 1 :

అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని

నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..

చరణం 2 :

పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను.....
గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు

నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..

వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే రుజువు కదా

నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..

చరణం 3 :

నీ కలలే కమ్మగ పండనీ... నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..


************ *************** ***************


చిత్రం :  మురళీకృష్ణ (1964)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి :

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
నా వలపంతా నీదని.. నీదేనని.. ఊఁ అనూ

ఊఁ అను.. ఊహూ అను..  ఔనను ఔనౌనను
నా వెలుగంతా నీవని.. నీవేనని.. ఊఁ అనూ

చరణం 1:

కలకల నవ్వే కలువకన్నులు..
కలకల నవ్వే కలువకన్నులు..
వలపులు తెలుపుటకే కాదా
పక్కన నిలిచిన చక్కని రూపము
చక్కిలిగింతలకే కాదా
చక్కిలిగింతలకే కాదా

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను

చరణం 2:

పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా
అహహా అహహా అహహా ఆ... ఆ... ఆ...
పచ్చని ఆశలపందిరి నీడల వెచ్చగ కాపురముందామా
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా..
ఆఁ...
ఆఁ... కమ్మని కలలే కందామా

ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను

చరణం 3 :

మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
ఓ... ఓ... ఓ... ఓ...
మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే
ఊఁ...
ఊఁ... జీవితమంటే మనదేలే

ఊఁ అను.. ఊహూ అను
ఔనను.. ఔనౌనను
నా వలపంతా నీదని..
నా వెలుగంతా నీవని..
ఊఁ అను.. ఊహూ అను
ఔనను.. ఔనౌనను
ఊఁ అనూ... హహహహ

మంచిమనిషి (1964)

చిత్రం:  మంచిమనిషి (1964)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతిరావు
గీతరచయిత:  దాశరథి 
నేపధ్య గానం:  పి. బి. శ్రీనివాస్ 


పల్లవి :


ఓ గులాబీ... ఓ గులాబీ
వలపు తోటలో విరిసిన దానా..
లేత నవ్వులా  వెన్నెల సోనా..


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా 
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో 


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 



చరణం 1 :


కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
మోసం చేసీ మీసం దువ్వే మోసకారులకు లోంగేవూ... లోంగేవూ..



ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా..



చరణం 2 :



రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రేకులుచిదిమీ... సొగసులు నునిమీ..
చివరకు ద్రోహం చేస్తారు... చివరకు ద్రోహం చేస్తారు


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా 
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో 
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 

********************* ********************
చిత్రం:  మంచిమనిషి (1964)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతిరావు
గీతరచయిత:  కొసరాజు
నేపధ్య గానం:  ఘంటసాల


పల్లవి:

ఏమండి... ఏమండోయ్...
ఏమండి... ఇటు చూడండి
ఒక్కసారి ఇటు చూశారంటే... మీ సొమ్మేది పోదండి
ఏమండి... ఇటు చూడండి... ఏమండోయ్...

చరణం 1:

సిగలోన దాగిన మల్లెమొగ్గకు... బిగువెందుకో చెప్పాలండి
వరసైన వన్నెల రామచిల్కకు... పొగరు కాస్త తగ్గాలండి
మన స్నేహం మోమాటం... పొడిమాటలతోనే పోదండి

ఏమండి... ఇటు చూడండి...
ఒక్కసారి ఇటు చూశారంటే... మీ సొమ్మేది పోదండి...
ఏమండోయ్...

చరణం 2:

మనసంత మాపై ఉందిలేండి... తెలుసు లేండి మీ తాపం
మొగమంత కన్నులు చేయకండి... దాచుకొండి మీ కోపం

మనసంత మాపై ఉందిలేండి... తెలుసు లేండి మీ తాపం
మొగమంత కన్నులు చేయకండి... దాచుకొండి మీ కోపం
వగలెందుకు... సెగలెందుకు... ఈ సారికి ఏదో పోనీండి

ఏమండి... ఇటు చూడండి... ఏమండోయ్...

చరణం 3:

మిము నమ్ముకున్న నేస్తగాడు... మీ వెంటనె ఉన్నాడండి
ఏనాటికి ముమ్మాటికి... తన మనసే మీదన్నాడండి
కవ్వించక కథపెంచక... అవునంటే అంతే చాలండి

ఏమండి ఇటు చూడండి... ఒక్కసారి ఇటు చూశారంటే
మీ సొమ్మేది పోదండి... ఏమండోయ్

************************** *************************

అంతగా నను చూడకు
చిత్రం:  మంచిమనిషి (1964)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత:  సినారె
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:

అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు

చరణం 1:

చలిచలి గాలులు వీచెను... సన్నని మంటలు లేచెను..
అహహా.. ఆ.. ఆ..ఆ
చలిచలి గాలులు వీచెను... సన్నని మంటలు లేచెను
తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెను

అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్... అంతగా నను చూడకు

చరణం 2:

జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
అహహా.. ఆ.. ఆ..ఆ
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను … పదునౌ చూపులు బాధించెను

హోయ్ అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు.. వేటాడకు
హోయ్.. అంతగా నను చూడకు

చరణం 3:

వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ ..
అహహా.. ఆ.. ఆ..ఆ
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ .. పువ్వుల సంకెల బిగించనీ ..

హోయ్... అంతగా నను చూడకు .. ష్ .. మాటాడకు..
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు