1980 వరకు సినిమా యొక్క స్వర్ణయుగం అని చెబుతారు సినీ పెద్దలు. అయితే అటుపై కమెర్షియల్ సినిమాలు, స్టార్ హీరోలు అంటూ రావడం మొదలు కావడంతో మూస ధోరణి అనేది రివాజు అయింది. మణిరత్నం 1983 లో పల్లవి అను పల్లవితో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ ,1986 లో వచ్చిన మౌనరాగం సినిమాతోనే అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. నాయగన్(నాయకుడు) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. టైమ్స్ మ్యాగజైన్ 100 అత్యుత్తమ సినిమాలలో దానికి స్థానం దక్కింది. అగ్ని నచత్తిరం కమెర్షియల్ హిట్. 1990 దశకం ఆరంభంలో వచ్చిన ఇద్దరు గొప్ప దర్శకులు మణిరత్నం, ఋఘ్వ్. సినిమా కథ,కథనాల పరంగానూ, శైలి పరంగానూ, సాంకేతికత పరంగానూ ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. సినిమాల్లో అడుగు పెట్టాలనుకునే ఎంతోమంది యువ దర్శకులకు వీరిరువురూ స్ఫూర్తిగా నిలిచారు. అందులో అందరిచే కొనియాడబడ్డ దర్శకుడు మణిరత్నం. తన సినిమాలలో కథ విశ్వజనీయమై ఉండటం వలన అది అందరిచే కొనియాడబడింది.
కెరియర్ అత్యుత్తమ చిత్రాలు
1.మౌనరాగం
2.నాయగన్(నాయకుడు)
3.గీతాంజలి
4.అగ్ని నచ్చతిరం (ఘర్షణ)
5. అంజలి
6.రోజా
7.దళపతి
8.బొంబాయి
9.ఇరువర్(ఇద్దరు)
10.దిల్ సే(ప్రేమతో)
11.అలై పాయుదే(సఖీ)
12.కన్నత్తిల్ ముత్తమిట్టాల్(అమృత)
13.ఆయుధ ఎళుత్తు(యువ)
14.గురు
బాగోని సినిమాలు
1.కడల్(కడలి)
2.కాట్రూ వెలియిడై(చెలియా)
మణిరత్నం సినిమాలు చాలా మట్టుకు బాగున్నప్పటికి కొన్ని సందర్భాలలో అవి ఆర్థికంగానైతే విజయం సాధించలేదనే చెప్పాలి. ఇండియన్ దర్శకులలో తాను ఎంచుకునే కథ ఏదో ఒక కోణంలో వైవిధ్యంగా ఉంటుంది.
అకీరా కురోసావా ఆయనకు ఇష్టమైన దర్శకుడు. ఆయన తీసిన 'రెడ్ బియర్డ్' తనకు సినిమాలు తీసేందుకు ప్రేరణ అని ఓ సందర్భంలో చెప్పారు. హిందీలో గురుదత్ వంటి దర్శకులు క్లాసిక్స్ అనే విషయాన్ని ఎప్పుడో తీసేసారు. మేము చేసేది వాళ్ళు చేసిన దాంట్లో కొంత వరకు అయినా అందుకోవాలనే ప్రయత్నమే తప్ప మరేమీ లేదు అన్నారు.
మౌనరాగంలో ఓ అందమైన ప్రేమకథ కావచ్చు. నాయకుడిలో గాడ్ ఫాదర్ ఛాయలు ఉన్న సినిమా కావచ్చు. అగ్ని నచ్చతిరం సినిమాలో ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అతని కుమారుల మధ్య నెలకొన్న విభేదాల నుండి స్ఫూర్తి పొంది తెరకిక్కించిన కథ కావచ్చు. అంజలి వంటి ఓ చిన్నారి కథ కావచ్చు. రోజా, దిల్ సే, బొంబాయి వంటి సినిమాలలో తీవ్రవాదం, మత వివాదాలను తెరకెక్కించిన విధానం కావచ్చు. దళపతిలో మహాభారతం నుండి స్ఫూర్తి పొంది అందులో కర్ణుడు,దుర్యోధనుల స్నేహాన్ని తీసుకొని కథగా తెరకెక్కించిన విధానం కావచ్చు. ఇరువర్ సినిమాలో అప్పటి తమిళ నటుడు ంఘృ, కరుణానిధి మధ్య గల సంబంధాన్ని తెరకెక్కించిన విధానం కావచ్చు. అలైపాయుదే లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యలను తీసిన విధానం కావచ్చు. కన్నత్తిల్ ముత్త మిట్టల్ లో తన తల్లి ఉనికికై వెదికే ఓ చిన్నారి హృద్యమైన కథ కావచ్చు. ఆయుధ ఎళుత్తు లో యువత రాజకీయాలలోకి రావలసిన ఆవశ్యకతను గురించి గాని, నటనే రాని అభిషేక్ బచ్చన్ తో రిలయన్స్ దిగ్గజం ధీరుబాయ్ అంబానీ కథను తెరకెక్కించిన విధానం కావచ్చు ప్రతి సినిమాలో కథలో, కథనంలో తనదైన వైవిధ్యంతో ఆకట్టుకుంటూనే వున్నారు మణిరత్నం.
మౌనరాగం, నాయకుడు,దళపతి,ఇరువర్, కన్నత్తిల్ ముత్తమిట్టాల్ సినిమాలు కల్ట్ క్లాసిక్స్.నాకు మౌనరాగం, ఇరువర్ అంటే బాగా ఇష్టం. మౌనరాగం ప్రేమ సినిమా అంటేనే మనసున మెదిలే మొదటి సినిమా అదే. అటువంటి పిచ్చే బహుశా హను రాఘవపూడిని అందాల రాక్షసి తీసేందుకు వెంటాడిందేమో.
ఇళయరాజాతో దళపతి చిత్రం రీరికార్డింగ్ లో కొన్ని చోట్ల మార్చాల్సిన విషయంలో ఇద్దరి మధ్య వివాదం. మార్చమన్నందుకు ఇళయరాజా ఒకసారి నేను కంపోజ్ చేసాక ఆ దేవుడే చెప్పినా మార్చను అని ఖచ్చితంగా చెప్పేయడంతో ఇక అప్పటి నుండి వీరి కాంబినేషన్ కు తెర పడింది. రెహమాన్ తో ప్రస్థానం కొనసాగింది.
ప్రస్తుతం తాను ఎంచుకుంటున్న కథలు కాస్త బలహీనంగా ఉండేందుకు గల ప్రధాన కారణం, ఆయన వద్ద ఎప్పుడూ పనిచేసే రచయిత సుజాత మరణం. ఆ లోపం ఆయన ఎంచుకున్న కథల్లో నే ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది.
తెలుగులో తెన్నేటి సూరి చెంగిజ్ ఖాన్ నవలలా తమిళంలో కల్కి అనే రచయిత రాసిన 'పొన్నియిన్ సెల్వన్' అనే నవల ఒకటుంది. దానిని ఎలాగైనా సినిమాగా తెరకెక్కించాలి అన్నదే ఆయన కల. అయితే అది భారీ ఖర్చుతో కూడుకున్న మల్టీ లేయర్డ్ కథ. అయితే అది చేయగల సామర్ధ్యం కూడా ఆయనకి ఉంది అని చెప్పొచ్చు. రీసెంట్ గా దీనికి అంకురార్పణ జరిగింది.
నాకు ఆయన తీసిన వాటిలో మౌనరాగం, కన్నత్తిల్ ముత్తమిట్టాల్ వాటితో పాటు నాయకుడు, గురు వ్యక్తిగతంగా బాగా ఇష్టం.
ఆయన శైలి :
*మణిరత్నం సినిమాలలో భావోద్వేగాలను అందంగా తెరకెక్కిస్తాడు.
*పొలిటికల్ డ్రామా ను కూడా చాలా క్లాస్ గా తియ్యగల నేర్పు ఉన్న దర్శకుడు.
* కథ,కథనం, సాంకేతికత, సినిమాటోగ్రఫీ,సంగీతం అన్నింటిలోనూ ఓ నేర్పు ఉంటుంది. సాధారణంగా దర్శకులు ఏదో ఒక ఒకటి అరా విషయాల్లోనే శ్రద్ద కనబరుస్తారు.
*తమిళ మహాకవి బారతియార్ కవితలను ప్రతి సినిమాలో ఏదో ఓ సందర్భంలో వాడతాడు.
*తన సినిమాలలో వాన సీన్స్ ఖచ్చితంగా ఉంటాయి.
*తన సినిమాలలో ప్రకృతి,లొకేషన్స్ కూడా ఓ రోల్ ప్లే చేస్తాయి.
*రైలు సెqఉఎంచె, సముద్రపు ఒడ్డు తప్పకుండా ఉంటుంది.
*హీరోయిన్ కి ఒక సాంగ్ ఉంటుంది , అది కూడా వర్షంలో ముఖ్యంగా ఉంటుంది.
*తన సినిమాలలో చిన్న పిల్లల సీన్స్ కచ్చితంగా ఉంటాయి,ముఖ్యంగా ఆడ పిల్లలు ఉంటారు.
*తన సినిమాలలో వ్యక్తులు మాట్లాడే డైలాగ్ కి, డైలాగ్ కి మధ్య గ్యాప్ ఇచ్చి మాట్లాడతారు.
*తాను తెలుగులో డబ్ చేసిన సినిమాలకు అన్నింటికి వేటూరి గారితోనే పాటలు రాయించుకునేవారు. తమిళంలో అయితే వైరముత్తు.
* ఆయన సినిమాల్లో కొట్టొచ్చినట్లు కనబడే విషయం ఏమిటంటే సినిమాకు డీటైలింగ్ ఇవ్వాల్సిన చోట, లాజిక్ లను విడమరిచి చెప్పాల్సిన చోట సున్నితంగా తప్పుకొని ఇంకో సీన్ కు వెళ్ళిపోతారు.
*దళపతి, రావణన్, రోజా వంటి సాంఘిక సినిమాలకి పురాణా ల టచ్ ఇచ్చి ఉంటారు మణిరత్నం. దళపతి కి మహాభారతం, రావణన్ కి రామాయణం, రోజాకి భర్త ప్రాణాలను కాపాడుకోవాలి అని తపించే సత్యవంతుడు,సావిత్రి.
మూలం : -Srinivas Teppala

No comments:
Post a Comment