రాజా రమేష్ (1977)



చిత్రం : రాజా రమేష్ (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో..ఓ.. రసికుడు దేవుడు 

చరణం 1:

పువ్వులను నవ్వమని పుట్టించాడూ...
నవ్వలేని నాడు రాలి పొమ్మన్నాడూ...

పువ్వులను నవ్వమని పుట్టించాడూ...
నవ్వలేని నాడు రాలి పొమ్మన్నాడూ...

నువ్వు లేక నవ్వు లేక ఉండమన్నాడూ...
నా తలరాత ఎందుకో తలక్రిందుల రాశాడూ..ఊ...

ఎంతో..ఓ.. రసికుడు దేవుడు 

చరణం 2:

నిన్ను కొలిచాను ఎన్నెన్నో పూలతో
నన్ను కడతేర్చమన్నాను తాళిబొట్టుతో

నిన్ను కొలిచాను ఎన్నెన్నో పూలతో..ఓ..
నన్ను కడతేర్చమన్నాను తాళిబొట్టుతో

నా దేవుని పూజకు తగని పూవునో
నా దేవుని పూజకు తగని పూవునో
పిలిచావా పుణ్యమూర్తినీ...ఈ...
నిలిపావీ పాపిని



********** *********** ************* **************
చిత్రం :  రాజా రమేష్ (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
నేపధ్య గానం :  బాలు


పల్లవి :

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో..ఓ.. రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో రసికుడు దేవుడు...ఊ... 

చరణం 1:

పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు
రంగులన్ని రంగరించి పూత పూసినాడు
పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు
రంగులన్ని రంగరించి పూత పూసినాడు

ఆ ఘుమఘుమలు గుమ్మరించి శ్వాస నింపినాడు
నీ శ్వాస నింపినాడూ...
నీ పెదవులలో పూదేనియ పొదిగి తీర్చినాడూ...ఊ..

ఎంతో రసికుడు దేవుడు... 

చరణం 2:

నల్లని కురులులోకి మల్లెపూలు సొగసు
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు
నల్లని కురులులోకి మల్లెపూలు సొగసు
పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు

ముద్దులొలుకు మోముకు ముద్దబంతి పొందికా...ఆ...
మొత్తంగా ఏ పువ్వు నీకు సాటిరాదుగా...ఆ...

ఎంతో రసికుడు దేవుడు
ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు
ఎంతో రసికుడు దేవుడు...  

********** *********** ************* **************

చిత్రం : రాజా రమేష్ (1977)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :

నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి
నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...

నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి
నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..
నేలమీది జాబిలి... 

చరణం 1:

పిలిచెను కౌగిలింత రమ్మనీ...ఇమిడిపోమ్మనీ
తెలిసెను పులకరింత ఇమ్మనీ..దోచి ఇమ్మనీ...
మనసుకు వయసు వచ్చు తీయనీ రేయినీ

ఆ...ఆ...ఆ...
వయసుకు మతిపోయి పోందనీ హాయినీ
తొలి ముద్దు ఇవ్వనీ..మరుముద్దు పొసగనీ

మలి ముద్దు ఏదనీ..మైమరచి.. అడగనీ
నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి...

నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..
నేలమీది జాబిలి... 

చరణం 2:

వెన్నెల తెల్లబోయి తగ్గనీ..తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గుమానీ..మొగ్గనీ...కలలు నెగ్గనీ

తరచిన మల్లెలు ఫక్కుమనీ ..నవ్వనీ..
పగటికి చోటివ్వక ఉండనీ..రాత్రినీ..

దీపాలు మలగనీ...ఆ...తాపాలు పెరగనీ...ఆ..
రేపన్న దానినీ ఈ పూటే చూడనీ...

నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి...
నా చెలీ... నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..
నేలమీది జాబిలి...  

No comments:

Post a Comment