అందమే ఆనందం (1977)

చిత్రం : అందమే ఆనందం (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు

పల్లవి :

మధుమాసవేళలో మరుమల్లె తోటలో...
మధుమాసవేళలో మరుమల్లె తోటలో...
మనసైన చిన్నదీ.... లేదేలనో

మధుమాసవేళలో మరుమల్లె తోటలో...

చరణం 1 :

ఆడి౦ది పూల కొమ్మా... పాడి౦ది కోయిలమ్మా...
అనురాగ మ౦దిర౦లో..ఒ..ఒ..కనరాదు పైడిబొమ్మ..ఆ..ఆ...
ప్రణయాలు పొ౦గే వేళ..ఆ..ఆ.ఆ...ప్రణయాలు పొ౦గే వేళ...
నాలో రగిలే ఏదో జ్వాలా...


మధుమాసవేళలో మరుమల్లె తోటలో...


చరణం 2 :

ఉదయి౦చే భానుబి౦బ౦... వికసి౦చలేదు కమల౦..
నెలరాజు రాక కోస౦... వేచి౦ది కన్నె కుముదం...
వలచి౦ది వేదనకేనా..ఆ..ఆ..వలచి౦ది వే్దనకేనా...
జీవితమ౦తా దూరాలేనా...


మధుమాసవేళలో మరుమల్లె తోటలో...
మనసైన చిన్నదీ.... లేదేలనో...
మధుమాసవేళలో మరుమల్లె తోటలో....
ఉహ్..ఆ..మరుమల్లె తోటలో...
అహ..హ..ఆ..మరుమల్లె తోటలో...

************** ***************** ********
చిత్రం: అందమే ఆనందం (1977) 
సంగీతం: సత్యం 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి : 

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. 
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ 

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. 
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ 

బిడియం మానేసి నడుమున చెయ్ వేసి 
బిడియం మానేసి నడుమున చెయ్ వేసి 
అడుగు అడుగు కలపాలని ఉంది..ఈ..ఈ 

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. 
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ.. 

అహ..హా...ల..లా.. 

చరణం 1 : 

నాలోన మ్రోగే ఈ వేళలోనా... నీ లేత పరువాల వీణా 
ఈనాడు కురిసే నీ కళ్ళలోనా... అనురాగ కిరణాల వానా 
తలపుల తెర తీసి.. వలపులు కలబోసి..ఈ..ఈ 
తలపుల తెర తీసి.. వలపులు కలబోసి... 
ఒదిగి ఒదిగి ఉండాలని ఉంది.....ఈ..ఈ.. 

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ 
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ 
బొమ్మలు మానేసి.. రంగులు చిమ్మేసి 
బొమ్మలు మానేసి.. రంగులు చిమ్మేసి 
కనుబొమ్మలు కలపాలని ఉందీ ..ఈ..ఈ 

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ.. 
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ 


చరణం 2 : 

మాటాడు బొమ్మ.. మనసున్న బొమ్మ.. నీ ముందు నిలిచింది చూడు 
మురిపాలు కోరి.. అలవోలే చేరి.. నీ చెంప మీటింది నేడు 
కలవరమేలేదా? కదలిక యే లేదా? 
కలవరమేలేదా? కదలిక యే లేదా? 
కలిసి ఊసులాడాలని ఉందీ...ఈ..ఈ.. 

ఇదే ఇదే నేను కోరుకుంది..ఈ..ఈ 
ఇలా ఇలా చూడాలని ఉంది..ఈ..ఈ 

చరణం 3: 

ఎన్నెన్ని విరులో ఈ పాన్పు పైన మన రాకకై వేచెనేమో 
ఎన్నెన్ని మరులో ఈ రేయిలోనా మనకోసమే వేచెనేమో 

మనసులు శృతి చేసి.. తనువులు జత చేసి.. 
మనసులు శృతి చేసి.. తనువులు జత చేసి.. 
పగలు రేయి కలపాలని ఉందీ..ఈ..ఈ.. 

ఇదే ఇదే నేను కోరుకుంది...ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ...ఈ 
ఇదే ఇదే నేను కోరుకుంది...ఇలా ఇలా చూడాలని ఉందీ..ఈ..ఈ


No comments:

Post a Comment