Labels
శ్రీ కృష్ణ పాండవీయం(1966)
ఉమ్మడి కుటుంబం(1967)
ఉమ్మడి కుటుంబం (20-04-1967)
మన దేశంలో ఆర్యుల కాలం నుండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఆనవాయితీ. పురాణాల్లో రామ లక్ష్మణులు, ఇతిహాసాల్లో పంచ పాండవులు అన్నదమ్ముల అన్యోన్యానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు. సమాజం పురోగమించాలంటే ఉమ్మడికుటుంబాల్లో సహజీవనం, సహకారం మెండుగా ఉండాలి. ఈర్ష్యాద్వేషాలు లేకుండా కలసి మెలసి మెలగాలి. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు మొదలైన రోజుల్లో నందమూరి తారక రామారావు (ఎన్ టి ఆర్) నాటకీయతను జోడిస్తూ తన రామ కృష్ణ ఎన్ ఏ టి కంబైన్స్ సొంత సంస్థ తరపున "ఉమ్మడి కుటుంబం" పేరుతో సినిమా నిర్మించారు. తోడు దొంగలు సినిమా నిర్మించిన 13 ఏళ్ళ విరామం తర్వాత ఎన్ టి ఆర్ యోగానంద్ దర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం ఇది.
ఉమ్మడి కుటుంబము నుండి విడిపోయి వేరు కాపురం పెట్టి అందులో వైభోగం ఉందనుకునే వెర్రితనానికి, ఉమ్మడి కుటుంబంలో ఉంటూ అందులో చాటుగా డబ్బును మూటలు కట్టుకునే కోడళ్ళకు ఈ సినిమా ఒక గుణ పాఠం. అంతే కాదు. అంతస్థులనుబట్టి అల్లుళ్ళను ఆదరించే అత్తగార్లకు , ఇంట అలిగి అత్తగారి ఇళ్ళకు చేరుకొనే అల్లుళ్ళకు, చెప్పుడు మాటలకు, తప్పుడు నడతలకు చెంప పెట్టుగా తీర్చిదిద్దిన సినిమా ఉమ్మడి కుటుంబం. ఈ సినిమా 1967 ఏప్రిల్ 20 న విడుదలై, 15 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుని, విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకంగా 197 రోజులు ప్రదర్శితమై రజతోత్సవం జరుపుకుంది. ఆ చిత్ర విశేషాలు:-
ఎన్ టి ఆర్ ది ఒక విశిష్టమైన గ్రాఫ్. నటుడిగా పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చలనచిత్ర విభాగాల్లో అత్యధిక సినిమాలలో నటించిన ఘనత ఎన్ టి ఆర్ ది. 1953 లో పిచ్చి పుల్లయ్య సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టి 1993 లో శ్రీనాధ కవి సార్వభౌమ వరకూ తమ్ముడు త్రివిక్రమరావు, తనయుడు హరి కృష్ణ నిర్మాణ సారధ్యంలో 28 చిత్రాలు నిర్మించడం ఎన్ టి ఆర్ కే సాధ్యం అయింది. ఒకవైపు నటుడిగా రాణిస్తూ 18 చిత్రాలకు దర్శకత్వ భాధ్యతలు నిర్వహించిన ఘనతకూడా ఎన్ టి ఆర్ దే.
ఆయన నటించిన 302 చిత్రాలలో 152 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి. 1950 - 1984 మధ్యన ఎన్ టి ఆర్ నటించిన చలన చిత్రాలలో 39 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి. 197 రోజులాడిన ఉమ్మడికుటుంబం సినిమా కూడా ఆ కోవలోకి చెందినదే.
అది ఒక చిన్న ఊరు. అందులో గడుసుమిల్లివారి ఉమ్మడి కుటుంబం ఉంటోంది. తల్లి (హేమలత) సంరక్షణలో నలుగురు కొడుకులు ఉంటున్నారు.
పెద్దవాడు నాగయ్య (రేలంగి) పొరుగూరిలో గుమస్తా ఉద్యోగం చేస్తూ కుటుంబ భారం మోస్తున్నాడు. అతని భార్య గౌరి (సూర్యాకాంతం) కి ఒక కొడుకు కిట్టూ (రాజ్య లక్ష్మి). భర్త సంపాదనంతా ఉమ్మడి కుటుంబానికే ఖర్చు అయిపోతోందని ఆమె ఆవేదన.
రెండవవాడు చంద్రం (సత్యనారాయణ) ఉన్న రెండెకరాలు పండిస్తూ కుటుంబానికి కొమ్ము కాస్తున్నాడు. అతని భార్య కాంతం (ఎస్ వర లక్ష్మి). పిల్లలు లేరు కనుక వళ్ళు వంచి పని చేయాల్సిన అవసరమేముందని తలచే మనస్థత్వం కలది.
మూడవ వాడు ముకుందం (ప్రభాకర రెడ్డి). అత్తవారు ఇచ్చిన కట్నం డబ్బులతో డాక్టరీ పూర్తి చేశాడు. కుటుంబ ఆశలన్నీ అతనిమీదే. అతని భార్య రమ (సావిత్రి). అత్తగారికి చేదోడువాదోడుగా ఇంటి పనిలో సాయం చేస్తూ ఉంటుంది.
ఇక ఆఖరివాడు రాముడు (ఎన్ టి ఆర్) పనీ పాటు లేకుండా తిరుగుతున్నాడు. అయితే రాముకి వదిన రమ అంటే గౌరవం. కిట్టు అంతే ప్రాణం.
సంక్రాంతి పండగ రోజు కాంతం చేసిన గొడవతోను, భార్య రమ సంసార పక్షపు పద్ధతులు నచ్చకపోవడంతోను ముకుందం పట్నం వెళ్ళిపోయాడు.
నాగయ్య అప్పులు తీర్చలేక భూమి కౌలుకు ఇచ్చి వ్యవసాయం తీసేసాడు.
పట్నం వెళ్ళిన ముకుందం మోహిని (ఎల్ విజయ లక్ష్మి) అనే విలాసిని వలలో పడి పైసా కూడా ఇంటికి పంపకుండా ఇంటినే మరచిపోయాడు.
తోడి కోడళ్ళ మధ్య సయోధ్య కుదరక చంద్రం భార్య కాంతం పుట్టింటికి పయనమయ్యింది. చంద్రం కూడా ఆమె వెంటే నడిచాడు.
ఇల్లు గడవటం కష్టమైపోయింది. నాగయ్య భార్య గౌరి ఉమ్మడి ఇంటిని తడికలు పెట్టి వేరు చేసింది.
వదిన రమను అన్న ముకుందానికి అప్పగించాలని రాము మద్రాసు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ రాముడికి శారద (కృష్ణ కుమారి) అనే ఒక జమీందారు (నాగభూషణం) గారి అమ్మాయితో పరిచయమయ్యింది. రాముడి ఇంటి పరిస్థితి, అన్న ముకుందం మోహిని వలలో చిక్కుకోవడం తెలుసుకుంది. మోహినికి బుద్ధి చెప్పి, ముకుందానికి కళ్ళు తెర్పించేందుకు రాముడిని నవ నాగరీకుడిగా తీర్చిదిద్ది అతడిని ఒక జమీందారులా భ్రమింపచేసేలా తయారుచేసి మోహినివద్దకు పంపింది. రాముడు మోహినిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి, ముకుందానికి ఆమె మీద విరక్తి కలిగేలా చేశాడు.
పల్లెటూరులో రమ ఒంటరిగా ఉండడంతో పశుపతి (అల్లు రామలింగయ్య) ఆమెను బలాత్కరించబోయాడు. అవమానం భరించలేక ఆమె ఆత్మ హత్యకు పూనుకుంటే అత్త సముదాయించి, ఆమెను ముకుందానికి అప్పగించేందుకు మద్రాసు బయలుదేరింది.
అత్తవారిల్లు చేరిన చంద్రానికి అవమానం జరిగింది.
రాముడు, శారద కలిసి పరిస్థితులు చక్కదిద్ది, ముకుందాన్ని రమను కలిపారు. విడిపోయిన ఉమ్మడి కుటుంబాన్ని ఒక తాటిమీదకు తెచ్చారు. రాముడు శారదలకు వివాహం జరపడంతో శుభం కార్డు పడింది.
ఇతర ముఖ్య పాత్రలలో ముక్కామల, రాజబాబు, వాణిశ్రీ, చాయాదేవి నటించారు.
సినిమాకు కధ, స్క్రీన్ ప్లే ఎన్ టి ఆర్ సమకూర్చగా, సముద్రాల జూనియర్ సంభాషణలు , రవికాంత్ నగాయిచ్ చాయాగ్రహణం భాద్యతలు నిర్వహించారు. ఎన్ టి ఆర్ కు సన్నిహిత మిత్రుడు యోగానంద్ దర్శకత్వం నిర్వహించారు.
ఎన్ ఏ టి ఆస్థాన సంగీత దర్శకులు టీ వీ రాజు గారు ఉమ్మడి కుటుంబం చిత్రానికి సంగీతం నిర్వహించగా, విజయా కృష్ణ మూర్తి సహకారం అందించారు.
ఈ సినిమాలో రెండు అంతర్నాటకాలు ఉన్నాయి.
మొదటిది సతీ సావిత్రి. క్షీరాబ్ది పై తేలు శ్రీ హరి పానుపు అనే సీస పద్యం తో ప్రారంభమయే ఈ నాటకంలో యముడు (ఎన్ టి ఆర్) కు పద్యాలు ఘంటసాల , సావిత్రిగా నటించిన వాణిశ్రీ కి పద్యాలు కనకం ఆలపించగా మాటలు ఎవరికి వారే చెప్పుకున్నారు. రాజబాబు సత్యవంతుడిగా కనిపిస్తాడు.
https://www.youtube.com/watch?v=SglK0nVAqg0
ఇక రెండవ నాటకం లంకా దహనం. ఇందులో ఎన్ టి ఆర్ రావణుడిగా, వాణిశ్రీ సీతగా , ఆంజనేయుడి పాత్రను రాజబాబు పోషిం చారు.
https://www.youtube.com/watch?v=WG6I043J9qs
కొసరాజు రాసిన తస్సాదియ్యా తమాషైన బండి పాటను ఎన్ టి ఆర్, కృష్ణ కుమారిలపై చిత్రీకరించారు. ఈ పాట మధ్యలో వచ్చే మాటలను ఎన్ టి ఆర్ పలకడం విశేషం.
https://www.youtube.com/watch?v=ku7hlJ6HfEM
ఘంటసాల , పి.సుశీల ఆలపించిన భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి
భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి
గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా
గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా
పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి
గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా
గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా
సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే
సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే
ఎవరి మనసు చెదిరేనో ఎన్ని కళ్ళు బెదిరేనో
ఎన్ని కళ్ళు బెదిరిన గాని నిన్ను విరిగి పూయనుగాని
ఉక్కు తునకలే నా మనసు ఒక్క నీకే అదితెలుసు
కొండ మీద కోతిని కొత్త వరస అటాడించి
పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో
పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో
కొండ మీద కోతిని పట్టి కోరిన నీ ముందర పెట్టి
గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా
గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా
భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి
గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా
గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా
పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి
https://www.youtube.com/watch?v=hsYsc4w7jgw
ఘంటసాల, సుశీల యుగళ గీతం చెప్పాలని ఉంది దేవతయే దిగి వచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది
రచన : సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
చెప్పాలని ఉంది..
చెప్పాలని ఉంది..దేవతయే దిగివచ్చి
మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది
కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కథ.. చెప్పాలని ఉంది
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో
నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే...
నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే..
ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు
ఆ ..ఆ..ఆ..ఆ..ఆ
https://www.youtube.com/watch?v=nEsieFqB8N0
సి నా రె రాసిన మరో పాట హలో మై డియర్ హలో ను ఎన్ టి ఆర్ విజయ లక్ష్మి లపై చిత్రీకరించారు.
https://www.youtube.com/watch?v=h3eItDpxYQw
ఘంటసాల పాడిన చేతికి చిక్కావే పిట్టా, నువు చచ్చినా నిన్ను ఒదిలి పెట్ట పాటలో కూడా ఎన్ టి ఆర్ గళం కలిపారు.
https://www.youtube.com/watch?v=h2P_rIB6nO0
ఇక టైటిల్ సాంగ్ కుటుంబం, చల్లని హృదయాలకు చక్కని ప్రతి బింబం ఘంటసాల, లీల పాడారు.
ఈ సినిమాలో అన్ని పాటలూ జన రంజకమైనవే.
మరి కొన్ని విశేషాలు:-
నట రత్న నట జీవితం లో పెన వేసుకు పోయిన సినిమా ప్రదర్శన శాల విజయవాడలోని దుర్గా కళా మందిరం. 1949 లో ఎన్ టి ఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం నుండి 1993 లో ఎన్ టి ఆర్ నటించిన ఆఖరి చిత్రం శ్రీనాధ కవి సార్వభౌముడి వరకూ 63 చిత్రాలు ఈ హాలులోనే ప్రదర్శితమయ్యాయి. అలాంటి దుర్గా కళా మందిరం లో ఎన్ టి ఆర్ నిర్మించిన ఉమ్మడి కుటుంబం సినిమా 197 రోజులాడింది. ఈ సినిమాకు ముందు ఎన్ టి ఆర్ నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయం 113 రోజులు, ఈ సినిమా తర్వాత నిర్మించిన వర కట్నం 100 రోజులు ఈ హాలులోనే ఆడడం విశేషం. ఈ సినిమా హాలులో ఎన్ టి ఆర్ సినిమాలు 31 చిత్రాలు శతదినోత్సవం, 9 చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి.
సొంత బ్యానర్ పై పుష్కర కాలం తరవాత నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబం. 1955 జయ సిం హ తర్వాత ఎన్ టి ఆర్ వరుసగా పాండు రంగ మహాత్మ్యం, సీతా రామ కల్యాణం, గులేబకావళి కధ, శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలు నిర్మించారు. వీటి తర్వాత నిర్మించిన సాంఘిక చిత్రం ఉమ్మడి కుటుంబమే.
ఎన్ టి ఆర్ నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య (1953) లో నటించిన 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఎన్ టి ఆర్ పక్కన కృష్ణ కుమారి నాయకిగా నటించారు.
ఎన్ టి ఆర్ కు జోడీ గా అనేక చిత్రాలలో నటించిన సావిత్రి, ఉమ్మడి కుటుంబం లో వదినగా నటించారు.
బభ్రువాహన 1964 , సత్య హరిశ్చంద్ర 1965 లో ఎన్ టి ఆర్ కు కధానాయికగా నటించిన ఎస్ వర లక్ష్మి ఉమ్మడి కుటుంబం లో క్యారెక్టర్ నటిగా చేశారు.
మంచి మనసులు లో విలన్ గా నటించిన నాగభూషణం ఎస్ వి ఆర్ వంటి నటుడు పోషించవలసిన పాత్రను పోషించడం ఎన్ టి ఆర్ సమయోచిత నిర్ణయానికి ప్రతీక.
అలాగే విలన్ పాత్రలకు పరిమితమైన సత్యనారాయణలోని కరుణ రసంతో కూడిన అద్భుత నటనకు అవకాశమిచ్చి, అతడిని నవరస నటనా సార్వభౌముడిగా మలచిన చిత్రం ఉమ్మడి కుటుంబం.
మహానాయకుడు (2019)
రాము(1968)
కథానాయకుడు (1969)
కధానాయకుడు (27-02-1969)
1969 లో 52 సినిమాలు విడుదలయ్యాయి. ఎన్ టి ఆర్ 11 సినిమాలలో నటించారు . వర కట్నం, కధా నాయకుడు, భలే మాస్టారు, గండికోట రహస్యం, విచిత్ర కుటుంబం, కదలడు వదలడు, నిండు హృదయాలు, భలే తమ్ముడు , అగ్గి వీరుడు, మాతృదేవత, ఏక వీర.
అక్కినేని నటించిన 8 సినిమాలు అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆదర్శ కుటుంబం, ఆత్మీయులు, భలే రంగడు, బుద్దిమంతుడు, సిపాయి చిన్నయ్య,
ఇతరులు నటించిన 33 సినిమాలు శ్రీ రామ కధ, మంచి మిత్రులు, దేవుడిచ్చిన భరత, లవ్ ఇన్ ఆంధ్రా, సప్త స్వరాలు, భలే అబ్బాయిలు, బంగారు పంజరం, బొమ్మలు చెప్పిన కధ, చిరంజీవి, అర్ధ రాత్రి, మహా బలుడు, శబాష్ సత్యం, ఆస్థులు అంతస్థులు, టక్కరి దొంగ చక్కని చుక్క, ముహూర్త బలం, సత్తెకాలపు సత్తెయ్య, మామకు తగ్గ కోడలు, జరిగిన కధ, జగత్ కిలాడీలు, పంచ కల్యాణి దొంగల రాణి, నాటకాలరాయడు, రాజ సింహ, అన్నదమ్ములు, ప్రేమ కానుక, ఉక్కు పిడుగు, మనుషులు మారాలి, ధర్మ పత్ని, కన్నుల పండగ, తారా శశాంకం, కర్పూర హారతి, ప్రతీకారం, గండర గండడు, బంధిపోటు భీమన్న 1969 లో విడుదలయ్యాయి.
రాజకీయాలు, ప్రజాసమస్యలు ప్రధాన నేపథ్యంగా రూపొందిన 'కథానాయకుడు' (27-02-1969) సూపర్ హిట్ అయి, తరువాత ఆ తరహా చిత్రాల రూపకల్పనకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కధానాయకుడు సినిమా 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రజతోత్సవం కూడా జరుపుకుంది. నిర్మాతలకు ఒక రూపాయ పెట్టుబడికి 9 రూపాయల లాభం తెచ్చిమిది. ఆ ఏటి సూపర్ హిట్ సినిమాగా నిలచింది.
వర కట్నం (10-01-1969) , విచిత్ర కుటుంబం (28-05-1969) , నిండు హృదయాలు (15-08-1969) , మాతృదేవత (07-11-1969) , అదృష్టవంతులు, మూగనోము, బంధిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి శత దినోత్సవాలు జరుపుకున్నాయి.
"గండికోట రహస్యం (01-05-1969) , మహ్మద్ రఫీ తొలిసారి తెలుగులో అన్ని పాటలూ పాడిన 'భలే తమ్ముడు' (18-09-1969), జగత్ కిలాడీలు, మహాబలుడు చిత్రాలు యావరేజ్ గా నడిచాయి.
విశ్వనాధ సత్యనారాయణ గారి నవల ఏకవీర (04-12-1969) మ్యూజికల్ హిట్ గా నిలచింది. భలే మాస్టారు (27-03-1969), కదలడు వదలడు (09-07-1969), అగ్గి వీరుడు (17-10-1969), ఆదర్శ కుటుంబం, భలే రంగడు, సిపాయి చిన్నయ్య, నిరాశ పరిచాయి.
జెమినీ వారి 'మనుషులు మారాలి' చిత్రం సంచలన విజయం సాధించి, శారదకు విషాద పాత్రల నాయికగా మంచి పేరు సంపాదించిపెట్టింది, శోభన్బాబు పాత్ర చిన్నదే అయినా ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.
27-02-1969 న విడుదలైన కధానాయకుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా విశేషాలు:-
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని భూస్వామి కొడాలి గోపాలకృష్ణ. తమ అభిమాన హీరో యన్టి రామారావు హీరోగా, జయలలిత హీరోయిన్గా 1969లో వీరు నిర్మించిన చిత్రం -కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన బృంద గానంలోని ఓ స్టిల్ను తమ బ్యానర్ లోగోగా రూపొందించి ‘గోపాలకృష్ణ ప్రొడక్షన్స్’పై చిత్రాన్ని నిర్మించారు. తరువాత ‘దీర్ఘసుమంగళి’ (1974లో) నిర్మించారు. 23 ఆగస్టు, 1978లో గోపాలకృష్ణ పరమపదించారు. ‘కథానాయకుడు’ చిత్రంతో ‘బంగారు నంది పురస్కారం’ పొందిన నిర్మాత కావటం విశేషం. వీరి అల్లుడు వి బాలకృష్ణరావు ‘ఉషా పిక్చర్స్’ ద్వారా ప్రముఖ చిత్ర పంపిణీదారుగా ఖ్యాతి గడిస్తున్నారు. 27 ఫిబ్రవరి 1969న కథానాయకుడు చిత్రం విడుదలైంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కె ప్రత్యగాత్మ సోదరుడైన ప్రముఖ దర్శకుడు కె హేమాంబరధరరావు కథానాయకుడు చిత్రానికి దర్శకత్వం వహించారు.
కథ: ముళ్ళపూడి వెంకటరమణ
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
సంగీతం: టివి రాజు
కళ: బిఎస్ కృష్ణ
నృత్యం: తంగప్ప
స్టంట్స్: శ్యామ్సుందర్
కెమెరా: విఎస్ఆర్ స్వామి
నిర్మాత: కె గోపాలకృష్ణ
దర్శకత్వం: హేమాంబరధరరావు
సినిమా ఆరంభంలో ఒక చిన్న టౌన్ లో ప్రజలు కొంతమంది స్వార్ధపరులైన పెద్దమనుషుల చేతిలో ఎలా దోపిడీ కి గురి కాబడుతున్నారో చూపిస్తారు. ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరావు), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు.
దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (ధూళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (ఎన్ టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించుటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
కధానాయకుడు సారధిగా ఎన్ టి ఆర్ , కధానాయకి జయగా జయలలిత ఎంతో విశిష్టంగా నటించారు. వీరిద్దరూ అద్భుత నటనా ప్రావీణ్యంతో తాము ఉన్న ప్రతి సన్నివేశానికి వన్నె చేకూర్చారనడంలో అతిశయోక్తి లేదు.
దయానందంగా నాగభూషణం, సత్య మూర్తిగా మిక్కిలినేని, అప్పడు దొరగా అల్లు రామలింగయ్య చక్కగా నటించారు.
చిత్రంలో సారథి స్నేహితుడు సింహగా పద్మనాభం, అతని భార్య రమగా రమాప్రభ, ఆమె తల్లిదండ్రులుగా రాధాకుమారి, రావి కొండలరావు, పక్కింటి ఇల్లరికపు అల్లుడు పులి రాజుగా రాజ్బాబు, సుందరిగా పద్మ లక్ష్మి, సుందరి తల్లిగా జూనియర్ భానుమతి సమకూర్చిన హాస్యం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
చలపతి మాస్టారుగా నాగయ్య, సారధి అన్న శ్రీనివాసరావుగా ధూళిపాళ, కాకారావుగా కాకరాల, జయ అన్నగా ప్రభాకర రెడ్డి, అతని స్నేహితుడిగా ఆదుర్తి నరసిం హ మూర్తి, కోటీశ్వరుడిగా ముక్కామల, సారధి వదినగా టి జి కమలా దేవి, ఆమె పిల్లలుగా బేబీ పద్మిని, బేబీ మల్లిక , మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగిగా చలపతిరావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.
యువ దర్శకుడు శ్రీ కె హేమాంబరధర రావు ఈ చిత్రంతో అగ్ర శ్రేణి దర్శకుల జాబితాలో చేరారు. సన్నివేశాలను ఎంతో భావయుక్తంగా, పట్టుతో అర్ధవంతంగా రూపొందించి కథను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత దయానందం, తరువాత సత్యమూర్తి, అప్పడు వరుసగా తమ చేతికర్రలతో ధర్మారావు వద్దకు వచ్చి, అతని మెడకు కర్రలతో బంధం వేసి అంతం చేయటం, బ్యాక్గ్రౌండ్లో సంఘంలో న్యాయం, ధర్మం, నీతి లక్షణాలను లెక్కచేయని వారి గురించి చెప్పించటం ఆసక్తికరం అనిపిస్తుంది. తిరిగి కైమాక్స్లో సారథిని అదేవిధంగా అంతం చేయాలని ముగ్గురూ కర్రలు బిగించగా, హీరో వాటిని ఛేదించి ముక్కలు చేసే సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇక ఈ ముగ్గురు దుర్మార్గులున్న ఇంటి మెట్లమీది సన్నివేశంలో.. 10నెలల జీతం కోసం ఉపాధ్యాయుడు చలపతి దీనంగా అర్థిస్తూ ‘ఆకలితో మావాళ్లు అలమటిస్తున్నారని చెప్పే సందర్భంలో -అల్లు రామలింగయ్య (మంచింగ్) తినటం, గొంతులార్చుకుపోతున్నాయనగా మిక్కిలినేని మందు తాగడం, మెట్లకింద వున్న నాగయ్యను గెంటి వేయించటం, వారు రోడ్డుమీద ఆకలితో నీరసంతో తూలటం, మరోచోట నాగభూషణం మందు తాగిన మత్తుతో తూలటం సమాంతరంగా చూపి విశ్లేషించటం దర్శకుని ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది.
హాస్పిటల్లో డాక్టరు స్టాకులేదని మందివ్వక అతని మరణానికి కారణం కావటం, ఆ మెట్లముందు సారధి వార్నింగ్ ఒకసారి, మరోసారి చైర్మెన్ పదవి పోయిన సారథిని మెట్లమీంచి దిగుతూ దుర్మార్గ బృందం అతనిపై విస్కీ పోయటం, హేళన చేసి కొట్టిపడవేయటం వంటి సన్నివేశాలు కథలో పట్టును పెంచాయి.
మార్పు స్వభావం తెలిసిన శ్రీనివాసరావు జనతా స్కీమ్ క్రింద పేదవారివద్ద వసూలు చేసిన సొమ్ము దాచటం, అతన్ని బంధించి ఈ దుష్టులు హింసించటం, క్లైమాక్స్లో డబ్బుకోసం త్రవ్వకంలో మిక్కిలినేని, అల్లు రామలింగయ్యకు పాము, గబ్బిలాలు, తేళ్లు రావటం, అక్కడ దుష్టులతో హీరో పోరాటం ఎంతో ఉత్సుకత, సాహసం ఉట్టిపడేలా చిత్రీకరించారు. నీతి, నిజాయితీ లక్షణాలు సామాన్యుల్లోనూ ఉంటాయని జయ పాత్ర ద్వారా చెబితే, తాగుబోతు నాగులు కూడా చెల్లెలికోసం మారటం ద్వారా మరింత బలంగా చూపించటం ఎన్నదగిన అంశం.
ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకట రమణ సమకూర్చిన కధలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సంఘటనలు, పాత్రపోషణ సహజత్వానికి దగ్గరగా నిర్ధుష్టంగా ఉంటాయి.
శ్రీ భమిడిపాటి రాధా కృష్ణ సంభాషణలు ఎంతో భావస్పూర్తితో వెల్లివిరుస్తూ చిత్రానికి నిండుతనాన్ని తెచ్చాయి.
లోగడ ‘పెద్దమనుషులు’, ‘దేశద్రోహులు’ వంటి పలు చిత్రాల్లోని అంశాలకు మరింత రంజుగా కథను సమకూర్చుకొని ముళ్ళపూడివారు, దానికి తగ్గ నిత్యసత్యాల్లాంటి సంభాషణల్ని (విలన్లు సారథితో- మాలాంటి వాళ్లు ఈ దేశంలో లక్షలమంది వున్నారు, వుంటారు. నీలాంటివాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.. మీవల్ల దేశంలో, మనుషుల్లో మార్పు రాదు) సమకూర్చి భమిడిపాటి రాధాకృష్ణ, దర్శకుల రూపకల్పనకు జోడిగా మహానటుడు యన్టిఆర్ సన్నివేశాలకు తగిన సంయమనంతో కూడిన ముచ్చటైన అభినయం, తోటి నటీనటుల సహకారం చిత్రాన్ని విజయపథంవైపు నడిపించింది.
చిత్రంలో హీరో హీరోయిన్లపై ఒక్కటైనా యుగళగీతం, కనీసం కలలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క యుగళ గీతమైనా ఉంటే బావుంటుందేమోనని హీరో యన్టిఆర్ సూచించినపుడు, ఈ కథకు అది నప్పదు అని దర్శకులు హేమాంబరధరరావు చెప్పారు. దానిని ఎన్ టి ఆర్ ఎంతో హృద్యంగా అంగీకరించటం గొప్ప విశేషం.
అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించటం కోసం విజయావారు, ఏవిఎం వారు, ఎంజి రామచంద్రన్ కోరటం, దానికి ఎన్ టి ఆర్ ఆ వ్యవహారాలన్నీ దర్శకులు, నిర్మాతల అభిష్టానికే వదిలివేయటం జరిగింది.
శ్రీ వి ఎస్ ఆర్ స్వామి కెమెరా, బి ఎన్ కృష్ణ కళ, తంగప్ప నృత్యాలు, వాసు ఎడిటింగ్ చిత్రానికి ఒక సముచిత స్థాయిని చేకూర్చాయి.
ఇంతేనయా తెలుసుకోవయ్యా పాటలో వి ఎస్ ఆర్ స్వామి కెమెరా ప్రతిభ గూర్చి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.
చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే గోరంత దీపం వెలిగించినవాడే ఉత్తముడు. సంఘంలోని వివిధ రంగాల్లో విశృంఖల విహారం చేస్తున్న అవినీతిని, మోసాన్ని తిట్టుకుంటూ కూర్చోవడంకంటే వాటిని ఎదుర్కోవడానికి చేసిన ఏ చిన్న ప్రయత్నం జరిగినా హర్షించదగినదే. సమాజంలోని దుష్ట శక్తులను నిర్మూలించి మనిషి మనుగడను సార్ధకం చేయడానికి ప్రతి ఒక్కచోటా ఒక కధానాయకుడు ఉద్భవించాలి అని చాటి చెప్పే గొప్ప సాంఘిక చిత్రం గోపాల కృష్ణ ప్రొడక్షన్స్ వారి "కధా నాయకుడు".
ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించగల ఇంత చక్కని చిత్రాన్ని నిర్మించిన కె గోపాల కృష్ణ ఎంతో అభివందనీయులు. ఉత్తమ అభిరుచులు, ఉన్నతమైన ఆశయాలు గల ఈ యువ నిర్మాత అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందారు.
కధానాయకుడు సినిమా రాజకీయ ట్రెండ్ సెట్టర్ గా మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో సంచలనాలు సృష్టించి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. 1969 లో సూపర్ డూపర్ హిట్ గా ఆ సంవత్సరానికి నెంబర్ వన్ గా నిలచింది. నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపమైన సారధి పాత్రలో ఎన్ టి ఆర్ నటన ఎవ్వరూ అందుకోలేని అందలాలకు చేరుకుంది. సన్నివేశపరంగా ఈ చిత్రాన్ని వర్ణించడం అసాధ్యం. యూ ట్యూబ్ లో కాకుండా మంచి ప్రింట్ లో చూడవలసిన సినిమా. ఈ టీ వీ సినిమాలో అప్పుడప్పుడు వేస్తుంటారు.
శ్రీ దాశరధి 3 పాటలు, శ్రీ కొసరాజు 4 పాటలూ రాశారు. పాటలు అన్నీ ఆకర్షణీయంగా వుంటాయి. శ్రీ టీ వీ రాజు కూర్చిన సంగీతం చిత్రానికి గొప్ప ఆకర్షణ అని చెప్పవచ్చు.
హీరో లక్షణాలను, కథను విశ్లేషిస్తూ ఆకట్టుకునేలా వాద్యంతో, బృంద నృత్యంతో, ఎన్ టి ఆర్- జయలలితలపై చిత్రీకరించిన గీతం -వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్య’ (గానం: పి సుశీల, ఘంటసాల బృందం, రచన: కొసరాజు).
https://www.youtube.com/watch?v=t9gnfp5fdxs
జయలలితపై చిత్రీకరించిన గీతం , పళ్ళండి పళ్ళండి పళ్ళు, జామ పళ్ళు, కొసరాజు, ఎల్ ఆర్ ఈశ్వరి
https://www.youtube.com/watch?v=GnqDyspt4v0
అద్దంలో హీరో తాను వలచిన అమ్మాయిగా జయను చూపించగా ఆనందంతో జయలలితచే నృత్య గీతం -ముత్యాల జల్లుకురిసే రతనాల’ (దాశరథి, సుశీల ). ఈ చిత్రంలో హిట్ సాంగ్లో ఒకటిగా ఇది నిలిచింది.
https://www.youtube.com/watch?v=jonlDR4dDwE
మంచివాడు మా బాబాయి, దాశరధి, సుశీల, బెంగలూరు లత
https://www.youtube.com/watch?v=6WuIkIdcv8g
ఎన్ టి రామారావు, జయలలిత నృత్య కళాకారులతో నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ముక్కామల హావభావాలను చూపుతూ చిత్రీకరించిన (ప్రత్యేకించి రంగుల్లో) గీతం -ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం’ (గానం: ఘంటసాల బృందం, రచన: దాశరథి).
https://www.youtube.com/watch?v=FDPjX0u75Gs
రాజ బాబు , పద్మనాభంలపై చిత్రీకరించిన గీతం -రావేలా దయరాదా రావా ఇంటికి (గానం: పిఠాపురం, మాధవపెద్ది, రచన: దాశరథి). ఈ చిత్రంలోని మరో హిట్సాంగ్.
https://www.youtube.com/watch?v=Zcur0kv8vIM
జయలలిత, నాగభూషణంలపై ఇంట్లో ఆరుబయట వెన్నెల్లో చిత్రీకరిస్తే, జయలలిత రకరకాల స్టెప్స్, అలరించే నృత్యంతో వెరైటీగా సాగే గీతం -వయసు మళ్లిన బుల్లోడా (గానం: పి సుశీల, రచన: దాశరథి).
https://www.youtube.com/watch?v=jqsTZuvnIqY
‘కథానాయకుడు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. 9 కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. 1969 సంవత్సరానికి సూపర్ హిట్ సినిమాగా నిలచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ పురస్కారంతో సత్కరించింది.
ఆడ బ్రతుకు(1965)
విజేత విక్రమ్ (1987)
భారతంలో అర్జునుడు (1987)
బ్లఫ్ మాస్టర్ (2018)
తాయారమ్మ బంగారయ్య (1979)
జాను (2020)
ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా
త్రుటిలో కరిగే కలవే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ...
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
అనగనగా... అంటూనే ఉంటా
ఎపుడూ పూర్తవనే అవక
తుధి లేని కథ నేనుగా
గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా
ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా
నా వెంట పడి నువ్వింత ఒంటరి
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా విన్నారా
నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఉయాలలూపింది జొలాలి
చిత్రం: జాను (2020)
సంగీతం: గోవింద్ వసంత
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రదీప్ కుమార్
ఇల్లాలు
ఎల్వీ ప్రసాద్ ద్విభాషా చిత్రం ‘ఇల్లాలు’🌹
‘‘నవ్విన ఊళ్లే పట్నాలవుతాయన్న నానుడి నీరసించిపోతున్నప్పుడల్లా ఎవరో ఒక ప్రజ్ఞాశాలి వచ్చి, దాన్ని ఆదుకొని, ఆ మాట నిలబెట్టి ‘ఇది ఉట్టి సామెతే’నని నిస్పృహ చెందేవారికి ధైర్యం చెబుతూ వుంటాడు. అటువంటి ‘దర్శకులపతి’ ఎల్వీప్రసాద్’’ అని అరవై దశకంలోనే ముళ్లపూడి వెంకటరమణ చెప్పారు. ఆయన జీవితాన్ని తరచి చూసిన వారికి ఎల్వీ ప్రసాద్ ప్రతిభేమిటో అర్థమవుతుంది’ ‘‘నేను కంటి ఆసుపత్రి ఎందుకు పెట్టానో తెలుసా? ప్రజలకు కళ్లు బాగా వుండి, ఎక్కువ సినిమాలు చూడాలని’’ అంటూ చమత్కరించిన ప్రసాద్ ఒక మంచి నటుడు, నిర్మాత, దర్శకుడు, అన్నిటికీ మించి గొప్ప దార్శనికుడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘మనోహర’ (1954), ‘మిస్సమ్మ’ (1955) సినిమాలు చాలు ఆయన ప్రతిభ చాటేందుకు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి నిర్మాతగా తన తొలి తెలుగు సినిమా ‘ఇల్లాలు’ను సమాంతరంగా తమిళంలో ‘ఇధయ కమలం’గా నిర్మించి విజయం సాధించిన ‘‘దొడ్డ’’ మనిషి ఎల్వీప్రసాద్. ‘ఇల్లాలు’ సినిమా 29, అక్టోబర్ 1965న విడుదలైంది. ఆ సినిమా విశేషాలు కొన్ని పాఠకుల కోసం...
‘ఇల్లాలు’ నేపథ్యం..
భారతీయ తొలి టాకీ చిత్రం ‘ఆలం ఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ ‘కాళీదాసు’ సినిమాలన్నిటిలోనూ నటించిన ఘనత తెలుగు ఎల్వీ ప్రసాద్‌కే దక్కుతుంది. హెచ్.యం.రెడ్డి సలహాపై మద్రాసు వచ్చిన ఎల్వీప్రసాద్ అటు సినిమాల్లో నటిస్తూ, ఇటు దర్శకత్వ ప్రతిభను ప్రదర్శిస్తూ అంచెలంచలుగా ఎదిగారు. ఆయన నిర్మాతగా మారి 1955లో లక్ష్మీ పిక్చర్స్ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి యోగానంద్ దర్శకత్వంలో ‘ఇలవేలుపు’ సినిమాను నిర్మించి విజయం సాధించారు. ఆ తర్వాత 1956లో ‘ప్రసాద్ పొడక్షన్స్’ సంస్థను నెలకొల్పి హిందీలో ‘శారద’, ‘చోటి బెహన్’, ‘బేటి బేటే’ చిత్రాలకు దర్శక-నిర్మాతగా, ‘ససురాల్’, ‘హమ్ రాహి’ సినిమాలకు నిర్మాతగా, తెలుగులో ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పుకూడు’ వంటి చిత్రాలకు, తమిళంలో ‘భాగ్యవతి’ ‘ఇరువర్ ఉళ్లం’ వంటి మరెన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. 1965లో ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాతగా ‘ఇల్లాలు’ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాతగానే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహిస్తూ సిద్ధహస్తుడైన ఎడిటర్‌గా పేరుతెచ్చుకున్న తన తమ్ముడు అక్కినేని సంజీవరావు (సంజీవి)కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. సంజీవికి దర్శకునిగా ఇదే మొదటి చిత్రం. ఇక సినిమా కథ విషయానికి వస్తే... 1964లో రాజా పరాంజపే దర్శకత్వంలో ‘పాఠలాగ్’ పేరుగో ఒక మరాఠీ సినిమా వచ్చింది. కాశీనాథ్ ఘనేకర్ పేరుతో ఒక మరాఠీ సినిమా వచ్చింది. కాశీనాథ్ ఘనేకర్, భావన అందులో నాయకానాయికలు. దత్తా దవజేకర్ సంగీత దర్శకత్వం నిర్వహించిన ఈ మరాఠీ చిత్రానికి జయంత్ దాహ్లె కథను సమకూర్చారు. ‘పాఠలాగ్’ సినిమా బాగా ఆడటమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి, మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తమచిత్ర బహుమతి కూడా అందుకుంది. అదే సినిమా కథను స్ఫూర్తిగా తీసుకొని ముళ్లపూడి వెంకటరమణ చేత కథ, మాటలు రాయించి ‘ఇల్లాలు’ పేరుతో ఎల్వీప్రసాద్ సినిమాగా తీశారు.
వి‘చిత్ర’ కథ..
ప్రేమించుకుని పెళ్లాడిన వేణుగోపాలరావు (కె.వి.నాగేశ్వరరావు), రాధారాణి (గీతాంజలి)లది అనుకూల దాంపత్యం. వేణుగోపాలరావుకు ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకునే అవకాశం వస్తుంది. ఒక సంవత్సరం ఎడబాటు భరిస్తే తన భర్తకు న్యాయవాదిగా మంచి పేరుప్రతిష్టలు వస్తాయని రాధారాణి భర్తను ప్రోత్సహించి ఇంగ్లాండుకు పంపుతుంది. భార్యకు జబ్బుచేసి ప్రాణాపాయ స్థితిలో ఉందని వేణుగోపాలరావుకు టెలిగ్రాం రాగానే అతడు విదేశాల నుండి తిరిగి వస్తాడు. అతని చేతులలోనే భార్య మరణిస్తుంది. అంత్యక్రియలన్నీ అతడే స్వయంగా జరిపిస్తాడు. ఆ వూరి శివార్లలో స్థావరం ఏర్పరచుకున్న బందిపోటు ముఠానాయకుడు సింగన్న (సి.హెచ్.కృష్ణమూర్తి)ను పట్టుకోవటానికి పోలీసులు దాడిచేస్తాడు. సింగన్న గాయపడి తప్పించుకుంటాడు. అతని భార్య సుధారాణి (గీతాంజలి) పోలీసులకు పట్టుబడుతుంది. ఎన్నో దోపిడీలకు, హత్యలకు ఆమెను కారకురాలుగా భావించిన పోలీసులకు తను దొంగరాణిని కాననీ, తనపేరు రాధారాణి అనీ, లాయరు వేణుగోపాలరావు ‘‘ఇల్లాలు’’ననీ వాంగ్మూలం ఇస్తుంది. వేణుగోపాలరావు ఇంటి ఆనవాళ్లు, కుటుంబం గురించి ఎన్నో వివరాలు పూసగుచ్చినట్లు చెబుతుంది. ఆమె రూపురేఖలు అచ్చుగుద్దినట్లు రాధారాణివిలాగే వుంటాయి. సమస్య కోర్టు పరిధిలోకి వస్తుంది. కోర్టులో తన మొదటి సాక్షిగా వేణుగోపాలరావునే ఎంచుకుంటుంది. భర్త నడము మీద పుట్టుమచ్చతో సహా ఎన్నో దాంపత్య రహస్యాలను దొంగలరాణిగా పిలువబడే సుధారణి కోర్టుకు వెల్లడిస్తుంది. అయితే వేణుగోపాలరావు మాత్రం ఆమె తన భార్య కాదని వాదిస్తాడు. చివరికి ఆమెకు మతి భ్రమించిందని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. భర్తతో ఏకాంతంగా మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొంది ఆమె భర్త ఇంటికి వెళ్తుంది. చనిపోయినది తన సోదరి సుధారాణి అని, తామిద్దరమూ కవలపిల్లలమని చెప్పి దాఖాలాలు చూపిస్తుంది. దురదుదృష్టవశాత్తు తన భార్య దోపిడీ ముఠాకు దొరికిందని వేణుగోపాలరావు గ్రహిస్తాడు. రాధారాణి పోలీసులకు పట్టుబడినప్పటి నుంచి ఆమెను మారువేషంలో వెన్నంటి వస్తున్న సింగన్న, చనిపోయింది తన భార్య సుధారాణి అని గ్రహించి, పశ్చాత్తాపపడి, పోలీసులకు లొంగిపోతాడు. కోర్టులో రాధారాణిని భార్యగా స్వీకరించడంతో సినిమా ముగుస్తుంది. సహయక పాత్రలలో న్యాయమూర్తిగా ధూళిపాళ్ల, ప్రభుత్వ వకీలుగా ప్రభాకర్‌రెడ్డి, పోలీసు అధికారిగా రామకృష్ణ, గుమాస్తాగా అల్లు రామలింగయ్య, ఇంటి నౌకరుగా చదలవాడ కుటుంబరావు నటించగా చలం, రామన్న పంతులు హాస్యాన్ని పండించారు.
చిత్ర విశేషాలు..
‘ఇల్లాలు’ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకే బ్యానర్ మీద ఎల్వీప్రసాద్ నిర్మించారు. అయితే తెలుగులో నిర్మించిన చిత్రంలో కొన్ని ప్రయోగాలు చేశారు. మొదటిది సినిమా దర్శకుని నియామకం. అక్కినేని సంజీవరావు ఎల్వీ ప్రసాద్‌కు స్వయానా తమ్ముడు. ఎన్నో తమిళ, తెలుగు ఒరియా చిత్రాలకు సమర్ధవంతమైన ఎడిటర్‌గా పనిచేసిన ప్రతిభావంతుడు. ‘‘సంజీవి’’గా పిలిపించుకునే సంజీవరావు ఎంతటి ప్రజ్ఞావంతుడంటే, సినిమాలకు సబ్-టైటిళ్లు వేసే పరికరం మన దేశంలోకి రాని కాలంలోనే సొంత ప్రతిభతో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందకు, సాక్షి వంటి తెలుగు సినిమాలకు సబ్-టైటిళ్లు జోడించి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలకు పంపిన ప్రయోగశాలి. ఈ సంజీవి కుమారుడే పదిహేను భాషల్లో సినిమాలకు ఎడిగింగ్ చేసిన వ్యక్తిగా ‘లిమ్కా’ రికార్డులకెక్కి అనేక జాతీయ పురస్కారాలను అందుకున్న శ్రీకర ప్రసాద్. ఇక హీరో విషయానికొస్తే, స్ఫురద్రూపి అయిన కర్రి వెంకట నాగేశ్వరరావు (కె.వి. నాగేశ్వరరావు) అనే నూతన నటుణ్ని ఎంపిక చేశారు. ఇతడు ఖరగ్‌పూర్ రైల్వే లోకోషెడ్‌లో చార్జ్‌మన్‌గా పనిచేస్తూ ఎన్నో నాటకాల్లో నటించాడు. తొలి చిత్రంలోనే గంభీరమైన పాత్రను పోషించి ఆకర్షించుకోగలిగాడు. అప్పటి వరకు అనేక సినిమాల్లో నర్తకిగా, వ్యాంప్‌గా నటించిన గీతాంజలికి హీరోయిన్ పాత్రను కట్టబెట్టడం కూడా ఒక సాహసమని చెప్పాలి. అది కూడా ద్విపాత్రాభినయంలో, ఇక బందిపోటు విలన్‌గా విశేష నాటకానుభావం, చక్కని వాచికం వున్న సి.హెచ్. కృష్ణమూర్తిని ఎంపిక చేసుకున్నారు. సంజీవి కథను నడిపించిన తీరు వైవిధ్యంగా ఉంటుంది. సగం కథ ప్రత్యక్షంగాను, మిగతా భాగం ‘ప్లాష్- బ్యాక్’లోను నడుస్తుంది. ప్లాష్-బ్యాక్ కథను విడదీసి సమన్వయ పరచుకుంటూ వీక్షించే అవకాశం ప్రేక్షకుడికి కలిగింది. ముళ్లపూడి మాటలు సరళంగా ఉండి కథనాన్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లేందుకు ఉపకరించాయి. అవుట్ డోర్ దృశ్యాలను నైనిటాల్‌లో చిత్రీకరరించారు. ఒక రకంగా చెప్పాలంటే పాత-కొత్తల మేలు కలయికతో ‘తేనెమనసులు’ సినిమాను మరపిస్తూ సంజీవి ఈ సినిమాను మలచారని చెప్పవచ్చు. ‘ఇల్లాలు’ సినిమాను సమాంతరంగా తమిళంలో నిర్మించిన ‘ఇధయ కమలం’ సినిమాకు శ్రీకాంత్ దర్శకుడు కాగా సంగీత దర్శకత్వం రెండు వెర్షన్లలో కె.వి.మహదేవన్ నిర్వహించారు. ‘కాదలిక్క నేరమిల్లై’లో శ్రీధర్ హీరోగా పరిచయం చేసిన రవిచంద్రన్, ‘కర్పగం’లో కె.యస్.గోపాలకృష్ణన్ పరిచయం చేసిన కె.ఆర్.విజయ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇదే చిత్ర కథను హిందీ చిత్ర నిర్మాత ప్రేమ్ జీ, రాజఖోస్లా దర్శకత్వంలో ‘మేరాసాయా’ (1966) పేరుతో సినిమాగా నిర్మించారు. సునీల్‌దత్, సాధన నటించిన ఈ సినిమా సిల్వర్ జూబిలీ జరుపుకోవడమే కాకుండా, 1966 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. సహాయక పాత్రల్లో కె.యన్.సింగ్, అన్వర్‌హుస్సేన్, ప్రేమ్ చోప్రా నటించారు. తమిళ, హిందీ భాషల్లో రికార్డులు సృష్టించిన ‘ఇల్లాలు’ సినిమా తెలుగులో డెభ్బై రోజులకు పైగానే ఆడింది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే రవిచంద్రన్ ఇందులో నటించిన షీలాను పెళ్లి చేసుకున్నాడు. సంజీవి తదనంతరం కాలంలో మంచి దర్శకుడుగా ‘అత్తగారు- కొత్త కోడలు’, ‘నాటకాల రాయుడు’, ‘అక్కా- చెల్లెలు’, ‘ధర్మదాత’, ‘సిసింద్రీ చిట్టి బాబు’ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు.
తకతక తాళం తట్టిన పాటలు..
‘ఇల్లాలు’, సినిమాకు శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు పాటలు రాయగా, ‘ఇధయ కమలం’కు కణ్ణదాసన్ రాశారు. రెంటికీ సంగీత దర్శకుడు మహదేవన్. హిందీ సినిమా ‘మేరా సాయా’కు రాజా మెహదీ ఆలీఖాన్ పాటలు రాయగా మదన్ మోహన్ సంగీతం సమకూర్చారు. శ్రీశ్రీ రాయగా సుశీల ఆలపించిన ‘‘నీవు నా ఊహలందే నిలిచావు నేను నీ కళ్లలోనే వెలిశాను... వేయిజన్మాలకైనా విడలేనూ... నీ ఇల్లాలుగా నేనుంటాను’’ అనే టైటిల్ గీతాన్ని మహదేవన్ పహాడ్ రాగంలో స్వరపరచారు. సినిమా కథనంతా పాటలోనే అల్లడం శ్రీశ్రీ గొప్పతనం. జానకి పాడిన జనరంజమైన కొసరాజు హుషారు పాట ‘‘తకతకతక తాళం దట్టు మామా నీ దరువులు కలపవయా’’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆత్రేయ కలం విదిలించిన ‘‘నువుపోయిన చోటే నేనూ వున్నా పోపోపో’’ పాటను పి.బి. శ్రీనివాస్, సుశీల పాడారు. మరో ఆత్రేయ పాట ‘‘మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగెరా... నల్లనయ్యా మేలుకో చల్లనయ్యా మేలుకో’’ని సుశీల ఆలపించారు. మరో అద్భుత యుగళగీతం ఫక్తు ఆత్రేయ మార్కు పాట ‘‘అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే... నువ్వంటే నువ్వే నీవంటిది నువ్వే నువ్వే’’ పి.బి. శ్రీనివాస్, సుశీల గళంలో అద్భుతంగా అమరింది. ‘‘మనసునేదో కవ్విస్తూంది తలచుకుంటే నవ్వొస్తూంది’’ కూడా మంచి పాటే. చివరి మాట... హిందీలో రజతోత్సవాన్ని, తమిళంలో శతదినోత్సవాన్ని జరుపుకొని మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ఇల్లాలు’ సినిమా బహుశా కొత్త నటులు కావడంతో తెలుగులో డెభ్బై రోజులకు మించి ఆడలేకపోయిందనుకోవాలి.
- ఆచారం షణ్ముఖాచారి








