ఎదురీత (1977)

చిత్రం :  ఎదురీత (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

తొలిసారి ముద్దివ్వమంది... చెలిబుగ్గ చేమంతి మొగ్గ
ఓ..ఓ..ఓ..ఓ...
తొలిసారి ముద్దివ్వమంది... చెలిబుగ్గ చేమంతి మొగ్గ

పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగ
ఆ... ఆ.. ఆ.. ఆ
ఉమ్మ్..ఉమ్మ్మ్... ఉమ్మ్..
ఆ... ఆ.. ఆ.. ఆ
ఉమ్మ్..ఉమ్మ్మ్... ఉమ్మ్.. 

చరణం 1 :

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసి నాకోసం..
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం.. తెరచాటు సొగసులారబోసి నాకోసం

నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే..
నీ ఊపిరి తాకి... మనసు వేణువులూదే..

తొలిసారి ముద్దివ్వమంది.. చెలిబుగ్గ చేమంతి మొగ్గ

చరణం 2 :

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం.. సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం..

నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే..
నీ నడకలలోనే...  వయసు మువ్వలు మోగే..

ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగ

చరణం 3 :

ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా..
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా.. ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా

నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి..
తొలిమచ్చికలోనే... సగమిచ్చిన హాయీ...

తొలిసారి ముద్దివ్వమంది.. చెలిబుగ్గ చేమంతి మొగ్గ

పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమంది చిరుకాటు ఈ తేనెటీగ

************* *********** ********* *
చిత్రం :  ఎదురీత (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత :   
నేపధ్య గానం :  బాలు 

పల్లవి :

ఉమ్మ్.. ఉం.. ఉమ్మ్.. ఉమ్మ్మ్...

ఎదురీతకు అంతము లేదా... నా మదిలో రేగే గాయం మానిపోదా
ఎదురీతకు అంతము లేదా... నా మదిలో రేగే గాయం మానిపోదా 
వాడిన ప్రేమ వసంతం... ఏనాడయిన వికసంచి రాదా

ఎదురీతకు అంతము లేదా... నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం 1 :

సాగరమే నా చేరువనున్నా... దాహం తీరదులే
తీరలేవో చేరుతువున్నా... దూరం మారదులే
ఇది నడి ఏట తీరాల వేట... ఇంకెనాాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతము లేదా... నా మదిలో రేగే గాయం మానిపోదా

చరణం 2 :

చేయని నేరం చెలిమిని కూడా మాయం చేసేనా
మాసిన మదిలో మమతలు కూడా గాయం చేసేనా   
నా యను వారే పగవారైతే... ఇంకెన్నాళ్ళు ఈ ఎదురీత

ఎదురీతకు అంతము లేదా... నా మదిలో రేగే గాయం మానిపోదా 
వాడిన ప్రేమ వసంతం... ఏనాడయిన వికసంచి రాదా

ఎదురీతకు అంతము లేదా... నా మదిలో రేగే గాయం మానిపోదా

************* *********** ********* *
చిత్రం :  ఎదురీత (1977)
సంగీతం :  సత్యం
గీతరచయిత : సినారె  
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :

ఈ రాధ చివరకు ఏమైనా.. ఆ గాధ నీదేలే 
ఈ రాధ చివరకు ఏమైనా.. ఆ గాధ నీదేలే 
కలలన్నీ అలలైన యమునా నదిలో... కలతల కన్నీరే...

ఈ రాధ చివరకు ఏమైనా.. ఆ గాధ నీదేలే 

చరణం : 1

బృందావనిలో బిగికౌగిలిలో... అల్లికలేమాయే... కలయికలేమాయే...
వ్రేపల్లియలో.. వేణువు ఎదలో.. గీతికలేమాయే... 
మధురాపురిలో.. నడిరాతిరిలో... మాధవుడేమాయే...

ఈ రాధ చివరకు ఏమైనా.. ఆ గాధ నీదేలే 

చరణం : 2

మరుమల్లెలలో... విరిజల్లులలో.. మల్లికలేమాయే... మధురిమలేమాయే..  
ఆ కన్నులలో... వెన్నెల దాచిన పున్నమలేమాయే...
చేసిన బాసలు.. పూచిన ఆశలు.. రాలిన పూలాయే...

ఈ రాధ చివరకు ఏమైనా.. ఆ గాధ నీదేలే  

No comments:

Post a Comment