సూర్యచంద్రులు (1977)



చిత్రం :  సూర్యచంద్రులు (1977)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం :  బాలు 


పల్లవి :

మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా


చరణం 1 :


ఎన్నెన్ని ఆశలు ఎదలోన ముడిచీ... ఇన్నాళ్ళు ఆ రాధ వేచిందీ
తన మాధవుని చేయి తాకిన ఆ రేయి
తన మాధవుని చేయి తాకిన ఆ రేయి
తనువెల్లా యమునా తరంగమై పొంగింది.... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా


చరణం 2 :


హృదయాల అలజడి నయనాలు తెలుపగ
అధరాలు పొందేను గిలిగింతలు
కరములు కలిసే...  సుమ శరములు కురిసే
మరులు తొందరించే...  సిగ విరులు పరవశించే
తెరలుగా దొంతరలుగా స్పందించుపోవు ఆ రాసకేళిలో... ఆ..
ప్రతి అణువు బృందా నికుంజమై పలికింది... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా

********************** ************************ 
చిత్రం :  సూర్యచంద్రులు (1977)
సంగీతం :  రమేశ్ నాయుడు
నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ


పల్లవి :

ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..
మనసంతా విప్పాలని..
అంతే..అంతే.. అంతే..!

ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..
మనసంతా విప్పాలని..
అంతే..అంతే.. అంతే..!


చరణం 1 :

చూసీ.. బాణాలు దూసీ.. ప్రాణాలు తీసీ..
ముసి ముసి నవ్వు విసిరేయకూ..
ఊగీ.. మబ్బల్లే.. మూగీ.. మెరుపల్లే.. సాగీ
నా గుండెల్లో ముసురేయకు..

చూసీ.. బాణాలు దూసీ.. ప్రాణాలు తీసీ..
ముసి ముసి నవ్వు విసిరేయకూ
ఊగీ.. మబ్బల్లే.. మూగీ.. మెరుపల్లే.. సాగీ
నా గుండెల్లో ముసురేయకు..

హోలోలే.. హోలోలే.. హోలోలోహోలోలే..
అంతే..అంతే..అంతే! 

ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..
మనసంతా విప్పాలని..
అంతే..అంతే.. అంతే..!


చరణం 2 :


కోరీ.. ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ
నా మనసింక ఊరించకు..
వలచి.. ఈ వేళ పిలిచి... దూరాన నిలిచి
నను మరికాస్త ఉడికించకు..

కోరీ..ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ
నా మనసింక ఊరించకు..
వలచి.. ఈ వేళ పిలిచి... దూరాన నిలిచి
నను మరికాస్త ఉడికించకు..

హోలోలే..హోలోలే..హోలోలోహోలోలే..
అంతే..అంతే..అంతే..

ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..
మనసంతా విప్పాలని..
అంతే..అంతే.. అంతే..!

No comments:

Post a Comment