దేవతలారా.. దీవించండి (1977)



చిత్రం : దేవతలారా.. దీవించండి (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :

ఓ చెలి... నీకోసమే నా గానము...
నవ వసంత సుందరి.. ప్రణయరాగ మంజరి


ఓ సఖా... నీకోసమే నా ప్రాణము
మలయపవన రాగమా... వలపు గగన మేఘమా


చరణం 1 :


మోహమే రాగమై.. కోరికే తాళమై
మోహమే రాగమై.. కోరికే తాళమై

నాలోని భావాలు నీ రూపమై...
నీలోని నాదాలు నా గీతమై
కలిసేము నిలిచేము నవకావ్యమై
ఇలలోన వెలిగేము సంగీతమై... సంగీతమై

ఓ చెలి... నీకోసమే నా ప్రాణము...
నవ వసంత సుందరి.. మలయపవన రాగమా 

చరణం 2 :

ఊహలే ఊయలై...  ఆశలే అందమై
ఊహలే ఊయలై...  ఆశలే అందమై

అధరాలు నయనాలు జతకూడగా
సరదాలు సరసాలు చవి చూడగా

విను వీధి మన ప్రేమ సెలయేరుగా...
విహరించ దిశలన్నీ దీవించగా.. దీవించగా

ఓ చెలి... ఓ సఖా
నీకోసమే... నీకోసమే
నా గానము... నా ప్రాణము
నవ వసంత సుందరి.. మలయపవన రాగమా

No comments:

Post a Comment