చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
చెరసాల పాలైనావా...
చెరసాల పాలైనావా
ఓ సంబరాల రాంబాబూ... చెరసాల పాలైనావా
చరణం 1 :
అనుకున్నది నీవొకటి... అయినది మరి వేరొకటి
అనుకున్నది నీవొకటి... అయినది మరి వేరొకటి
ముందు చూపు లేదాయె... మాయని అపవాదాయె
చెరసాల పాలైనావా...
చరణం 2 :
పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని
పరువే తన పెన్నిధిగా బ్రతికే నీ సోదరిని
పూలమ్మిన చోటనే కట్టెలమ్మగా జేసి
పూలమ్మిన చోటనే కట్టెలమ్మగా జేసి
నిలువ నీడ పోద్రోసి నడివీధుల పాల్చేసి
చెరసాల పాలైనావా... ఓ సంబరాల రాంబాబూ...
చెరసాల పాలైనావా...
చరణం 3 :
నిన్ను గని... మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని
నిన్ను గని... మెచ్చుకొని నీకే మనసిచ్చుకొని
ఎన్నెన్నో కలలుగనే...
ఎన్నెన్నో కలలుగనే....
చిన్నదాని జీవితము చీకటిగా జేసి
చెరసాల పాలైనావా... ఓ సంబరాల రాంబాబూ
చెరసాల పాలైనావా...
చరణం 4 :
ఫలి యిమ్మని ఆశించిన ఫక్కుమనే నొక పలువ
పైసలాశ జూపించి ఓర జూచునొక ఉలువ
పని చూపి పరువు మాపి... పైటలాగు నొక చెలటి
అండలేని ఆడదాని కాదరణే కరువా... ఆదరణే కరువా
చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : జిక్కి
పల్లవి :
అందచందాల సొగసరి వాడు
అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో... చందమామా
చందమామా ఓహో... చందమామా
ఓ.... ఓ... ఓ....
చరణం 1 :
ఓ...ఓ...ఓ...
చూడ చూడంగ మనసగు వాడు
ఈడు జోడైన వలపులరేడు
ఓ..వాడు నీకన్న సోకైన వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో... చందమామా
చందమామా ఓహో... చందమామా
ఓ....ఓ....ఓ....
చరణం 2 :
ఓ....ఓ....ఓ....
వాని కన్నుల్లో వెన్నెల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
ఓ..వాడు నీకన్న చల్లని వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో... చందమామా
చందమామా ఓహో... చందమామా
ఓ....ఓ....ఓ....
చరణం 3 :
ఓ....ఓ....ఓ....
మేటి పోటిల్లో గడుసరి వాడు
మాటపాటించు మగసిరి వాడు
ఓ..వాడు నీకన్న సిరిగలవాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో... చందమామా
చందమామా ఓహో... చందమామా
అందచందాల...
అందచందాల సొగసరి వాడు
అందచందాల సొగసరి వాడు
విందు భోంచేయ వస్తాడు నేడు
చందమామా ఓహో... చందమామా
చందమామా ఓహో... చందమామా
చిత్రం: దొంగరాముడు (1955)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: జిక్కి, ఆర్. నాగేశ్వరరావు
పల్లవి:
రారోయి మా ఇంటికి ... "మ్మ్"
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది... "హాహ్హా"
మాటున్నది మంచి మాటున్నది ... "ఆఁ"
చరణం 1:
నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది... "ఆహా"
నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది ... "ఆహా"
నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది ...."అహ్హహ్హహ్హ .. భలే భలే"....
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి ... "మ్మ్"...
మావో మాటున్నది మంచి మాటున్నది
చరణం 2:
ఆకలైతే సన్నబియ్యం కూడున్నది .. "మ్మ్"
నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది .. "బావుంది బావుంది"
అందులోకి అరకోడి కూరున్నది .. "అహహ్హ అవ్వల్రైట్ యెర్రీ గుడ్"
అందులోకి అరకోడి కూరున్నది... "ఆఁ"
ఆపైన రొయ్యప్పొట్టు చారున్నది ... "అహహ్హా.. అబ్బో అబ్బో"
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి ... "అంతేగా"...
మావో మాటున్నది మంచి మాటున్నది
చరణం 3:
రంజైన మీగడ పెరుగున్నది .... "బుర్ వీ... చీ చీ చీ చీ"
నంజుకొను ఆవకాయ ముక్కున్నది ... "ఆహ్.. డోంట్ వాంట్"
రోగమొస్తె ఘాటైన మందున్నది .. "అహ్.. అహహ అహ్హ"
రోగమొస్తె ఘాటైన మందున్నది .. "ఆ"
నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది ... "అహ్హహహహహహ ఊ ఓహొహొహొహొ"
చిత్రం: దొంగరాముడు (1955)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
బోసినవ్వుల బాపూజీ
చిన్నీ పిలక బాపూజీ
భలే తాత మన బాపూజీ
బాలల తాతా బాపూజీ
చరణం 1:
కుల మత భేదం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోశాడు
చరణం 2:
నడుం బిగించి లేచాడు
అడుగూ ముందుకు వేశాడు
కదం తొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం
మనకు లభించెను స్వారాజ్యం
మనకు లభించెను స్వారాజ్యం
చరణం 3:
సత్యాహింసలే శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవ ధర్మం బోధించాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మానవ ధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు
చిత్రం: దొంగరాముడు (1955)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి
పల్లవి:
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఓ ఓ...చిగురాకులలో చిలకమ్మ
ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేనా
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
చరణం 1:
వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
చరణం 2:
పై మెరుగులకే భ్రమపడకయ్య
మనసే మాయని సొగసయ్య
గుణమే తరుగని ధనమయ్య
ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
చిత్రం: దొంగరాముడు (1955)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
ఆఅ ఆఅ ఆఆ........
అనురాగము విరిసేనా ఓ రే రాజా
అనుతాపము తీరేనా
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా ఓ రే రాజా
అనుతాపము తీరేనా
చరణం 1:
నిలిచేవు మొయిలూ మాటునా పిలిచేవూ కనులా గీటునా
నిలిచేవు మొయిలూ మాటునా పిలిచేవూ కనులా గీటునా
పులకించు నాదు డెందము ఏ నాటి ప్రేమాబంధమో...
ఓ రే రాజా...అనురాగము విరిసేనా
చరణం 2:
మునుసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో
మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమొ తేటగా తెనిగించవయ్య మహరాజా
ఓ రే రాజా...అనురాగము విరిసేనా..
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా
అనురాగము విరిసేనా....
No comments:
Post a Comment