కొన్ని మూవీస్ చూసాక దాని ఫీల్ నుంచి బయటికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది.అలా నాకు ఫస్ట్ టైం అనిపించినా మూవీ ప్రస్థానం.
ఈ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే కానీ ఈ మూవీ లో నాకు బాగా నచ్చిన సీన్
శర్వా వాళ్ళ మదర్ వాళ్ళ అక్కని ఫంక్షన్ కి పిలవడానికి వెళ్తుంది.మీ నాన్న ఫంక్షన్ కి రమ్మన్నాడు అని అనడం తోనే, అతను నాకు నాన్న కాదు నీకు భర్త మాత్రమే అని అంటుంది.
మీ కోసమే కదా అతన్ని పెళ్లి చేసుకుంది అని అనడం తో, మా కోసం పెళ్లి చేసుకుంటే అతనితో కలిసి ఇంక్కొక్కడిని ఎందుకు కన్నావు అని అడుగుతుంది.
దానితో ఏడుస్తూ ఇంటికి వెళ్లి సాయి కుమార్ తో మా కోసం మిమ్మల్ని మా బానిసగా చేసుకోవడం ఇష్టం లేకనే మీతో సంసారం చేశాను అని చెప్తుంది. ఇక్కడ ఎవరి సైడ్ నుంచి చూస్తే వారిదే కరెక్ట్ అనిపిస్తుంది.
రాజకీయం అంటే పులి మీద స్వారీ చేయడం లాంటిది,ఒక్కసారి దిగితే ఆ పులి మనల్నే తినేస్తుంది అంటూ సాయికుమార్ చెప్పే దీలౌగె రాజకీయం అంటే ఏమిటో చెప్తుంది.
సినిమా మొత్తం ఒక్క ఎత్తు అయితే చ్లిమక్ష్ ఒక ఎత్తు, ఒక్క సారిగా సినిమా చూస్తున్న అందరిని షాక్ కి గురిచేస్తుంది. మనుషులు ఇంత దారుణం గా ఆలోచిస్తారా అని 2010 లో ఈ మూవీ చూసాకే అర్ధం అయింది.
క్లైమాక్స్ సీన్ లో దీలౌగెస్
ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలగొట్టే పాత్రే లేదు..
నీకు తీర్పిచ్చే శాసనం లేదు..''
సాయికుమార్ : (గాఢంగా స్వాస లోనికి పీల్చుకుని..) 'ఒక్క సారి ఆ పురాణాల్ని దాటొచ్చి చూడు అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలూ.. విలన్లూ లేరీ నాటకంలో
మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మమొక్కటే అహం...
ప్రతి పురుగును కదిలించే నిజమొక్కటే ఆకలి..
తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే.. ఆశ..
ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది...
నితీ, నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయ్..
ఆ.. రోజు.. ఆ.. క్షణం..
నా స్వాధీనంలో లేకుండా చేసిన తప్పుకోసం..
జీవితమం..తా లెక్క చెల్లిస్తునే ఉన్నా...
తండ్రిలా.. భర్తలా.. బంట్రోతులా...
ఆలోచించి తప్పు చేసినవాణ్ణే అయితే..
ఆరోజే వీణ్ణి చంపి నిజాన్ని పాతిపెట్టేవాణ్ణి..(పక్కన ఉన్న నమ్మిన బంటును చూపిస్తూ..)
ఇప్పటి వరకు ప్రస్థానం మూవీ చూడని వాళ్ళు ఇప్పటికైనా చుడండి. ఒక మంచి కథ కి మంచి నటులు దొరికితే ఎలా ఉంటుందో ప్రస్థానం మూవీ చూస్తే అర్ధం అవుతుంది
మూలం : అనామిక దేవి

No comments:
Post a Comment