ఈరోజు ఇల్లాలి కోరికలు చిత్రం నుండి ఒక చక్కటి పాట మీ కోసం ,వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ చూడవచ్చు
సినిమా:- ఇల్లాలి కోరికలు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు
బాటలు వేరైనా బాటసారులు ఒకటే
నడకలు వేరైనా అడుగుజాడలొకటే
చీలిన బాటలు చేరే కూడలి
ఎక్కడ ఉందో..ఎప్పుడు వస్తుందో
కోరికలుండాలి..అవి కొరతలు తేరాదు
పట్టుదలుండాలి..అది పంతం కారాదు
చిటపడలాడే కోపాలు
చిరుచిరు కలతల తాపాలు
సంసారంలో కెరటాలు
ఆ కెరటాలే కడలికి అందాలు
ఆ అందాలే ఆలు మగల బంధాలు
అలలను కలిపే చెలియలికట్టను
చేరేదెపుడొ..చేర్చేదెవరో
కలిసిన హ్రుదయల్లో కలహాలే మేఘాలు
ఉరుములు మున్నాళ్ళు..ఎద మెరుపులు నూరేళ్ళు
ఒకరికి ఒకరు అద్దాలై
ఇద్దరు ప్రేమకు బింబాలై
ఉండాలమ్మ దంపతులు
ఆ దంపతులు పెంచే సంపదలు
ఈ నడియాడే పాపల నవ్వుల దీపలు
ఈ దీపాలను దీపావళిగా
చూచేదెపుడో..ఆ శుభదినమెపుడో
సినిమా:- ఇల్లాలి కోరికలు
సాహిత్యం:- ఆత్రేయ
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు
బాటలు వేరైనా బాటసారులు ఒకటే
నడకలు వేరైనా అడుగుజాడలొకటే
చీలిన బాటలు చేరే కూడలి
ఎక్కడ ఉందో..ఎప్పుడు వస్తుందో
కోరికలుండాలి..అవి కొరతలు తేరాదు
పట్టుదలుండాలి..అది పంతం కారాదు
చిటపడలాడే కోపాలు
చిరుచిరు కలతల తాపాలు
సంసారంలో కెరటాలు
ఆ కెరటాలే కడలికి అందాలు
ఆ అందాలే ఆలు మగల బంధాలు
అలలను కలిపే చెలియలికట్టను
చేరేదెపుడొ..చేర్చేదెవరో
కలిసిన హ్రుదయల్లో కలహాలే మేఘాలు
ఉరుములు మున్నాళ్ళు..ఎద మెరుపులు నూరేళ్ళు
ఒకరికి ఒకరు అద్దాలై
ఇద్దరు ప్రేమకు బింబాలై
ఉండాలమ్మ దంపతులు
ఆ దంపతులు పెంచే సంపదలు
ఈ నడియాడే పాపల నవ్వుల దీపలు
ఈ దీపాలను దీపావళిగా
చూచేదెపుడో..ఆ శుభదినమెపుడో
No comments:
Post a Comment